Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
దువ్వెన-హెయిర్ బ్రష్ ను శుభ్రం చేయడానికి సులభ చిట్కాలు
నచ్చిన హెయిర్ స్టైల్ తో అందంగా కనిపించాలని ఎవరికు ఉండదు చెప్పండి? కానీ, అందంగా రెడీ అవ్వాలనే హడావిడిలో హెయిర్ స్టైల్ పూర్తవగానే హెయిర్ బ్రష్ లేదా దువ్వెనను అలానే పక్కన పడేస్తారు. మళ్లీ తల దువ్వుకోవాలనుకున్నప్పుడు తప్ప అవి మనకు గుర్తురావు. ఫలితంగా తెగిపోయిన వెంట్రుకలు, పేరుకుపోయిన దుమ్ము, ధూళి..అన్నీ కలిసి అవి చాలా మురికిగా కనిపించేలా చేస్తాయి. మరి అలాంటి వాటిని శుభ్రం చేయడమంటే అంత సులభమైన పనికాదు. అందుకే హెయిర్ బ్రష్/దువ్వెన శుభ్రం చేసుకోవడానికి ఉపకరించే కొన్ని చిట్కాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి...
మురికగా ఉన్న దువ్వెనతో తల దువ్వుకుంటే చుండ్రు, జుట్టు రాలిపోవడం, వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే తరచుగా ఉపయోగించే హెయిర్ బ్రష్/దువ్వెనలను వారం లేదా పది రోజుకోసారైనా శుభ్రం చేసుకోవడం తప్పనిసరి
శుభ్రం చేద్దామిలా: ముందుగా దువ్వెనలో ఉన్న తెగిపోయిన లేదా రాలిపోయిన జుట్టుని టూత్ పిక్ సాయంతో బయటకు తీసేయాలి. ఒక వేళ హెయిర్ బ్రష్ అయితే టూత్ పిక్ తో తీయడం కష్టమనిపిస్తే పెన్ లేదా పెన్సిల్ తో జుట్టుని వదులు చేయాలి. తర్వాత కత్తెర సాయంతో వాటిని ఎక్కడికక్కడ కట్ చేసి తూట్ పిక్ తో బయటకు తీసేయవచ్చు. అయితే దీనికి కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళలో బేబీ షాంపూ వేసి అందులో హెయిర్ బ్రష్ లేదా దువ్వెనను నానబెట్టాలి. మెత్తనా బ్రిసిల్స్ ఉన్న బ్రష్ ను తీసుకుని దాని మీద కొద్దిగా బేబీ షాంపూ వేసి దువ్వెన పై బాగా రుద్దాలి. అలాగని మరీ గట్టిగా రుద్దితే దువ్వెన/హెయిర్ బ్రష్ కు ఉండే బ్రిసిల్స్ విరిగిపోవచ్చు. ఇలా బాగా రుద్దిన తరవ్ాత మళ్లీ గోరువెచ్చని నీటిలో బాగా కడిగి పొడి టవల్ తీసుకొని దాంతో తుడిచి వాటిని బాగా ఆరబెట్టాలి.

మరికొన్ని చిట్కాలు
1. మీరు జుట్టుకి జెల్స్, క్రీమ్స్ వంటివేమైనా అప్లై చేస్తారా? అయితే మీరు తల దువ్వుకున్న వెంటనే హెయిర్ బ్రష్ లేదా దువ్వెనను షాంపుతో ఓసారి కడిగేసుకోవాలి. లేదంటే దువ్వెనకు అంటుకున్న జెల్ లేదా క్రీమ్ కు దుమ్ము, ధూళి ఆకర్షితమవుతాయి. ఫలితంగా జుట్టు పాడై రాలిపోతుంది.
2. గోరువెచ్చని నీరు, వెనిగర్ అరకప్పు చొప్పున తీసుకొని దువ్వెన లేదా హెయిర్ బ్రష్ ను నానబెట్టాలి. అలా 15 నుంచి 20నిముషాలు నానబెట్టిన తర్వాత బయటకు తీసి షాంపూతూ శుభ్రం చేసుకోవాలి.
3. అలాగే వెనిగర్ కు బదులుగా బేకింగ్ సోడాను కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే కొన్ని హెయిర్ బ్రష్ లు బేకింగ్ సోడాలో ముంచకూడదు. అది ముందుగా సరిచూసుకుని తర్వాత వాటిని శుభ్రం చేయడానికి ఈ పద్దతి అనుసరిస్తే మంచిది. లేదంటే మొత్తం వస్తువే పాడైపోయే అవకాశం ఉంటుంది.
4. ఇవన్నీ కాకుండా దువ్వెనను నీళ్ళలో నానబెట్టి ఒక పాత బ్రష్ తీసుకొని దాని మీద టూత్ పేస్ట్, షాంపూ, సబ్బు, ఇలా ఏదైనా తీసుకుని దాంతో దువ్వెన /హెయిర్ బ్రష్ ని బాగా శుభ్రం చేయాలి. తర్వాత కడిగేసి ఆరబెట్టుకుంటే సరి.
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అన్నికంటే ఉత్తమమైన పని తల దువ్వుకున్న వెంటనే అందులో ఉన్న వెంట్రుకలు తీసేసి దువ్వెనను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. తెలుసుకున్నారుగా మరి మీరు కూడా ప్రయత్నించి చూడండి..



Click it and Unblock the Notifications