Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
కిచెన్ టవల్స్ శుభ్రం చేయడానికి సులభ చిట్కాలు
కిచెన్ లోని టవల్స్ (తువ్వాళ్లును)శుభ్రం చేయడం ఒక ముఖ్యమైన ప్రయోజనకరమైన పనులలో ఒకటి. కిచెన్ టవల్స్ నుండి మురికిని వదిలించి, వాసను తొలగించడం కూడా చాలా ముఖ్యం. కిచెన్ టవల్స్ ను శుభ్రం చేయడంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే, సరైన శ్రద్ద తీసుకొని శుభ్రం చేయకపోతే, వాటి వల్ల కూడా అరోగ్య సమస్యలకు దారితీస్తాయి.
వంటగదిలోని టవల్స్ ను శుభ్రం చేయడానికి కొన్ని విలువైన చిట్కాలకు క్రింది విధంగా ఇవ్వబడ్డాయి.
1. మొదటగా, గుర్తుంచుకోవల్సిన విషయం, కిచెన్ టవల్స్ ను మంచి ల్యాండ్రీ డిటర్జెంట్ పౌడర్ తో శుభ్రం చేయాలి. ఎందుకంటే వీటిలో క్రిములను, మురికిని వదిలించే కెమికల్స్ తో స్ట్రాంగ్ డిటర్జెంట్స్ తయారుచేయబడి ఉంటాయి.
2. ఇంకా మీరు శుభ్రం చేసే కిచెన్ టవల్స్ కోసం ఉపయోగించి డిటర్జెంట్స్ లో యాంటీమైక్రో బయల్ ఆడిటివ్ కలిగి ఉండే వాటిని ఎంపిక చేసుకోండి . ఇవి మురికిని, మొండి మరకలను తొలగించడం మాత్రమే కాదు వాసనను కూడా వదలగొడుతాయి.

3. కిచెన్ టవల్స్ ను డిటర్జెంట్ సోపులతో శుభ్రంగా ఉతికిన తర్వాత వాటిని మైక్రోవోవేన్ లో మీద పెట్టి వేడి చేయడం వల్ల బ్యాక్టీరియా నాశనం అవుతుంది.
4. కిచెన్ టవల్స్ ను శుభ్రం చేసిన తర్వాత వాటిని ఎండలో ఆరబెట్టడం ఉత్తం. వాటిని తేమగా ఉంచకండి. అలా ఉంచడం వల్ల క్రిమలు మరింత విస్తరించే అవకాశం ఉంది.
5. కిచెన్ లో ఉపయోగించేందుకు వంద శాతం కాటన్ వైట్ టవల్స్ ను కొనుగోలు చేసుకోండి. అవి మందగా ఉంటాయి . మరియు మురికి వెంటనే గ్రహించి మరకలు మనకు కనబడేలా చేస్తాయి . మరియు తెల్లనివి బ్లీచ్ చేయడానికి మరింత సులభం అవుతుంది . దాంతో కిచెన్ టవల్స్ ను శుభ్రంగా ఉంచడానికి సులభం అవుతుంది.
6. కిచెన్ టవల్స్ ను మరింత శుభ్రంగా ఉతకాలంటే, వేడి నీళ్ళలో నానబెట్టి, తర్వాత శుభ్రం చేయడం మరో ఉత్తమ పద్దతి.వేడి నీళ్ళలో నానబెట్టిన తర్వాత డిటర్జెంట్ తో ఉతికి, ఎండలో ఆరబెట్టుట వల్ల మురికి మరియు దుర్వాసన పోయి తాజాగా ఉంటాయి.వీటిని శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా లేదా వెనిగర్ ను ఉపయోగించవచ్చు.
7. కిచెన్ లో ఫ్యాబ్రిక్స్ టవల్స్ ను ఉపయోగించకండి. ఇవి సురక్షితం కావు, మరియు చాల త్వరగా వేడిని గ్రహిస్తాయి.
8. కిచెన్ టవల్స్ ను శుభ్రం చేయడానికి మరో ఉత్తమ చిట్కాలు మరకలను వదిలించే మంచి క్లీనర్ ను ఉపయోగించాలి. వాటిని శుభ్రం చేయడానికి ముందు కొంత సమయం క్లీనర్ లో నానబెట్టి, తర్వాత బ్రష్ వేసి శుభ్రం చేయాలి.
9. కిచెన్ టవల్స్ మరింత మురికి పట్టినట్లైతే రాత్రంతా వేడినీటిలో నానబెట్టుకోవాలి . కలర్ సేఫ్ గా ఉన్న బ్లీచ్ ను ఉపయోగించాలి. దాంతో మరకలు వదిలిపోయి, టవల్స్ మంచి షైనింగ్ తో ఫ్రెష్ గా ఉంటాయి.
10. మీరు ఇంకా బ్లీచింగ్ మరియు సోడియం బైకార్బోనేట్ లో రాత్రంత నానబెట్టి, తర్వాత శుభ్రం చేసి, ఎండలో ఆరబెట్టాలి. దాంతో కిచెన్ టవల్స్ క్లీన్ గా మంచి సువాసనత ఉంటాయి.



Click it and Unblock the Notifications
