For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఈ వేసవిలో మీ పెంపుడు జంతువుల భద్రతా చర్యలు

  |

  వేసవికాలం ఎండ తీవ్రత మనుషులపై ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో, పెంపుడు జంతువుల పట్ల కూడా అంతే ప్రభావాన్ని చూపుతుంది. మీరు ఆ ప్రభావాన్ని అంచనా వేయడం ద్వారా మీ పెంపుడు జంతువులకు వేసవి తాపం తగలకుండా కాపాడుకోవచ్చు.

  కార్లలో ఉంచకండి :

  మద్యాహ్నం సమయాల్లో కార్లు తీవ్రమైన వేడికి గురవుతూ ఉంటాయి. కావున మీ పెంపుడు కుక్కలను కార్లలో ఒక నిమిషం కూడా వదలవద్దు. మీరు కొద్దిసేపు పనికే వెళ్ళాల్సిన అవసరం వచ్చినా, మీ పెంపుడు జంతువులను కార్లలో వదిలి వెళ్ళడం మాత్రం శ్రేయస్కరం కాదు. అవి అసహనానికి గురవుతాయి.

  అజాగ్రత్త పనికి రాదు: ఒక్కోసందర్భంలో ఎక్కువసేపు కార్లలో పెంపుడు జంతువులను వదిలివేయడం వలన అవి వడదెబ్బకి గురయ్యే ప్రమాదమూ లేకపోలేదు. తద్వారా వాటి అవయవాలు సైతం దెబ్బతినే అవకాశo ఉంది. ఇది ప్రాణాంతకంగా మారవచ్చు కూడా. ఒకవేళ మీరు, ఎక్కడైనా కార్ లో ఒంటరిగా పెంపుడు జంతువు ఉండడం చూస్తే, కాస్త అందరినీ వాకబు చేసి కార్ ఓనర్ కి తెలియజేసి తద్వారా ఆ ప్రాణిని కాపాడండి. ఒకవేళ మీరు అలా చెయ్యలేని పక్షంలో జంతు సంరక్షణా కేంద్రాలకు తెలిపి వారి ద్వారా కాపాడవచ్చు కూడా. మధుర దేశ్ముఖ్ అనే ఒక పెంపుడు జంతువు యజమాని ఇలా అన్నారు “నాకు Dachshund కుక్క కూడా ఉంది. దీనికి బొచ్చు కూడా ఉండదు , అయినా వేసవిలో చురుకుగా ఉంటుంది. కాని బొచ్చు కుక్కల మాదిరి నిస్తేజంగా ఉండదు అని. అనగా బొచ్చు కుక్కలకు వేసవి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని చెప్పకనే చెప్పారు.

  Summer pet Care tips for Puppies

  నడకకు వెళ్ళునప్పుడు:

  మీ పెంపుడు జంతువుని సూర్యోదయం ముందుగా కాని, లేక సూర్యాస్తమయం తర్వాత కాని నడకకు తీసుకుని వెళ్ళడం శ్రేయస్కరం. దీనికి కారణం ఎండ వేడిమి వలన వాటి చర్మం కమిలిపోయే అవకాశo ఎక్కువ. పైగా వేడి గా ఉన్న రోడ్లు ఇంకాస్త అసౌకర్యాన్ని పెంచుతాయి కూడా. ఒకవేళ మీకు అనుమానం వస్తే రోడ్డు పై 30 సెకన్లు మీ అరచేతిని ఉంచి ఎండ వేడిని అంచనాకు తెచ్చుకున్నాకనే మీ పెంపుడు జంతువులని నడకకి తీసుకుని వెళ్ళండి. వాటికి సమస్య వచ్చినా చెప్పుకునే స్థితి ఉండదు కాబట్టి. ఒకవేళ మీ చేతిని ఆ వేడి భాధపెడితే , ఆ సమయం మీ పెంపుడు జంతువు నడకకు మంచిది కాదని మీకే అర్ధమవుతుంది. మనుషులు కాని , పెంపుడు జంతువులు కాని పాదరక్షలు లేకుండా ఎండ వేడిమికి గురైన రోడ్లపై నడవలేరు. కాని ఈ వేడిమి వలన పెంపుడు జంతువులు అసౌకర్యానికి గురైనప్పుడు వాటి ప్రవర్తన విచిత్రంగా కనిపిస్తుంది.

  Summer pet Care tips for Puppies

  ఆహార పదార్ధాల విషయములో :

  వేసవికాలం పెంపుడు జంతువుల ఆహారపదార్ధాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. లేస్లిన్ బాస్టియన్ చెప్పిన ప్రకారం “ నా పెంపుడు కుక్క ఎండ వేడిమికి అసౌకర్యానికి గురైనప్పుడు, దానికి ఒక నా ఇంట్లో తయారు చేసిన మంచు ముక్కని ఇస్తాను. అది తిన్న తర్వాత, ఎండ వేడిమి తగ్గడంతో పాటు ఎంతో చలాకీగా ఉండడం కూడా గమనించాను” అని. పెంపుడు కుక్కలకు ముఖ్యంగా ప్రత్యేకమైన ఆహారాన్ని పరిమిత మొతాదులోనే ఇవ్వవలసి ఉంటుంది. ద్రాక్షను కాని, ఎండు ద్రాక్షని కాని ఈ సమయాల్లో ఇవ్వకూడదు. ఇవి శరీరంలో ఉన్న చల్లదనాన్ని హరించి వేడిని పెంచుతాయి. అదే విధంగా వాటికి చాక్లెట్స్, ఆనియన్ లను కూడా ఇవ్వకపోవడం మంచిది.

  Summer pet Care tips for Puppies

  వీధి జంతువుల పట్ల జాలిని చూపండి:

  వీధుల్లో తిరిగే జంతువులను ఎక్కువ సేపు ఇంట్లో ఉంచడం కుదరదు మరియు సమయానుసారం పెంపుడు జంతువులలాగా నడకకు తీసుకెళ్లడం కూడా కుదరదు. కావున ఈ వేసవిలో వీటికోసం ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకోవలసి ఉంటుంది. ఇవి విశ్రాంతి తీసుకునే ప్రదేశం నీడపట్టున ఉండేలా చూసుకోవాలి, మరియు ఎప్పటికప్పుడు చల్లని తాజా నీటిని అందుబాటులో ఉంచాలి. వీలయితే వీటికోసం తక్కువ ఖరీదులో ఎక్కువ వచ్చేలా ఒక సంచి నిండా బిస్కెట్స్ తీసుకుని వచ్చి వాటికి అందించడం మంచిది. దీని కారణాన ఎండ వేడిమి తట్టుకోగల బలాన్ని సంతరించుకోగలుగుతాయి.

  Summer pet Care tips for Puppies

  పూల్ పార్టీ :

  వేసవికాలంలో మీ ఇంట్లో స్విమ్మింగ్ పూల్ కనుక ఉంటే పెంపుడు జంతువులతో సహా మంచి సమయాన్ని ఆస్వాదించవచ్చు. ఒక వేళ పూల్ లేని పక్షంలో, వీలయితే నీడ పట్టున అనువుగా ఒక కాలువని తవ్వి చిన్ని పూల్ గా తయారు చెయ్యడం మంచిది. పూల్ పార్టీలు సరదాగా ఉంటాయి, కాని ఇక్కడ భద్రత కూడా చాలాఅవసరం. మీరు ఈ నీటిలో ఎక్కువ క్లోరిన్ కలిపినట్లయితే, అది పెంపుడు జంతువుల కడుపుల పై ప్రభావాన్ని చూపిస్తుంది. తద్వారా చాలా అసౌకర్యానికి గురవుతుంటాయి. ఒక్కోసారి ఎక్కువ రసాయనిక చర్యల వలన చర్మ సంబంధ వ్యాధులకు, అలర్జీలకు కూడా కారణం అవుతుంటాయి. కావున జాగ్రత్త అవసరం. లాయర్ పూజా భరద్వాజ్ చెప్పిన ప్రకారం “ నేను నా పెంపుడు కుక్కని ఎప్పుడూ చల్లాగా ఉంచునట్లు చూసుకుంటాను, వీలయితే ప్రతి 20 , 30 నిమిషాలకు ఒకసారి స్ప్రే బాటిల్ ద్వారా నీళ్ళు చల్లి దాని సేద తీరుస్తుంటాను” అని తెలిపారు. వీలయితే మీరు కూడా ఈ పని చేసి చూడండి.

  Read more about: pet care
  English summary

  Summer pet Care tips for Puppies

  Puppies make the home cheerful and are loved by kids too! Summer heat can make us happy for the first few days as we get relief from the winter chills but, for puppies extra pet care is required during summer. To keep your pet healthy and active in the summer season, check out these pet care tips for puppies.Read more at: https://www.boldsky.com/home-n-garden/pet-care/2012/summer-pet-care-puppies-120312.htmlPuppies make the home cheerful and are loved by kids too! Summer heat can make us happy for the first few days as we get relief from the winter chills but, for puppies extra pet care is required during summer. To keep your pet healthy and active in the summer season, check out these pet care tips for puppies.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more