Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
టవల్స్ క్లీన్ చేయడానికి&మెయింటైన్ చేయడానికి 6టిప్స్
స్నానం చేసిన తర్వాత మీరు టవల్స్ ను తడి ఆరడానికి భయట హ్యాంగ్ చేస్తారు. అలా కాకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం వల్ల వ్యక్తిగత శుభ్రతను పాటించవచ్చు. టవల్స్ ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి ఫ్రెష్ గా ఉంచాలి. మీ బాతింగ్ టవల్స్ డర్టీగా ఉన్నప్పుడు, మీరు అశుభ్రత జీవితంతో జీవిస్తున్నారని అర్ధం. అంటే ప్రతి సారి మీరు స్నానం చేసినప్పుడు, టవల్స్ ను రెగ్యులర్ గా క్లీన్ చేయాలి. మరియు ఎలా వాటిని మెయింటైన్ చేయాలో తెలుసుకోవాలి.
చాలా మంది ఈ బాతింగ్ టవల్స్ సరిగా శుభ్రం చేయకపోతే వివిధ రకాల చర్మం సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది . స్నానానికి ఉపయోగించే టవల్స్ సరిగా శుభ్రం చేయకపోతే చాలా త్వరగా పాడవుతాయి. ఉదాహరణకు: మీరు రెగ్యులర్ గా ఉపయోగించే టవల్స్ ప్రతి రోజూ వేడినీటిలో శుభ్రం చేయడం వల్ల కలర్స్ పోవడం మరియు స్టిఫ్ నెస్ పోవడం జరుగుతుంది. కాబట్టి మీరు బాతింగ్ టవల్స్ సురక్షితంగా శుభ్రం చేయాలి
బాతింగ్ టవల్స్ క్లీన్ గా మరియు ఫ్రెష్ గా ఉంచడానికి మీరు కొన్ని సింపుల్ చిట్కాలను పాటించాలి. బాత్ టవల్స్ ను శుభ్రం చేయడం అంత కష్టమైన పని కాదు, కానీ ఎక్కువ కాలం వాటిని మెయింటైన్ చేయడానికి అవగాహన కలిగి ఉండాలి. వీటితో పాటు కొన్ని చిట్కాలు మీకోసం...

ప్రతి సారి ఉపయోగించినప్పుడు ఎండలో ఆరబెట్టాలి:
ప్రతి రోజూ మీరు స్నానం చేసినప్పుడు, టవల్ తో తుడుచుకొన్న వెంటనే అవి పూర్తిగా తడిగా మారుతాయి. అటువంటి వాటిని ఎండలో వేసి ఆరబట్టాలి. ప్రతి రోజూ టవల్స్ ను శుభ్రం చేయడం సాధ్యం కాదు. కాబట్టి, ఎండలో ఆరబెట్టడం వల్ల బ్యాక్టీరియా నేచురల్ గా తొలగిపోతుంది.

కోల్డ్ వాష్:
బాతింగ్ టవల్స్ ను చల్లటి నీటిలో శుభ్రం చేయాలి. లేదంటే వాటి స్ట్రక్చర్ కోల్పోతుంది. టవల్ ను కోల్డ్ వాటర్ లో కొద్ది సమయం నానబెట్టి అరగంట తర్వాత శుభ్రం చేయాలి.

వాషింగ్ మిషన్ :
వాషింగ్ మెషిన్ లో టవల్స్ శుభ్రం చేయాలనుకొన్నప్పుడు, సున్నితమైన వస్తువులతో పాటు టవల్స్ వాష్ చేయాలి. అలాగే, వాషింగ్ మిషన్ లో డ్రై చేయడం లేదా స్పిన్ చేయడం చేయకూడదు.

యాంటీసెప్టిక్:
ఎల్లప్పుడు యాంటీసెప్టిక్ ద్రవాలను ఉపయోగించాలి . యాంటి సెప్టిక్ డిటర్జెంట్స్ మరియు ద్రవాలు క్రిములను నాశనం చేస్తాయి

ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్:
టవల్స్ చూడటానికి చాలా మాసినట్లుగా ఉంటే వాటినిక ఫ్యాబ్రిక్ సాప్ట్నర్స్ ను ఉపయోగించి వాష్ చేయాలి. ఫ్యాబ్రిక్ సాప్ట్నర్స్ ఉపయోగించేటప్పుడు చేత్తో లేదా మెషిన్ లో శుభ్రం చేసుకోవచ్చు.

వైట్ టవల్స్ బ్లీచ్ :
వైట్ టవల్స్ ను మెయింటైన్ చేయడం నిజంగా కష్టం. బ్లీచింగ్ ఉపయోగించి వైట్ టవల్స్ ను శుభ్రం చేయాలి లేదా నిమ్మరసం మరియు ఉప్పు మంచి బ్లీచింగ్ ఏజెంట్స్ గా ఉపయోగపడుతాయి.



Click it and Unblock the Notifications
