Latest Updates
-
రాచరికపు రుచినిచ్చే మొఘలాయి ఎగ్ కర్రీ..చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే..
కుక్కపిల్ల చెవి ఇన్ఫెక్షన్లకి 6 ఇంటి చిట్కాలు
కుక్కపిల్లల చెవి ఇన్ఫెక్షన్లు అనేక కారణాల వలన రావచ్చు. ఆహారంలో అలర్జీలు, కీటకాలు, మందుల వాడకం మరియు ఫంగస్ ఇన్ఫెక్షన్ వంటి కారణాలు కుక్కల్లో చెవి ఇన్ఫెక్షన్ కి దారితీయవచ్చు. మీకు కన్పించేది మీ కుక్క చెవిని పదేపదే గోక్కుంటూ నొప్పితో శబ్దాలు చేయటం మరియు తన తలను వేగంగా ఆడిస్తూ ఉండటం. తన చెవిలోంచి దుర్వాసనతో కూడిన పదార్థాలేవీ స్రవించకముందే, ఇన్ఫెక్షన్ ముదరకముందే చర్య తీసుకోండి.
కుక్కలు కూడా మనుషులలాంటివే
మీ పెంపుడు జంతువులు కూడా మనలాంటివే. అప్పుడప్పుడు వాటికి కూడా చిన్నచిన్న అనారోగ్యాలు వస్తుంటాయి, తరచుగా మాత్రం ఈ చెవి ఇన్ఫెక్షన్ రావచ్చు. కానీ మనలాగా అవి తమంతట తాము డాక్టర్ దగ్గరకి వెళ్ళలేవు కదా. అవి మెడికల్ షాపుకి వెళ్ళి మందులు కూడా కొనుక్కోలేవు. ఇంకా వాటికి చెవి ఇన్ఫెక్షన్ కి చికిత్స చేయకుండా వదిలేస్తే వచ్చే ఇతర సమస్యలు కూడా చాలావరకు తెలియవు.

Image Source: pinterest
అందుకని దాని మాస్టర్ మరియు యజమానిగా, చికిత్స చేయించటం, ఇకపై చెముడు వంటి సమస్యలకి దారితీయకుండా నివారించే బాధ్యత మీదే.
కుక్కలు వెబ్ లో చెవి ఇన్ఫెక్షన్ గురించి సమాచారం తెలుసుకోలేవు కాబట్టి (అవి చదవలేవు కూడా), ఆ స్థితిని గురించి మరింత తెలుసుకుని మీరు తెలుసుకున్నది వాటి సంరక్షణ కోసం ఆచరణలో పెట్టడం మీ బాధ్యతే అవుతుంది.
కుక్కపిల్లల చెవి ఇన్ఫెక్షన్లకి సంబంధించి కొన్ని ఇంటి చిట్కాలు ఇక్కడ ఉన్నాయి, చదవండి ;

1.మీ కుక్కపిల్ల చెవి ఇన్ఫెక్షన్ కి చికిత్స మొదలుపెట్టేముందు, ముందుగా దాని చెవిని నీటితో శుభ్రపర్చండి.
ఇన్ఫెక్షన్ సోకిన ప్రాంతాన్ని గోరువెచ్చని నీటితో కడగండి. ఇలా చేయటం వలన కొన్ని సూక్ష్మజీవులు, మురికి లేదా మంట తెప్పించే మరియు ఇన్ఫెక్షన్ ను తీవ్రతరం చేసేవన్నీ తొలగించబడతాయి. ముందుగా ఇన్ఫెక్షన్ సోకిన ప్రదేశాన్ని శుభ్రపర్చటం వలన ఇంటి చిట్కాలు కూడా దానికి సరిగ్గా అంది ఆ ప్రాంతంలో ఆ పదార్థాలు ఇంకి ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తాయి.

2.వెనిగర్ ఇన్ఫెక్షన్ తో పోరాడే మంచి యాంటిసెప్టిక్.
అదనంగా,వెనిగర్ వాపును తగ్గించే మరియు నొప్పి, అసౌకర్యాన్ని తగ్గించే మంచి ఉపశమన పదార్థం. యాపిల్ సిడర్ వెనిగర్ ను తీసుకుని కొంచెం నీటిని కలిపి ఇన్ఫెక్షన్ సోకిన ప్రాంతమంతా స్ప్రే చేయండి. మరో పద్ధతి సుగంధపూల మొక్క అయిన విచ్ హేజెల్ ను, ఇది సహజంగానే ఘాటుగా ఉంటుంది, దీన్ని ఇన్ఫెక్షన్ సోకిన చెవిని శుభ్రపర్చటానికి వాడవచ్చు.

3.ముల్లెయిన్ నూనె మరియు వెల్లుల్లి నూనెను కలిపి వాడటం వలన వాపుకి ఉపశమనం కలుగుతుంది,
ముల్లెయిన్ నూనె మరియు వెల్లుల్లి నూనెను కలిపి వాడటం వలన వాపుకి ఉపశమనం కలుగుతుంది, నొప్పి తగ్గి, వైరస్ ను చంపేస్తుంది.
ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ వాడి చూడండి. పదిరోజుల్లోనే మెరుగైన ఫలితాలు చూస్తారు.

4. సమాన పరిమాణాలలో మినరల్ నూనె మరియు పౌ డి’ఆర్కోను తీసుకుని మసాజ్ నూనెగా కలపండి.
దీన్ని ఇన్ఫెక్షన్ సోకిన చెవిలో రోజుకి కనీసం రెండుసార్లు వాడండి. సహజమైన యాంటీబయాటిక్ అవటంతో, పౌ డి’అర్కో మీ కుక్కపిల్ల చెవిలోని బ్యాక్టీరియా,ఫంగస్ ను చంపేస్తుంది.

5.వేడి నీటి కాపడం నొప్పిని తగ్గించి, వాపుకి ఉపశమనం అందిస్తుంది.
ఇలా మీ కుక్కపిల్ల ఇన్ఫెక్షన్ ఉన్న చెవిపై రోజులో చాలాసార్లు చేయవచ్చు.

6.మీ కుక్కపిల్ల చెవిలో పెరుగుతున్న వెంట్రుకలు గాలి ఫ్రీగా తిరగకుండా అడ్డుకుంటుండవచ్చు.
దీని వలన చెవి నాళం పొడిగా మారి ఇన్ఫెక్షన్ ను అనువుగా ఉంటుంది. ఎంత వీలైతే అంత, చెవి నాళాన్ని అడ్డుకునే జుట్టును తీసేయటానికే ప్రయత్నించండి.

7.విటమిన్ సి సప్లిమెంట్లను క్రమం తప్పకుండా మీ కుక్కకి ఇస్తుండండి
దీని వలన చెవి ఆరోగ్యం బాగుండి, భవిష్యత్తులో కూడా చెవి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటుంది. అదనంగా, విటమిన్ సి మీ కుక్క యొక్క రోగనిరోధకతను పెంచి అడ్రినల్ గ్రంథి స్రావాలను కూడా పెంచుతాయి. ఇవే చెవి ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో ముఖ్యమైనవి.



Click it and Unblock the Notifications











