Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
వంటగది అల్మారాలను చక్కగా సర్ధుకోవడానికి మార్గాలు
వంటగదిలో సెల్ఫ్ లను ఆర్గనైజ్ చేయాలంటే ఒక కష్టమైన పని, అన్ని డబ్బాలు, వెజల్స్ మరియు పాత్రలును ఒక క్రమ పద్దతిలో సర్ధాలి. కిచెన్ సెల్స్ ను ఒక క్రమంలో సర్ధకోవడం చాలా అవసరం. నీట్ గా సర్ధుకోవడం వల్ల వస్తువలను చాలా సులభంగా గుర్తించి తీసుకోవచ్చు. అందుకు అనుగుణంగా అందుబాటులో ఉండేవిధంగా సర్ధుకోవాలి. కిచెన్ సెల్ఫ్ లను క్లీన్ గా అప్పుడప్పుడు సర్ధుకుంటుండాలి. కిచెన్ సెల్ఫ్ లను సరిగా లేదా క్లీన్ గా ఎప్పటికప్పుడు సర్ధుకోకపతే, అన్ని గందరగోళంగా, చెత్తగా మారుతుంది.
ప్రతి ఇంట్లో మహిళలకు కిచెన్ సెల్ఫ్ శుభ్రంగా మరియు వరుసక్రమంలో అమరికగా పేర్చుకొని పెట్టుకోవడం చాలా అవసరం. వంటగది వస్తువులు సులభంగా సౌకర్యవంతంగా అందుబాటులో ఉండటం వల్ల వంట చేయడం మరింత సులభం అవుతుంది. వంటకు అవసరం అయ్యే వస్తువులను కనుక్కోవడం మరింత సులభం అవుతుంది. ప్రతి ఒక్కటీ అవసరం అయ్యే సమయానికి అందుబాటులో ఉండటం సులభం అవుతుంది. అందులవల్ల కిచెన్ సెల్ఫ్ ను బాగా సర్ధుకోవాలి. ఒక అసహ్యమైన వంటగది షెల్ఫ్ కూడా అన్నిగందరగోళంగా ఉండేట్లు చేయడానికి కారణమవుతుంది . పదార్థలు కూడా ఒకదానిలో ఒకటి కలిసిపోయి ఉంటాయి. దానివల్ల వంటగదిలో బొద్దింకలు, ఎలుకలు చేరే అవకాశం ఉంది. వంటగది శుభ్రంగా లేనప్పుడు అనారోగ్యకరమై పరిస్థితులకు దారితీస్తుంది.
వంటగదిని శుభ్రంగా ఉంచుకోవడానికి కొన్ని పద్దతులను అనుసరించాలి. ఈ చిట్కాలు మీ వంటగదిని మరింత క్లీన్ గా మరియు శుభ్రంగా అమర్చి పెట్టుకోవడానికి సహాయపడుతాయి . మరి అనుసరించాల్సిన పద్దతులేంటో ఒకసారి చూద్దాం...

1. మొదట లిస్ట్ తయారుచేయాలి: లిస్ట్ ప్రకారం వస్తువులు ఉండటం, వంటగదిలో అవసరం అయ్యే వస్తువులు, పాత్రలు, కత్తులు వంటివి తరుచూ ఉపయోగించేవి, అతి సులభంగా అందుబాటులో, కనబడే విధంగా సర్ధుకోవడం చాలా అవసరం . కాబట్టి, మీరు రెగ్యులర్ గా ఉపయోగించే అన్ని కిచెన్ సెల్ఫ్ వస్తువులను జాబితాను తయారుచేసుకోండి . అవసరాన్ని బట్టి, కిచెన్ వస్తువులను ఆహారధాన్యాలు, ప్యాకేజ్ ఫుడ్స్, మసాలా దినుసులను వేరువేరుగా లిస్ట్ ప్రకారం అమర్చుకోవాలి.
2. కిచెన్ షెల్ఫ్ ను శుభ్రంగా ఉంచుకోవడం. అన్ని వస్తువులను ఒకచోట సర్ధడానికి ముందు, కిచెన్ షెల్ఫ్ లను శుభ్రం చేయాలి. మొదట, పొడి వస్త్రంతో కిచెన్ సెల్ఫ్ లేదా కిచెన్ ను శుభ్రం చేయాలి.షెల్ఫ్ లో నిండుకొన్న దుమ్ము మరియు ధూళిని శుభ్రం చేయాలి . తర్వాత ఫ్లోర్ క్లీనర్, లిక్విడ్ క్లీనర్ తో షెల్ఫ్ లను క్లీన్ చేసి, షెల్ఫ్ ను మెరిసేలా ఉంచుకోవాలి . తర్వాత తిరిగి శుభ్రంగా ఉన్న మరో పొడివస్త్రంతో క్లీన్ గా తుడవాలి.
3. పదార్థాలను నిల్వచేయాలి: వంటగదిలో అవసరం అయ్యే వస్తువులు, మరియు పదార్థాలను మీకు సౌకర్యవంతంగా అమర్చుకోవాలి. అందుకు మీకోసం అసరం అయ్యే డబ్బాలను సిద్ధం చేసుకోండి. పదార్థాలను డబ్బాల్లో నిల్వచేసి కనబడే విధంగా అమర్చుకోవాలి. ఓపెన్ గా ఉంచడం వల్ల అవి క్రింద పడి, షెల్ఫ్ లు గంధరగోళంగా దారుణంగా మార్చవచ్చు. కాబట్టి, ఎల్లప్పుడు, మూతులున్న డబ్బాల్లో నిల్వ చేసుకోవడం మంచిది. మరియు, మీరు నిల్వ చేసిన పదార్థాలకు పేర్లతో లేబుల్స్ ను అతికించడం వల్ల , మీరు కాకుండా , ఇతర కుటుంబ సభ్యలును చాలా సులభంగా పదార్థాలను గుర్తించడాని సహాయపడుతుంది.
4. డబ్బాల అమరిక: వంటగదిలో డబ్బాలను ఒక వరుసక్రమంలో అమర్చుకోవడం వల్ల చూడటానికి అందంగా ఉంటుంది. మరియు మన కనిపెట్టడానికి సులభం అవుతుంది. వంటగది షెల్ఫ్ శుభ్రం అత్యంత ముఖ్యమైన భాగంగా ఖచ్చితంగా అన్ని పరికరాలు ఏర్పాటు ఉంటుంది . కంటైనర్లు మరియు పాత్రలను వేరువేరుగా కనిపించేలా అమర్చాలి . ఒకే రకమైన పదార్థాలన్నింటిని ఒక చోట చేర్చుకోవాలి. మీకు రెగ్యులర్ ప్రతి రోజూ అవసరం అయ్యే పదార్థాలన్నింటి ఒకచోటి పెట్టాలి.
5. మెయింటైన్ : మీ కిచెన్ షెల్ఫ్ లను సర్ధిన తర్వాత రిలాక్స్ గా కూర్చోకూడదు. ఎందుకంటే కిచెన్ షెల్ఫ్ కు రెగ్యులర్ క్లీనింగ్ చాలా అవసరం అవుతుంది . ప్రతి వారం దుమ్ము మరియు ధూళిని ప్రతి వారం శుభ్రం చేయాలి. మరియు అన్ని డబ్బాలను శుభ్రంగా ఉంచుకోవాలి . ఏ పదర్ధాన్ని కానీ, కిచెన్ లో క్రింద పడయనివ్వకుండా స్టోర్ చేసుకోండి. సాధ్యమైనంత వరకూ క్లీన్ గా, శుభ్రంగా ఉంచుకోవాలి.



Click it and Unblock the Notifications











