Latest Updates
-
India’s One Day Capital: ఒక్క రోజు మాత్రమే భారతదేశ రాజధానిగా ఉన్న నగరం ఏదో మీకు తెలుసా? -
ఇడ్లీ, దోశెలను వదలనివ్వని అద్భుతమైన మదురై స్పెషల్ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
చలికాలంలో ఈ సాంబార్ చేసుకుంటే..జలుబు, తలనొప్పి అన్నీ పరార్! -
కోట్ల ఆస్తి, డ్రైవర్ తో ఎఫైర్.. ప్రియుడి మోజులో కన్నకొడుకునే బలిచ్చిన తల్లి.. -
బజార్ స్వీట్లు ఇక ఆపేయండి.. సొరకాయతో అద్భుతమైన కలకండ్ ఇలా చేసుకోండి.. -
చలికాలంలో గొంతు నొప్పి, గరగర వేధిస్తున్నాయా? వంటింట్లో దొరికే ఈ పదార్థాలతో చిటికెలో రిలీఫ్.. -
100 ఏళ్లు గుర్తుండిపోయే పచ్చిమిర్చి పచ్చడి..ఎందులోకి అయినా అమృతమే! -
ఖాళీ స్వీట్ బాక్సులు పారేస్తున్నారా?.. ఈ ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు! -
హోటల్ స్టైల్ పూరీ మసాలా ఇంట్లోనే.. ఈ సీక్రెట్ టిప్స్ తో చేసి చూడండి! -
నెల రోజులు నిల్వ ఉండే ఆరోగ్యకరమైన మరమరాల లడ్డు..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
మీ వంటగదిలో బగ్స్ వదిలించుకోవటానికి సహజ మార్గాలు
ప్రతి ఇంటిలో వంటగది అనేది చాలా ముఖ్యమైనది. మీ గెస్ట్ రూమ్ కొన్ని వారాల పాటు ఖాళీగా ఉండవచ్చు. అలాగే మీరు చల్లగా ఉన్నప్పుడు టెర్రేస్ మీదకు ఎక్కకపోవచ్చు. కానీ వంటగదిలోకి వెళ్ళకుండా ఉండటం మాత్రం సాధ్యం కాదు. మీ వంటగది మీ ఇంటిలో మిగిలిన వాటి కన్నా సొగసుగా ఉండాలి. మీ వంటగది అల్మారాలు మరియు గృహోపకరణాలు తాజాగా ఉండాలంటే మీ వంటగదిలో బగ్స్ లేకుండా చూసుకోవటం అత్యంత కీలకం అని చెప్పవచ్చు. కాబట్టి,ఏమి చేయాలి? ఒక పెస్ట్ కంట్రోల్ పొందడం అనేది గజిబిజి పని మరియు డబ్బు కూడా ఖర్చు అవుతుంది. బగ్స్ వదిలించుకోవటానికి రసాయనికంగా కృత్రిమంగా తయారుచేసే క్రిమి సంహారిణులు మరియు పురుగుమందులను ఉపయోగించుట వలన మీ కుటుంబం అనారోగ్యమునకు దారి తీయవచ్చు. అందువలన ఈ బగ్స్ వదిలించుకోవటం కొరకు కొన్ని సహజ మార్గాలను ప్రయత్నించండి.

మొక్కజొన్న ఆహరం
మొక్కజొన్న లేదా మేజ్ నుండి తయారుచేసిన పిండిని సాదారణంగా అనేక రకాల వంటకాలను తయారుచేయటానికి ఉపయోగిస్తారు. అంతేకాక గ్రేవీలకు,సూప్ లేదా స్నాక్స్ బైండింగ్ కోసం ఉపయోగించవచ్చు.కానీ మీకు పిండిని చీమలు చంపడానికి ఉపయోగించవచ్చని తెలుసా. పిండి చీమలను ఆకర్షించే ఒక తీపి రుచిని కలిగి ఉంటుంది. కానీ చీమల జీర్ణ వ్యవస్థ ఈ పిండిని జీర్ణం చేయటానికి అనుమతించదు. కాబట్టి మీరు మీ వంటగది లో వివిధ ప్రదేశాలలో ఈ పిండిని జల్లితే చీమలు తింటాయి. అలాగే కొంత పిండిని తీసుకువెళ్ళి చివరికి చీమలు చనిపోతాయి.

వెల్లుల్లి
వెల్లుల్లి దాని స్వాభావిక వాసన,వివిధ ఆరోగ్య ప్రయోజనాలు కోసం మరియు రక్తం చప్పరించే పురుగుల కోసం అని చెప్పవచ్చు. వెల్లుల్లిని మీ వంటగదిలో చీమలు మరియు బొద్దింకలను తరిమికొట్టటానికి కూడా ఉపయోగించవచ్చు. వంటగది కౌంటర్లలో లేదా వంటగది మూలల్లో కొన్ని తాజా వెల్లుల్లి మరియు లవంగాలు ఉంచడం వలన బగ్స్ ప్రాణాలకు తెగించి పారిపోతాయి. వెల్లుల్లి ఎండిపోతే,అప్పుడు కొన్ని తాజా లవంగాలను వాటికి బదులు భర్తీ చేయవచ్చు. అలాగే మీకు ఈ ట్రిక్ అందంగా మరియు ఉపయోగకరంగా ఉంటుంది.వెల్లుల్లి,లవంగాల స్థానంలో,వెల్లుల్లి పిచికారీ కూడా సులభంగా ఉపయోగించవచ్చు. వెల్లుల్లి పిచికారీకి కొన్ని వెల్లుల్లి ముక్కలు,లవంగాలు,ఒక స్పూన్ మినరల్ నూనె,డిష్ సబ్బు మరియు నీరు అవసరమవుతాయి. వెల్లుల్లి పిచికారీని కీటకాలు నుండి మీ మొక్కలు రక్షించేందుకు,వంటగదిలో,కిచెన్లో తోటలలో ఉపయోగించవచ్చు.

యూకలిప్టస్ ఆయిల్
యూకలిప్టస్ చెట్టు నుండి సేకరించిన నూనె ఒక ముఖ్యమైన నూనె. అంతేకాక తీపి మరియు ఆహ్లాదకరమైన సువాసన వస్తుంది. దీనిని సమర్థవంతముగా పెస్ట్ కంట్రోల్ సాధనంగా ఉపయోగిస్తారు. మీ వంటగదిలో బగ్స్ వదిలించుకోవటానికి యూకలిప్టస్ ఆయిల్ ను ఉపయోగించండి. నీటిలో కొన్ని చుక్కల యూకలిప్టస్ ఆయిల్ ని కలిపి ఒక స్ప్రే సీసా లో నిల్వ చేయాలి. ఈ మిశ్రమాన్ని మీ వంటగదిలో ఉండే బొద్దింకలు,స్పైడర్స్ మరియు ఇతర చిన్న కీటకాల మీద స్ప్రే చేస్తే అవి వెంటనే చనిపోతాయి.

బోరిక్ యాసిడ్
పురుగులను చంపడానికి మరొక మార్గంగా బోరిక్ యాసిడ్ ను ఉపయోగించవచ్చు. పిండితో బోరిక్ యాసిడ్ ను కలపటం మరియు కీటకాల పైన ఈ మిశ్రమాన్ని చిలకరించడం ద్వారా సహజంగానే మరియు దాదాపుగా వెంటనే చనిపోతాయి. వంటగది బగ్స్ ఈ మిశ్రమాన్ని తిని చనిపోతాయి. బోరిక్ యాసిడ్ ను సులభంగా ఒక స్థానిక ఫార్మసీ నుండి కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ అందుబాటులో లేకపోతె బోరిక్ డిటర్జెంట్ ను కూడా ఉపయోగించవచ్చు. బోరిక్ పౌడర్ ని కీటకాల మీద నేరుగా ఉపయోగించవచ్చు. ఇంకా మరింత సమర్ధవంతంగా పనిచేయడానికి చక్కెర మరియు నీటితో కలిపి ఉపయోగించవచ్చు. దీనిని ఒక సాధారణ ఎర ఉపయోగిస్తారు.



Click it and Unblock the Notifications
