Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
ఆహా..ఇంట్లో వస్తువులను మిళమిళ మెరిపించే క్లీనింగ్ ఏజెంట్ టమోటో
హో మేకర్స్ కు టమోటోలు ఒక ఫేవరెట్ వెజిటేబుల్, ఎందుకో మీకు తెలుసా?ఇంట్లో ప్రతి వంట రుచికరంగా ఉండటం కోసం టమోటలను వంటల్లో జోడించడం మాత్రమే కాదు, టమోటోలు మీ ఇంటిని కూడా శుభ్రం చేయడంలో సహాయపడుతాయి. టమోటో సాస్ తో ఇంటిని శుభ్రం చేయడం వల్ల కొత్తవాటిలా మిళమిళా కాంతివంతంగా మెరిసిపోతుంటాయి. అయితే టమోటోలను ఉపయోగించి ఇంట్లో వస్తువులను శుభ్రం చేయడానికి ముందుగా గుర్తుంచుకోవల్సిన విషయం వాటిని ఉపయోగించే ముందు టమోటోకు అవుటర్ స్కిన్ తొలగించాలి లేదంటే అవి వస్తువుల్లో ఇరుక్కుపోవడం వల్ల తొలగించడం కష్టం అవుతుంది.
టమోటోలు ఉపయోగించి మీ ఇంటిని శుభ్రం చేయడానికి టమోటోలను పేస్ట్ చేసి, అందులో కొద్దిగా పౌడర్ సాల్ట్ వేయాలి. ఇది ఒక స్క్రబ్ గా ఉపయోగపడుతుంది. ఈ టమోటో పేస్ట్ లో ఉన్న పౌడర్ సాల్ట్ వస్తువుల మీద మొండిమరకలను స్ర్కబ్ చేయడం ద్వారా తేలికగా తొలగించబడుతాయి.
ఈ అద్భుతమైన వెజిటేబుల్ మీ ఇంట్లో వస్తువులు అద్భుతమైన కాంతిని అందిస్తుందని చాలా మందికి తెలియకపోవచ్చు. అది ఎలా సాధ్యం అంటే, టమోటోల్లో ఉండే యాసిడ్స్, ఒక బ్లీచింగ్ ఏజెంట్స్ గా పనిచేస్తాయి . అందువల్ల నిమ్మరసం తర్వాత టమోటోలను ఒక నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్ గా ఉపయోగిస్తున్నారు. మొండిమరకలు ఎప్పటికీ వదలకుండా ఉన్నట్లైతే, టమోటో పేస్ట్ లో కొద్దిగా నిమ్మరం లేదా వైట్ వెనిగర్ మిక్స్ చేయడం వల్ల అందులో ఆల్కలైన్ కంటెంట్ పెరుగుతుంది. టమోటో పేస్ట్ లో ఉండే ఈ అధిక ఆల్కలైన్ కంటెంట్ మరింత ఉత్తమ ఫలితాలను అందిస్తాయి. మరి టమోటోతో ఇంట్లో ఏఏ వస్తువులను ఎలా శుభ్రం చేయాలో చూద్దాం...

మెటల్ వస్తువులను క్లీనింగ్ చేయడం:
మెటల్స్ ఎప్పుడు ప్రకాశవంతంగా ఉండటానికి కెమికల్స్ ను ఉపయోగిస్తుంటారు. కానీ, మెటల్ మీద ఒక షబ్బీల లేయర్ ఉండటం వల్ల, టమోటో పేస్ట్ ను ఉపయోగించడం, చాలా తక్కువ హాని కలిగిస్తాయి మరియు ఎక్కువ ప్రభావం చూపుతాయి.

సిల్వర్ వస్తువులు:
సిల్వర్ వస్తువులు తెల్లగా మిళమిళ మెరిపించడం కోసం టమోటో పేస్ట్ ను ఉపయోగించవచ్చు. సిల్వర్ వస్తువులు, ఆర్నమెంట్స్ మీద పడ్డ త్రుప్పు, దుమ్ము, ధూళిని తొలగించడానికి ఈ నేచురల్ పదార్థం సహాయపడుతుంది. టమోటోల్లో ఉండే యాసిడ్ సిల్వర్ వస్తువులను మెరిపించేలా చేస్తుంది.

బ్రాస్(ఇత్తడి వస్తువులను)శుభ్రం చేస్తుంది:
ఇత్తడి వస్తువులను శుభ్రం చేయడం మరింత సులభం అవుతుంది. ఇత్తడి వస్తువులను శుభ్రం చేయడానికి టమోటోలను ఉపయోగించాలి.

త్రుప్పును తొలగిస్తుంది:
త్రుప్పు పట్టిన వస్తువుల శుభ్రం చేయడానికి చాలా కష్టం అవుతుంది. ముక్యంగా గార్డినింగ్ వస్తువులను శుభ్రం చేయడం అంత తేలికైన పని కాదు. కాబట్టి, వీటి శుభ్రం చేయడానికి టమోటో పేస్ట్ లేదా టమోటో జ్యూస్ ను ఉపయోగించాలి. దుస్తుల మీద పడ్డ ఐరన్ రస్ట్ లైన్ తొలగించడానికి, ఆ లైన్ మీద టమోటో పేస్ట్ ను రుద్ది 15 నిముషాలు డ్రై అయిన తర్వాత మంచి నీటితో శుభ్రం చేయాలి.

రాగి వస్తువులను పాత్రలను శుభ్రం చేస్తుంది:
కాపర్ (రాగి)వస్తువులను శుభ్రం చేయడానికి టమోటో జ్యూస్ ను ఉపయోగించాలి . అందుకు మీరు చేయాల్సిందల్లా మరకలు పడ్డ రాగి వస్తువులకు కొద్దిగా రాగి పేస్ట్ ను అప్లై చేసి తర్వాత 15 నిముషాల తర్వాత చేత్తో బాగా రుద్ది మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి.

స్టెయిన్ లెస్ స్టీల్:
సహజంగా స్టెయిన్ లెస్ స్టీల్ వస్తులకు బ్లాక్ సర్కిల్స్ పడటం ఎక్కువ , కావట్టి, ఈ బ్లాక్ సర్కిల్స్ నివారించడానికి టమోటో పేస్ట్ అప్లై చేసి ఒక పది నిముషాల తర్వాత రుద్ద కడిగితే నల్లగా ఉన్న మరకలు తొలగిపోతాయి .

బంగారు ఆభరణాలు కూడా:
మీ బంగారు నగలు కాంతివంతంగా మెరుస్తుండాలంటే టమోటో సాస్ ను అప్లై చేసి తర్వాత శుభ్రం చేయాలి. బంగారు ఆభరణాలను శుభ్రం చేయడానికి టమోటో సాస్ ఒక సురక్షితమైన క్లీనింగ్ ఏజెంట్.



Click it and Unblock the Notifications
