For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆక్వేరియం చేపలను రక్షించే లైటింగ్...!?

|

Aquarium Lighting: A Necessary Evil..
కొంతమంది కొన్ని రకాల జంతువులు, జీవులను పెంచుకోవాకొంటారు. అయితే వాటిని పెంచే విధానంలో అవగాహన లేక, కొంత మంది దూరమవుతారు. అయితే మరికొందరు ఉత్సాహంతో వాటి ప్రారంభించే మధ్యలోనే నిష్క్రమిస్తుంటారు. అందుకు కారణం అవగాహన లోపం. ఉదాహరణకు కొంతమంది ఇల్లల్లో ఆక్వేరియం చూసినప్పుడు అరే మన ఇంట్లో కూడా ఇలాంటి అక్వేరియం ఉంటే బాగుండు అనిపిస్తుంది. వెంటనే ఏదో ఒక ఆక్వేరియం తెచ్చేసుకొని ఏదో ఒక మూల పడేస్తుంటారు. తర్వాత వాటి శుభ్రతపట్ల, చేపలకు ఆహరం, గాలి, వెలుతురు ఎంత ఉండాలనే విషయాలు తెలుసుకోకుండా కొద్దిరోజులకే చేపలు చచ్చిపోవడం వంటి జరుగుతుంటాయి. అలా జరగకుండా కొనే ముందే అమ్మకం దారు దగ్గర పూర్తి వివరాలు తెలుసుకోవాలి. తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాటి ప్రత్యేకమైన స్థలం కేటాయించి అక్కడ పెట్టుకోవాలి. దాంతో పాటు ఆక్వేరియంకు కలర్ ఫుల్ లైటింగ్ అమర్చినట్లైతే ఇంటికి మరింత అందం వస్తుంది. అయితే లైట్స్ వేడి ఎక్కువైనట్లేతే అక్వేరియంలో నీరు వేడేక్కే ప్రమాదం ఉంది. కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

ఆక్వేరియం లైటింగ్:
1. కాల పరిమిమితి: సాధారణంగా చేపలు పెట్టుకోగల ఆక్వేరియం తొట్టికి ఎనిమిది నుండి పది గంటల సమయం లైటింగ్ ఉంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ సేపు ఉంచినట్లైతే చేపలు హాని కలుగుతుంది. చేపలు ఉండే నీరు ఎప్పుడూ చల్లగా ఉండేటట్లు చూసుకోవాలి.

2. ఆక్వేరియం ప్లాంట్: ఆక్వేరియంలో నిజమైనటు వంటి గ్రాస్(మొక్క)ను కనుక పెంచుతున్నట్లైతే లైటింగ్ వెలిగే టైమ్ ను పది నుండి 12 గంటలసేపు ఉంచాల్సి ఉంటుంది. మొక్కలు కిరణజన్య సంయోగక్రియ జరగాలంటే కాంతి అవసం. నీటిలో పెరిగే మొక్కలు తగినంత సూర్యరశ్మి లేదా వెలుతురు లేకుండా జీవక్రియ సాగించలేవు.

3. ఆక్వేరియంలో ఎలాంటి చేపలు వదలాలి: ఆక్వేరియంలో పెరిగే కొన్ని రకాల చేపలు ఫోటో షై కలిగి ఉండుట వల్ల అవి ఎక్కువ కాంతి ఉండటం ఇష్టపడవు. అయితే మీ ఫిష్ టాంక్ లో కనుక టెట్రా మరియు చిచిడ్స్ వంటి వర్గానికి చెందిన చేపలు ఉన్నట్లైతే అప్పుడు ఆక్వేరియం లైటింగ్ టైమ్ ను తగ్గించుకోవాల్సి ఉంటుంది. అలాగే లైట్స్ కూడా తక్కువ ఓల్ట్స్, తక్కువ పవర్ కలిగినవి వినియోగించడం వల్ల ఎక్కువ కాంతి లేకుండా ప్రకాశవంతగా లేకుండా ఉండేటటువంటి వినియోగింస్తే ఆక్వేరియం చాలా కాలం పాటు నిలబడతుంది.

4. ఆక్వేరియం టాంక్ సైజ్: ఆక్వేరయం టాంట్ పరిమాణం బట్టే, లైట్స్ అమర్చుకోవాలి. అలాకాకుండి చిన్న చేపపిల్లను పెంచుకనే ఫిష్ టాంక్ కు వంద ఓల్ట్ బల్బ్ ను అమర్చితే అది చేప ఆరోగ్యంమీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మీ ఫిష్ టాంక్ ఉండే పరిమాణం, అందులోని చేపల సంఖ్యను బట్టి కూడా లైట్స్ ను అమర్చుకోవాలి.

5. వాటర్ హీట్: లైట్స్ ద్వారా చేపల తొట్టే త్వరత్వరగా వేడెక్కూతుంటుంది. అందుకోసం అప్పుడప్పుడు ఫిష్ టాంక్ లోని నీరు క్రమం తప్పకుండా మార్చుతుండాలి.

6. దినచర్య : ఆక్వేరియం చేపలను లైట్స్ మాత్రమే ప్రభావితం చేస్తాయనుకొంటే పొరపాటే. ఎందుకంటే మనుష్యుల్లాంగే చేపలకు రాత్రి..పగులు అనేవి జీవితకాలన్నినిర్వహించడానికి లైట్స్ తప్పనిసరిగా ఉండాలి. ఉదాహరణకు గోల్డ్ ఫిష్ పగటి పూట చాలా చురుకుగా ఉంటాయి. వెలుతురు లేకుండా ఆక్వేరియంలో చేపలు ఎక్కువకాలం జీవించలేవు. ఎందుకంటే గడియారంలో ముళ్లులాగే చేపలు కూడా వాటి శరీరతత్వం మార్చకొంటూ ఉంటాయి కాబట్టి....ఆక్వేరియం కొనే ముందు పూర్తి అవగాహనతోనే ఆక్వేరియంను కొనాలి.

English summary

Aquarium Lighting: A Necessary Evil...? | ఆక్వేరియం లైటింగ్ ఎంత ఉండాలి...?

We love our fish as pets but no one can deny that aquariums have a decorative value too! After all, we are not rearing fish in a pond but within the confines of our tiny urban homes. Lighting the aquarium makes it look good but it also heats up the water. Aquarium fish may tolerate lights but they do not love the harsh water lights 24 x 7. So, where do we draw the line between decoration and fish care?
Story first published:Monday, May 14, 2012, 15:49 [IST]
Desktop Bottom Promotion