Latest Updates
-
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్!
ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ శుభ్రంగా వాష్ చేయడానికి సులభ చిట్కాలు
పండ్లు కానీ, కూరగాయలు కానీ ఏవైనా సరే, భూమిలో పండిచేవి, నీటి ద్వారా లేదా ఎరువు ద్వారా లేదా మట్ట ద్వారా కొంత బ్యాక్టీరియా పండ్లు, కూరగాయాలు, ఆకుకూరల మీద చేరుతుంది. ఈ హానీ కరమైన బ్యాక్టీరియాను నివారించడానికి వాటిని ఉపయోగించే ముందు శుభ్రంగా కడిగి తర్వాత వినియోగించుకోవాలి.
అలా నీటి ద్వారా లేదా ఎరువు ద్వారా వ్యాపించిన బ్యాక్టీరియాను శుభ్రంగా తొలగించకుడా వినియోగించినట్లైతే అది ఫుడ్ పాయిజన్ కు దారితీస్తుంది మరియు ఇతర ఆహారాల మీద కూడా చేరే అవకాశం ఉంది. కాబట్టి, మార్కెట్ నుండి తెచ్చినవి ఏవైనా సరే శుభ్రంగా కడిగి తర్వాత వండుకోవాలని తప్పక గుర్తుంచుకోవల్సిన విషయం. హానికర బ్యాక్టీరియాను తొలగించడానికి ఫ్రూట్ మరియు వెజిటేబుల్స్ ను శుభ్రపరచడానికి కొన్ని సులభ చిట్కాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

. 1. మొదట చేతులను శుభ్రపరచుకోవాలి. భయట నుండి తెచ్చిన ఎటువంటి ప్రోడక్ట్స్ నైనా ముట్టుకోవడానికి ముందుగా వాటని ముట్టుకొన్న తర్వాత చేతులు శుభ్రపరచుకోవడం మర్చిపోకూడదు .
2. అన్ని రకాల పండ్లు మరియు వెజిటేబుల్స్ ను వాటిని విగియోంచడానికి , తినడానికి లేదా వండటానికి ముందు కోల్డ్ రన్నింగ్ వాటర్ లో శుభ్రం చేసుకోవాలి. వాటి శుభ్రం చేయడానికి ఎటువంటి సోపులు, డిటర్జెంట్లు ఉపయోగించాల్సి అవసరం లేదు. నీటితో మాత్రమే శుభ్రం చేయాలి.
3. పండ్లు ఆపిల్స్, పీయర్స్, మరియు పీచెస్ వంటివి తినడానికి ముందు పొట్టు తొలగించడం లేదా శుభ్రంగా కడిగి , క్లీన్ గా ఉన్న పొడి వస్త్రంతో తుడవాలి . ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా చాకుల మీద పడకుండా నివారించవచ్చు.
4. నీటిలో బాగా శుభ్రంగా కడిగిన తర్వాత వాటిని తడి ఆరిపోయే వరకూ పొడిగా ఉన్న న్యూస్ పేపర్ లేదా పేపర్ టవల్ మీద వేయడం వల్ల ఎటువంటి బ్యాక్టీరియా అయినా తొలగిపోతుంది.
5. బ్రష్ ను కొనుగోలు చేయాలి. కీరదోసకాయ, బీరకాయ పొట్టు తీసే ఎటువంటి పండ్లైనా, కూరగాయలైరనా కీరదోసకాయల సర్ఫేస్ లో స్ర్కబ్ చేసి తర్వాత కట్ చేసుకోవాలి. అటువంటి ప్రదేశాల్లో బ్యాక్టీరియా పొంచి ఉంటుంది. కాబట్టి, బ్రష్ లకు అవి అంటకుండా క్లీన్ చేయాలి.
6. మీరు వండే పాత్రలను కూరగాయలు, పండ్లు నిల్వచేసే వాటిని శుభ్రం చేయాలి. పొట్టు నుండి కూడా బ్యాక్టీరియా ఏర్పడుతుంది. కాబట్టి, కట్ చేయడానికి ముందు లేదా తర్వాత మీరు పనిచేస్తున్న ప్రదేశం శుభ్రంగా ఉంచుకోవాలి.
7. కూరగాయలను పండ్లును జోరుగా నీళ్ళు వచ్చే ట్యాప్ క్రింద పెట్టి శుభ్రం చేయడం మంచిది. నీళ్ళు చిలకరించి కడగడం కంటే దారాళంగా వచ్చే నీటి క్రింద శుభ్రం చేయడం ముఖ్యం.
8. కొన్ని రకాల కూరగాయలకు కొంత మసం నీటిలో నానబెట్టి, తర్వాత శుభ్రం చేయాలి. ముఖ్యంగా బ్రొకోలీ, కాలీఫ్లవర్ వంటివాటిని కొంత సమయం నానబెట్టి, తర్వాత శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications