For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సమ్మర్ లో మీ పెట్స్ కోసం తీసుకోవల్సిన కేరింగ్ టిప్స్

By Super
|

ప్రస్తుతం వేసవి సీజన్. వేసవి సీజన్ లో ఎండ , వేడి, నుండి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. కేవలం మన ఆరోగ్యం మాత్రమే కాదు, మన ఇంట్లో ఉండే పెంపుడు జంతువుల యొక్క ఆరోగ్యం కూడా మనకు అవసరమే. పెంపుడు జంతువులకు కూడా వేడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీ ఇంట్లో ఉండే పెంపుడు కుక్క విశ్రాంతి లేకుండా మరియు వాటి ప్రవర్తన తేడా అగుపిస్తే వెంటనే వాటిని ఆరుబయటకు తీసుకెళ్ళడం మంది . వాటి బయటకు తీసుకెళ్లీ వాటిని ఆరబటయ ఆడుకునేందుకు వదిలేయాలి.

బాల్ లేదా ఫ్రిస్బీ డిస్క్ వంటివి వాటి ముందుర వేసి అవి ఆడుకొనేలా చేయాలి. మనుష్యులకు మాత్రమే కాదు పెంపుడు కుక్కలకు కూడా అప్పుడప్పుడు సన్ రేస్ అవసరం అవుతాయి . పెంపుడు కుక్క చర్మంలో కానీ, లేదా బొచ్చులో కానీ వ్యత్యాసం కనబడితే వెంటనే డాక్టర్ ను సంప్రదించి వాటికి బొచ్చు ట్రిమ్ చేయడానికి లేదా స్పా ట్రీట్మెంట్ వంటివి చేయించాలి.

అలాగే పెంపుడు జంతువులు ఎక్కువ వేడికి కూడా తట్టుకోలేవు.వాటిని వేడి నుండి సంరక్షించుకోవడానికి వాటర్ బ్యాగ్ లేదా స్విమ్మింగ్ ఫ్లోటర్ లో వదలడం వల్ల అవి వేసవి వేడి నుండి ఉపశమనం పొందుతాయి.

వేసవి వేడిని ఎదుర్కోవడానికి ఈ చిన్న చిట్కాతో పాటు మరికొన్ని చిట్కాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఇవి పెంపుడు కుక్కలకు ఖచ్చితంగా ఉపశనమం కలిగిస్తాయి.. మరిఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కాలేంటో చూసేద్దాం....

అవి ఏం తింటున్నాయో గమనించండి:

అవి ఏం తింటున్నాయో గమనించండి:

పెంపుడు కుక్కలను పెంచుకోనే యజమానులు, వాటి బాగోగులు కూడా గమనిస్తుండాలి. వేసవిలో మనతో పాటు, వాటికి కూడా వేడిని ఎదుర్కోవడానికి సహాయపడే ఆహారాలను అందివ్వాలి. పుచ్చకాయ, మజ్జిగ, మరియు కొబ్బరి నీళ్ళు వంటివి వాటికి కూడా అప్పుడప్పుడు అందివ్వాలి. పెరుగు మంచి ప్రోబయోటిక్ ఆహారం.కాబ్టటి అన్నంతో పాటు, పెరుగు, మాంసాన్ని కలిపి పెట్టొచ్చు.

బయటకు తీసుకెళ్ళండి:

బయటకు తీసుకెళ్ళండి:

ఉదయం మరియు సాయంత్రాల్లో వాటిని బయటకు తీసుకెళ్ళడం చాలా ఫర్ఫెక్ట్ , ఎండ తగలకుండా , చల్లని వాతావరణంలో వాటిని బయట తిప్పాలి.. ఇలా చేయడం వల్ల మీతో పాటు అవి కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఇంకా పార్కుల వెంట తిప్పండి . వాటి కాళ్ళను స్ట్రెచ్ అయ్యేలా చూడండి.

గ్రూమ్ చేయాలి:

గ్రూమ్ చేయాలి:

వేసవిలో ఎక్కువ వేడి కలగకుండా వాటి బొచ్చును పూర్తిగా ట్రిమ్ చేయాలి . కుక్కజాతిని బట్టి, మరియు వాటికి ఎంత వరకూ ట్రింమ్ చేయవచ్చనేది వెటర్నిటీ డాక్టర్ కు తెలుసుంటుంది . అవసరమైనంత ట్రింమ్ చేయించండి.

స్విమ్ చేయించాలి:

స్విమ్ చేయించాలి:

వేసవి వేడిని తట్టుకోవడానికి వాటి ని స్విమ్మింగ్ కు తీసుకెళ్ళండి. లేదా నగరాల్లోని పెట్ ఫ్రెండ్లీ రిసార్ట్స్ కు తీసుకెళ్ళండి. ఈ రెండు పద్దతులు మీకు మరియు మీ పెంపుడు కుక్కలకు వేసవి వేడి నుండి ఉపశమనం కలుగుతుంది.

కుక్కలకు తగినన్ని నీరు అందివ్వాలి:

కుక్కలకు తగినన్ని నీరు అందివ్వాలి:

మనుషులకు వలె వాటికి కూడా ఎక్కువ నీరు అవసరం అవుతాయి. అవి ఎక్కువ నీరు తాగేట్లు చూడాలి. వాటికి ఒక గిన్నెలో నీరు నింపి పెట్టడం వల్ల అవి రోజులో వాటికి దాహం అనిపించనప్పుడు అవి తాగుతుంటాయి.

వాతావరణంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు:

వాతావరణంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు:

వేసవి కాలంలో వేడి ఎక్కువగా ఉంటుంది. అటువంటి సమయంలో అవిబయట తిరగకుండా నీడని ప్రదేశంలో ఉంచాలి. కుక్కలు కూడా వడదెబ్బకు గురైయ్యే అవకాశాలు ఎక్కువ. దాంతో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి . కాబట్టి, వాటిని చల్లని వాతావరణంలో ఉండనివ్వాలి,.

పిల్లులకు కూడా :

పిల్లులకు కూడా :

పెంపుడు కుక్కల వలే పిల్లులు కూడా ఎండ వేడికి తట్టుకోలేవు. అయితే అవి కొన్ని సమయాల్లో అవి ఎండను ఇష్టపడుతాయి . కాబట్టి వాటికి కూడా తగిన చల్లని ప్రదేశాన్ని కల్పించాలి . ఎక్కువ నీరు అందివ్వాలి. పెంపుడు జంతువులు హైడ్రేట్ గా మరియు కూల్ గా ఉంచాలి.

English summary

Tips To Help Pets Beat The Summer Heat

Summer is here and it is time to beat the heat along with your pets. If your pet is feeling restless and out of control, it is best to take them out for a walk and let them play in an open ground.
Story first published:Saturday, May 14, 2016, 13:37 [IST]
Desktop Bottom Promotion