Latest Updates
-
నూనెలో డీప్ ఫ్రై లేకుండానే కరకరలాడే మసాలా పల్లీలు..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
మటన్ గిల్లీ బిర్యానీ..వాసనకి పక్కింటోళ్లు కూడా ప్లేట్ పట్టుకుని పరుగెట్టుకొస్తారు! -
ప్రతి రాత్రి సోంపు నీరు తాగుతున్నారా? నెల రోజుల్లో శరీరంలో జరిగే అద్భుత మార్పులివే! -
బియ్యం, మినప్పప్పు లేకుండానే అటుకులతో అప్పటికప్పుడు క్రిస్పీ మసాలా దోసె..అబ్బబ్బబ్బా అనాల్సిందే! -
చలికాలంలో రోజూ ఒక బెల్లం ముక్క తింటే ఏమవుతుంది? రోజుకు ఎంత, ఎలా తినాలో తెలుసా? -
బాలల దినోత్సవం స్పెషల్: ఓవెన్ లేకపోయినా పర్లేదు.. స్టవ్ మీదనే క్రిస్పీగా వేరుశెనగ బిస్కెట్లు చేసుకోండిలా! -
పాస్ వర్డ్ లో కామా పెడితే ఎవ్వరూ హ్యాక్ చేయలేరా? వైరల్ టెక్ ట్రిక్ వెనుక వాస్తవం ఇదే! -
కారంగా, కమ్మగా ఉండే కరివేపాకు చికెన్ రోస్ట్.. ఈ సీక్రెట్ మసాలాతో రుచి డబుల్! -
మన దేశం మధ్యలో ఉండి భారతీయులే వెళ్లలేని వింత గ్రామం..ఎక్కడుంది? ఆ కథేంటి? -
చలికాలంలో పచ్చి బఠానీ ఎందుకు తినాలో తెలుసా?
బల్లులను వదిలించుకోవటం కొరకు ఉత్తమ హోం రెమిడీస్
సాదారణంగా బల్లులు అంటే మన అందరికి పెద్ద విసుగు మరియు చిరాకు కలుగుతుంది. అయితే,బల్లులు దుష్ట కీటకాలను తగ్గించడం ద్వారా మనకు సహాయం చేస్తాయి. కానీ ఎటువంటి సంబంధం లేకుండా,మేము మా ఇంట్లో ఆహ్వానించని ఈ అతిధులను చూడాలని అనుకోవటం లేదు. మార్కెట్లో అందుబాటులో ఉండే బల్లి నిరోధకాలు,విషాలు అనేవి మీ పెంపుడు జంతువులు మరియు పిల్లలకు హాని కలిగించవచ్చు. కాబట్టి, ఇక్కడ బల్లులను వదిలించుకోవటం కొరకు కొన్ని ఉత్తమ హోమ్ నివారణలు పర్యావరణ అనుకూలమైన పద్ధతిలో ఉన్నాయి.

కాఫీ పౌడర్
కొంత కాఫీ పౌడర్ తో పొగాకు పొడి కలిపి చిన్న చిన్న బంతులుగా తయారుచేయాలి. టూత్ పిక్స్ తీసుకుని ఆ బంతులకు ఫిక్స్ చేయాలి. ఈ టూత్ పిక్స్ ను బల్లి మార్గం లేదా బల్లులు ఉండే స్థలాలలో ఉంచండి. అవి ఈ మిశ్రమాన్ని తీసుకుంటే చనిపోతాయి.

నాఫ్తలీన్ బంతులు
నాఫ్తలీన్ బంతులు మంచి పెస్ట్ కంట్రోలర్ అని చెప్పవచ్చు. వీటిని మీ వార్డ్ రోబ్ లో,నీటి సింక్ లో లేదా స్టవ్ కింద ఉంచాలి. ఈ నివారణ బల్లులకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

నెమలి ఈకలు
బల్లులు నెమలి ఈకలను చూసి భయపడతాయి. బల్లులు నివసించే గోడపై నెమలి ఈకలను అంటించవచ్చు. అలాగే ఫ్లవర్ వాజ్ లో కూడా పెట్టవచ్చు. అప్పుడు బల్లులు మీ ఇంటి నుండి పారిపోతాయి.

పెప్పర్ పెస్టిసైడ్ స్ప్రే
ఈ పురుగుమందులను పిచికారీ చేయడానికి నీటిని మరియు మిరియాలను కలపాలి.మీ వంటగది అరలు, ట్యూబ్ లైట్ మూలలు,స్టవ్ క్రింద మరియు ఫ్రిజ్ లో చల్లాలి. బల్లి మిరియాలు మరియు స్ప్రే వాసన యొక్క స్పైసీ కారణంగా విసుగు పొంది మీ ఇంటిని ఖాళీ చేస్తుంది.

చల్లని ఐస్ నీరు
బల్లుల మీద చల్లని ఐస్ నీరును పిచికారీ చేయాలి. దాని శరీర ఉష్ణోగ్రత తగ్గటం వలన,బల్లి కదలటానికి కష్టంగా ఉంటుంది. ఆ సమయంలో ఒక కార్డు బోర్డు బాక్స్ లో బల్లిని ఉంచి మీ ఇంటి నుంచి బయటకు వేసేయండి.

ఉల్లిపాయ
గోడకు వ్యతిరేకంగా ఉల్లిపాయ ముక్కలను ఉంచండి. అలాగే బల్లులు దాగి ఉన్న ప్రదేశాల్లో వాటిని ఉంచండి.ఉల్లిపాయ సల్ఫర్ సమ్మేళనం కలిగి ఒక చెడు వాసనను సృష్టిస్తుంది. ఇది బలు తిప్పికొట్టేందుకు సహాయపడుతుంది.

ఎగ్ షెల్స్
ఎగ్ షెల్స్ మానసికంగా బల్లులను బుకాయించడంలో సహాయం చేస్తాయి. గుడ్డు కణాల కారణంగా,బల్లులు ఆ ప్రాంతంలో మరొక జీవి ఉందని ఊహించి ఆ ప్రదేశంను వదిలి పెడతాయి. ప్రతి 3-4 వారాలకు ఒకసారి ఎగ్ షెల్స్ మార్చండి.

వెల్లుల్లి
ఒక స్ప్రే సీసాను తీసుకోని,దానిలోఉల్లిపాయ రసం మరియు నీటిని నింపండి.దానిలో కొన్ని చుక్కల వెల్లుల్లి ఎసెన్స్ కలపండి. దానిని బాగా షేక్ చేయండి. మీ ఇంటి మూలలు మరియు ఇతర ప్రదేశాలలో స్ప్రే చేయండి. మీరు బల్లులను వదిలించుకోవటం కొరకు కేవలం ఒక వెల్లుల్లిని మాత్రమే కూడా ఉపయోగించవచ్చు.



Click it and Unblock the Notifications
