Latest Updates
-
కేవలం 20 నిమిషాల్లో కమ్మని వంకాయ రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ -
మగాళ్లను చంపి ఎలా తప్పించుకోవాలి..? మెట్రోలో మహిళ చేసిన షాకింగ్ పని.. వైరల్ వీడియో.! -
బ్లాక్ క్యాట్ గర్ల్ ఫ్రెండ్ అంటే ఏంటి?..మీ పార్టనర్ కు ఈ లక్షణాలు ఉన్నాయా? -
బాత్రూమ్లో దుర్వాసన.. సువాసన వెదజల్లే ఫ్రెషనర్స్ ఇంట్లోనే 5 నిమిషాల్లో రెడీ.! -
వర్షాకాలంలో పండ్లు, కూరగాయలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే.. ఇలా చేయండి.! -
కండరాల బలానికి, రోజంతా ఎనర్జీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..10 నిమిషాల్లో ఎగ్ అవకాడో ఖాఖ్రా చాట్ చేయండిలా.. -
మీ స్నేహితుల్లో ఈ 4 లక్షణాలు ఉంటే వెంటనే దూరం పెట్టండి! -
ఆకలి తీరాలి, బరువు పెరగకూడదు..అయితే డిన్నర్ కి ఇది బెస్ట్ చాయిస్..10 నిమిషాల్లోనే చేసేయండిలా! -
బానిసత్వం పోయింది బాస్: సిక్ లీవ్ అడిగిన ఉద్యోగి..మేనేజర్ ప్రశ్నకు జెన్ జీ ఉద్యోగి దిమ్మతిరిగే కౌంటర్ -
పప్పులు నానబెట్టే పనే లేదు.. అప్పటికప్పుడు అచ్చం పునుగుల్లా ఉండే మినీ రైస్ బోండా చేసుకోండిలా..
చోపింగ్ బోర్డ్ క్లీన్ చేయడానికి 4 సూపర్ ట్రిక్స్ & టిప్స్
వంటగదిలో(నైఫ్) కత్తి లేదా చాకు లేకుండా ఏ వంటకార్యక్రమం పూర్తికాదు, అంత డిమాండ్ కత్తికి. కాయగూరలు, ఆకుకూరలు, ఉల్లిపాయలు, మాంసాహారలు, పండ్లు కట్ చేయడానికి కత్తిని వంటగదిలో విరివిగా ఉపయోగిస్తుంటారు. అయితే దీర్ఘకాలం పాటు చోపింగ్ బోర్డ్(కత్తిపీట)లేదా కత్తిని ఉపయోగించడం వల్ల అది మురికి పట్టి డర్టీగా మారుతుంది. కొన్ని సందర్భాల్లో పసుపుపచ్చవర్ణంలో బాగా కనబడుతూ కనబడుతుంటుంది . మరో సమయంలో మీరు కత్తి మీట మీద చిలుము పట్టడం లేదా మొండి మరకలు గమనించే ఉంటారు. అయితే వాటిని అలా వదిలేసి అశ్రద్ద చేయకుండా వెంటనే కొంత శ్రద తీసుకొని ఓపికతో వాటిని శుభ్రపచడం వల్ల అవి తిరిగి కొత్త వాటిలా మెరుస్తుంటాయి. అంతే కాదు బాగా తెగుతాయి కూడా....
అయితే, ఈ చోపింగ్ బోర్డ్ కానీ, కత్తి లేదా కత్తిపీటలను కానీ శుభ్రం చేయడం ఎలా అని చాలా మంది సందేహం ఉంటుంది. చాలా సింపుల్ గా మన వంటగదిలోని వస్తువులతోనే వీటిని శుభ్రం చేయవచ్చు. ఉదాహరణకు: నిమ్మరసం, వెనిగర్, ఉప్పు మరియు ఇతర కొన్ని క్లీనింగ్ ఏజెంట్స్ తో వీటి శుభ్రం చేయవచ్చు. ఇటువంటి నేచురల్ క్లెన్సర్స్ ను ఉపయోగించడం వల్ల ఎటువంటి మరకలనైనా చాలా సులభంగా తొలగించుకోవచ్చు. అంతే ఆహారపదార్థాలను కట్ చేసే ఈ చోపింగ్ బోర్డ్స్ మీద రసాయణాలను ఎక్కువగా ఉపయోగించకూడదు. మరి మీ చోపింగ్ బోర్డ్ ను శుభ్రం చేయడానికి ఇక్కడ కొన్ని ఎఫెక్టివ్ టిప్స్ అందివ్వడం జరిగింది...

నిమ్మరసం: మీరు రెగ్యులర్ గా పచ్చిఅరటికాయ, బీట్ రూట్ వంటివి కత్తిపీట మీద తరిగినప్పుడు, మరకలు తప్పనిసరిగా ఏర్పడుతాయి. ఇవి తొలగించాలంటే నిమ్మరసం గ్రేట్ గా సహాయపడుతుంది. కాబట్టి నిమ్మరసాన్ని కొద్దిగా అప్లై చేసి కొద్దిసేపు అలాగే ఉంచాలి. తర్వాత నిమ్మకాయ తొక్కను తీసుకొని మరకల మీద బాగా రుద్దాలి. అంతే మొండి మరకలు చాలా సులువుగా తొలగిపోతాయి.

వెనిగర్ లో సోక్ చేయడం: మీ ఇంట్లో కనుక వైట్ ఫైబర్ చోపింగ్ బోర్డ్ ఉన్నట్లైతే అది పేల్ గా లేదా ఎల్లో కలర్లోకి మారినట్లైతే, మరి దీన్ని వెంటనే శుభ్రం చేయాలి. అందుకు మీరు ఒక మగ్గు వాటర్లో 2టేబుల్ స్పూన్ల వెనిగర్ ను మిక్స్ చేసి అందులో చోపింగ్ బోర్డ్స్ ను కొద్ది సమయం నానబెట్టాలి . ఈ క్లీనింగ్ సొల్యూషన్ మరింత ఎఫెక్టివ్ గా పనిచేయాలంటే, ఈ నీటిలో కొద్దిగా ఉప్పును కూడా వేయవచ్చు . ఇలా వేసి 10నిముషాలు నానబెట్టాలి. తర్వాత లిక్విడ్ సోప్ తో రుద్ది కడగాలి. అంతే మీ చోపింగ్ బోర్డ్స్ కొత్తగా మెరవాల్సిందే..

సాల్ట్ స్ర్కబ్: చోపింగ్ బోర్డ్ మీద బ్లాక్ మరకలు ఏర్పడినప్పుడు వాటిని తొలగించడం కొంచెం కష్టమే. మరియు వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు సందుల్లో మిగిలిపోయి ఉంటే కనుక ఇలాంటి బ్లాక్ మరకలు ఏర్పడుతాయి. అందుకు ఒక నిమ్మతొక్క తీసుకొని దాని మీద కొద్దిగా ఉప్పు చిలకరించి చోపింగ్ బోర్డ్ మీద రుద్ది శుభ్రం చేయాలి.

చింతపండు గుజ్జు: చింతపండు గుజ్జుకు కొద్దిగా ఉప్పు మిక్స్ చేసి శుభ్రం చేయడం వల్ల ఇది ఇక గ్రేట్ క్లీనింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఈ రెండింటి మిశ్రమంతో చోపింగ్ బోర్డ్ ను రుద్ది శుభ్రం చేయాలి. ఇలాంటి మనరకలన్నింటినీ నేచురల్ గా శుభ్రం చేయవచ్చు . ఎలాంటి మొండి మరకలైనా తొలగించాలంటే చింతపండు నీటిలో మొదట నానబెట్టి తర్వాత శుభ్రం చేయాలి.




Click it and Unblock the Notifications