Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
పార్టీ తర్వాత ఇంటిని శుభ్రం చేయడం: చిట్కాలు
ఈ పండుగ సీజన్ లో మీ ఇంట్లో అనేక పార్టీలు, ఫంక్షన్లు జరిగి ఉండవచ్చు. ఆ సమయంలో స్నేహితులు, బందువులతో మీ ఇల్లు మొత్తం గందరగోళంగా మారి ఉండవచ్చు. అయితే, రాత్రికి రాత్రే మీరు ఇల్లును శుభ్రం చేయడం కుదరదు కదా. కాబట్టి, ఉదయం నిద్రలేవగానే, మీ ఇల్లు గందరగోళంగా ఉండటాన్ని మీరు గమనించి ఉంటరు. మీ ఇంట్లో ప్రతి మూలా చూడటానికి మురికగా ఉంటుంది. మరియు మీరు మీ ఇంట్లో ప్రతి మూల, ప్రతి చోటా క్లీన్ చేయాల్సిందే.
కార్పెట్ మరియు సోఫా కవర్స్, కర్టన్స్ లేదా సోఫా కవర్స్ మీద మరకలు, కఠిన మరకలు, గమనించినట్లైతే వెంటనే మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందువల్ల గంధరగోళంగా ఉన్న ప్రతి ఒక్కటి వెంటనే శుభ్రం చేయవల్సిందే. మీరు పార్టీలో ఉన్నప్పుడు కార్పెట్ లేదా సోఫాల మీద ఎటువంటి మరకలు చూడకూడదు. అందువల్ల మీరు ఫ్రీగా లేదా కాస్త ఓపికగా ఉన్నప్పుడు మీరు మీ ఇంటిని శుభ్రం చేసుకోవడం చాలా అవసరం. మీ ఇల్లు గందరగోళంగా ఉండటాన్ని చూసిన షాక్ అవ్వకుండా, ఒత్తిడికి గురికాకుండా ఉండాలి . కాబట్టి, పార్టీ ముగిసిన తర్వాత మీ ఇంటిని శుభ్రపరచడానికి కొన్ని సింపుల్ టిప్స్...

1. బాటిల్స్ ను ఒక బకెట్ లో లేదా పాకెట్ లో కలెక్ట్ చేసుకోవాలి . వాటిని మీరు అమ్మేయడం కానీ లేదా తర్వాత వేరే విధంగా ఉపయోగించడం కానీ చేవయచ్చు. బాటిల్స్ ను డెకరేట్ చేయడం ఫర్ గా మరియు క్రియేటివ్ గా ఉంటాయి.
2. కొన్ని బాటిల్స్ మరియు గ్లాసులు పగిలి ఫ్లోర్ మీద లేదా కార్పెట్ మీద పడి ఉన్నప్పుడు, గ్లాస్ పీస్ ను ఎత్తడానికి బ్రష్ లేదా పాన్ ను ఉపయోగించాలి . జాగ్రత్తగా ఉండటం వల్ల, చేతికి గాయాలు కాకుండా ఉంటాయి.
3. ఒకసారి బాటిల్స్ తీసుకొన్న తర్వాత గ్లాస్ ఐటమ్స్ తో మొదలు పెట్టండి. ప్లాస్టిక్ గ్లాసులను, ప్లాస్టిక్ బాటిల్ ఫుల్ లేదా కాలివి డస్ట్ బిన్ లో పడేయవచ్చు . గాజుగ్లాసులు, సగం నింపినవి మరియు కాలీగా ఉన్నవి షింక్ లో శుభ్రం చేయడానికి వేయచ్చు. షింక్ లో వేయడం వల్ల కొంత సేపు నీటిలో నానడం వల్ల మరకలు త్వరగా వదులుతాయి.
4. తర్వాత డైనిగ్ టేబుల్, సైడ్ టేబుల్, కార్నర్ టేబుల్స్ మీద ఉన్న గిన్నెలు, ప్లేట్స్ ను కలెక్ట్ చేసి, ఒక డిష్ వాషర్ లో వేయాలి. డిష వాషర్ ఫుల్ అవ్వగానే కొన్ని నీళ్ళు పోసి నింపడంతో కొద్దిసమయం నాని, మరకలను త్వరగా వదలగొడుతాయి.
5. అంతలోపు ఇంటిని శుభ్రంగా ఊడవాలి. చెత్తా చెదారాన్నంత ఒక ప్లాస్టిక్ బ్యాగ్ లోకి చేర్చాలి. ముందు లివింగ్ రూమ్ , తర్వాత ఇతర రూమ్ అన్నీ శుభ్రం చేసి, చివరగా వంటగదిని శుభ్రం చేసుకోవాలి .
6. వంటగది, మరింత చెత్తచెదారంతో నిండి, గందరగోళంగా ఉంటుంది . పాత్రలు, గిన్నెలు, గ్లాసులో నీళ్ళలో కొద్దిసమయం నానబెట్టడం వల్ల చాలా సులభంగా, వాటిని శుభ్రం చేయవచ్చు.
7. పాత్రలు అన్ని శుభ్రం చేసి, చెత్తలు ఊడ్చిన తర్వాత, ఒక మంచి సువాసన కలిగిన ఫినాయిల్ తో వంటగదిని తుడవండి.
8. బెడ్స్ షీట్స్, సోఫా కవర్స్, కుషన్ కవర్స్, ను మార్చాలని ఒక సలహా..



Click it and Unblock the Notifications