For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఈ 7 ఇంటి నివారణలు ద్వారా పెంపుడు జంతువుల యొక్క దురద మచ్చలు పోగొట్టవచ్చు

  By R Vishnu Vardhan Reddy
  |

  ప్రశ్న : అమ్మమ్మ నా దగ్గర కుందేళ్లు, ఎలుక మరియు పిల్లి లాంటి విభిన్నపెంపుడు జంతువులు ఉన్నాయి. వాటికి చెవులు ఎక్కువగా దురద పెడుతుంటాయి. అలా అనిపించినప్పుడల్లా, ఆ జంతువులు ఎక్కువగా ఉద్రేకపడి, వాటంతటకు అవే ఆ ప్రదేశంలో గోకుంటున్నాయి. దీని వల్ల అవి పుండ్లుగా మారుతున్నాయి. నేను ప్రస్తుతానికి స్కూల్ కి మాత్రమే వెళ్తున్న ఒక విద్యార్థిని. నా దగ్గర డబ్బు ఏమి లేదు. ఈ సమస్యకు నువ్వు పరిష్కారం చెప్పగలవా ?

  జవాబు : మనవడా! సాధారణంగా పిల్లులు మరియు కుక్కలు లాంటి పెంపుడు జంతువులకు విపరీతమైన దురద భావన ఉంటుంది. ఎక్కువ శాతం వీటి చెవుల్లో ఇలాంటి భావన వాటికి కలుగుతూ ఉంటుంది. మీరు పెంచుకొనే పెంపుడు జంతువులకు, దురదతో కూడిన చెవులు ఉన్నాయని మీకు గనుక అనుమానం కలిగినట్లైతే, మీరు ఒకసారి వాటి చెవులను పరీక్షించండి. చెవులకు ఇన్ఫెక్షన్ సోకడం వల్ల కూడా ఆ దురద బాధ ఎక్కువగా ఉంటుంది. ఆ చెవులొకి పురుగులు వెళ్లి ఉండవచ్చు, స్నానం సరిగ్గా చేయలేకపోయి ఉండవచ్చు మరియు చెవి లోపల గులిమి ఎక్కువగా పేరుకుపోయి ఉండవచ్చు లేదా ఎక్కువగా ఉత్పత్తి అయి ఉండవచ్చి. ఇలాంటి సందర్భాల్లో వాటిని కొద్ది రోజుల పటు గమనించాల్సి ఉంటుంది. అవి గనుక వింతగా ప్రవర్తిస్తున్నట్లైతే, ఉదాహరణకు తలను ఒక వైపే అలా వాల్చి ఉండటం, నడిచేటప్పుడు పట్టు కోల్పోవడం, అగమ్యగోచరంగా వ్యవహరించడం లేదా విపరీతంగా చెవి ప్రాంతంలో గోక్కోవడం. ఇలా గనుక చేస్తే చెవిలో ఎదో సమస్య ఉందని అర్ధం.

  దురద చెవుల విషయంలో మీ అనుమానమే గనుక నిజమైతే, మీ పెంపుడు జంతువులను క్రిమికీటకాలు నుండి దూరం చేసి, వాటిని ఆరోగ్యవంతంగా ఉంచాలని మీరు గనుక భావించినట్లైతే, ఈ ఉపయోగకరమైన సూచనలను ఖచ్చితంగా పాటించండి.

  పెంపుడు జంతువులకు దురదగా ఉన్న చెవులు ఉన్నట్లయితే, అందుకు సంబంధించిన నివారణలు :

  1. మూలికలు :

  1. మూలికలు :

  టీ ట్రీ నూనె, రోజ్ మెర్రి, మరియు బంతి పువ్వు వంటి వాన మూలికలు మీ యొక్క పెంపుడు జంతువు యొక్క చెవులను ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలనుకుంటే, ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. కాటన్ బడ్ ని ఉపయోగించి పైన చెప్పబడిన నూనెల్లో వేటిల్లో అయిన వాటిని నానబెట్టండి. ఆ తర్వాత దాంతో సుత్తిమెత్తగా లేదా మృదువు గా పెంపుడు జంతువు యొక్క చెవిలో రాయండి.

  2. సబ్బు మరియు నీరు :

  2. సబ్బు మరియు నీరు :

  మీ పెంపుడు జంతువుకి గనుక చెవి ప్రాంతంలో దురదతో బాధపడుతున్నట్లైతే, దానిని సబ్బు మరియు నీరు పోగొడుతుంది. వీటిని ఉపయోగించి మీ పెంపుడు జంతువుల యొక్క చెవులను కడగండి. ఇలా చేసిన తర్వాత కాటన్ బడ్ ని తీసుకొని చెవిలోపల గులిమి తీసివేసి, దాని యొక్క చికాకుని తగ్గించండి.

  3. మద్యం మరియు వెనిగర్ :

  3. మద్యం మరియు వెనిగర్ :

  ఒక పాత్రలో సరిసమానమైన మోతాదులో మద్యాన్ని మరియు వెనిగర్ ని సరిసమానంగా కలపండి. ఈ మిశ్రమాన్ని పెంపుడు జంతువుల యొక్క చెవులను కడగటానికి ఉపయోగించవచ్చు. మద్యానికి త్వరగా ఆవిరియే స్వభావం వల్ల, అది త్వరగా ఆవిరి అయిపోతుంది. మరో వైపు వెనిగర్ లో సూక్ష్మ క్రిములను నశింపజేసే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి చెవులను శుభ్రపరచడానికి ఉపయోగపడతాయి. మీ పెంపుడు జంతువు యొక్క తలను క్రిందకు వంచి చాలా జాగ్రత్తగా ఈ మిశ్రమాన్ని దాని చెవులకు రాయండి. ఇలా రాసిన తర్వాత చెవిని కొద్దిగా మర్దన చేయండి. ఆ తర్వాత వాటంతట అవే లేచి, తలను అటు ఇటు ఊపేలా చేయనివ్వండి. ఇలా చేయడం వల్ల ఆ మిశ్రమం చెవి లోపల అంతటా వ్యాపించి, చెవి ని శుభ్రపరుస్తుంది. ఇదే విధంగా మరొక్క చెవికి కూడా చేయండి.

  4.నీరు, వెనిగర్ మరియు మద్యాన్ని కలిపిన మిశ్రమాన్ని పిచికారీ చేయండి :

  4.నీరు, వెనిగర్ మరియు మద్యాన్ని కలిపిన మిశ్రమాన్ని పిచికారీ చేయండి :

  ఒక కప్పు నీరు, రెండు కప్పుల వెనిగర్ మరియు ఒక టేబుల్ స్పూన్ మద్యాన్ని తీసుకొని, ఈ మూడింటిని కలగలిపి ఒక మిశ్రమాన్ని తయారుచేయండి. ఈ మూడింటిని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ఒక బాటిల్ లో వేయండి .మీ పెంపుడు జంతువుకు స్నానం చేయించిన ప్రతిసారి వాటి చెవుల్లో పిచికారీ చేయండి. మనం ఇంతక ముందు చెప్పుకున్నట్లుగానే, వెనిగర్ కు సూక్ష్మ జీవులను అదుపుచేసే లక్షణం ఉంది. మరో వైపు మద్యానికి చెవిలో ఉండే గులిమిని తగ్గించే శక్తి ఉంది. ఈ పద్దతి ద్వారా పెంపుడు జంతువులకు చెవిలో వచ్చే దురదలు నిరోధించవచ్చు.

  5. గోరువెచ్చని నీరు మరియు ఖనిజ నూనె :

  5. గోరువెచ్చని నీరు మరియు ఖనిజ నూనె :

  ఏదైనా చుక్కలు వేయు పరికరాన్ని తీసుకొని దాని సహాయం ద్వారా ఈ రెండు మందులలో దేనినైనా ఒకదానిని పెంపుడు జంతువుల చెవిలో వేయండి. ఇలా చేయడం వల్ల చెవిలో ఉండే గులిమి కరిగిపోతుంది మరియు చెవులకు దురద కూడా తగ్గుతుంది.

  6. గోరువెచ్చని నీరు మరియు పెరాక్సైడ్ :

  6. గోరువెచ్చని నీరు మరియు పెరాక్సైడ్ :

  చెవులకు ఉండే దురదను పోగొట్టడానికి మిగతా వైద్య పద్దతుల్లా ఈ పద్దతి కఠినమైన పద్ధతిలా ఉండదు. కానీ, చెవిలో ఉండే గులిమి తగ్గించడంలో ప్రభావంతంగా పనిచేస్తుంది.

  7. కుక్కల కోసం ప్రత్యేకంగా తయారుచేయబడిన చెవి వాష్ లను వాడండి :

  7. కుక్కల కోసం ప్రత్యేకంగా తయారుచేయబడిన చెవి వాష్ లను వాడండి :

  ఈ మధ్య కాలంలో పెంపుడు జంతువుల కోసం, ముఖ్యంగా కుక్కల కోసం, కుక్కలు ఏవైతే చెవిలో దురదలతో బాధపడుతుంటాయో, వాటి నివారణకై కొన్ని ప్రత్యేకమైన వాష్ లను తయారు చేయడం జరిగింది. ఇవి సువాసనలను వెదజల్లుతాయి. అందుచేత మీ పెంపుడు జంతువుల యొక్క చెవి నుండి కూడా మంచి వాసన వస్తుంది. ఈ పెంపుడు జంతువు యొక్క చెవిలో చాలా కొద్ది మోతాదులో మాత్రమే, ఈ చెవి వాష్ ని పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా చెవులు శుభ్రం అవుతాయి, కొన్ని క్షణాల తర్వాత చెవుల లో ఉండిపోయిన అవశేషాలను దూది ఉండలు ఉపయోగించి తీసివేయండి.

  English summary

  7 Home Remedies for Pets Itchy Ears

  If your suspicion is right about itchy ears, check these useful guidelines to keep your pets away from pests and so they can be kept in good health.
  Story first published: Monday, February 19, 2018, 18:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more