Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
'పగ్' జాతి కుక్కల గురించి మీ కేమి తెలియాలి?

పగ్ జాతి కుక్కలు ఏమి చేయలేవో తెలుసుకోవాలంటే, ఇది చదవండి! అవి మీ ఇంటికి మీరు లేనపుడు కాపలా కాయలేవు. మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే...మిమ్మల్ని విడిచి వుండలేవు. మీరు ఎక్కడికెడితే అక్కడికి వచ్చేస్తాయి. మీ రక్షణ కొరకు ఒక కుక్క కావాలనుకుంటే, పగ్ జాతి కుక్క పని చేయలేదు. ఈ జాతి కుక్క బయటివారిని ఎదుర్కొనలేదు. ఇంటిలో గట్టిగా చప్పుడైతే, ఈ జాతి కుక్క వెంటనే దాక్కొంటుంది. ఎవరైన వచ్చినా అసలు పట్టించుకోదు. ఇవి చాలా తెలివైన కుక్కలు కూడా కావు. కనుక మీరు తెలివైన పెట్ కావాలనుకుంటే దీనిని ఎంపిక చేయవద్దు. అలాగని మరీ మొద్దుగా వుండవు.
పగ్ జాతి కుక్కలు శిక్షణ నివ్వాలంటే చాలా నిదానంగా నేర్చుకుంటాయి. మొదటి సారే మీ కమాండ్స్ గ్రహించలేదు. అవి కమాండ్స్ కంటే కూడా భావాలకు ప్రాధాన్యతనిస్తాయి. ఈ జాతి కుక్కలు దూరాలు నడువ లేవు. కాని కనీస వ్యాయామం వీటికి కావాలి. ఎంతసేపూ ఇవి మీ సరసన పడుకుని ఆటలాడటానికే లేదా ముద్దు మురిపాలకే పనికి వస్తాయి కాని. మీ పిల్లలు ఆశించే రీతిలో ఒక బాల్ తెచ్చి మీ కివ్వడం లేదా బయట గ్రౌండ్ లో పిల్లలతో ఆడటం వంటివి చేయలేవు.
మరి పగ్ జాతి కుక్కల ప్రయోజనం ఏమిటి?
పిల్లలతో చాలా స్నేహంగా వుంటాయి. పిల్లలు బాగా ఇష్టపడతారు. పిల్లలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వటానికి ఈ జాతి కుక్క ఏ పనైనా చేస్తూ వుంటుంది.
పగ్ జాతి కుక్కలు ప్రతిదినం చాలా బొచ్చును విదిలిస్తాయి. కనుక లూజుగా వున్న బొచ్చు వదిలించటానికి దానికి ప్రతి దినం దువ్వవలసిన అవసరం వుంది.
ఈ కుక్కలు చాలా యాక్టివ్ గా వుండి ఒక చోట ఎపుడూ నిలబడవు. లేదా కూర్చోవు. పెద్దవైనప్పటికి ప్రకటనలలోవలే మీ వెంట వస్తూనే వుంటాయి.
వేడికి తట్టుకోలేవు. అలాగని చలి అధికంగా వున్నా భరించలేవు. మన దేశంలోని వేసవి కాలంలో వాటికి ఒక ఎయిర్ కండిషనర్ అవసరం ఎంతో వుంటుంది.
ఈ కుక్క దానికిష్టమైన తిండిపదార్ధాలను చాలా అధికంగా తినేస్తుంది. కనుక ఆరోగ్యంగా వుండాలంటే తిండి విషయంలో మీరు దానిని నియంత్రణ చేయాల్సిన అవసరం వుంది. ఒక చిన్న కుక్క కావాలంటే మాత్రం పగ్ జాతి కుక్క పెంపకానికి ఎంతో మేలైనది.



Click it and Unblock the Notifications
