Latest Updates
-
వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు ఈ 'దేశీ' చిట్కాలు పాటించండి.. ఎండల నుంచి ఉపశమనం ఎలా? -
మండే ఎండలకు చెక్.. ఇంట్లో ఉండే పండ్లతోనే చల్లటి, క్రీమీ ఐస్ క్రీమ్ తయారీ! -
మీ చుట్టూ ఉన్న తేనె పూసిన కత్తులను ఎలా గుర్తించాలి? -
నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డులు వచ్చేస్తున్నాయి.. డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
జిమ్ వద్దు, కఠిన డైట్ వద్దు..3 నెలల్లో 12 కిలోలు తగ్గిన డాక్టర్ సీక్రెట్ ఇదే! -
రవి యోగం, సిద్ధ యోగం కలయిక.. ఏప్రిల్ 26న ఈ రాశుల వారికి ఇక తిరుగేలేదు! -
వేళ్లు కూడా నాకి నాకి తినే కొత్తిమీర పన్నీర్ కర్రీ..రోటీ, నాన్ లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
సండే స్పెషల్: పుల్లపుల్లగా, కారంకారంగా మామిడికాయ మటన్ కర్రీ.. టేస్ట్ కిర్రాక్! -
ఎండలు మండిపోతున్నాయా? వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకునే అద్భుతమైన చిట్కాలు ఇవే! -
మోహినీ ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలితం దక్కాలంటే పారణ సమయాలు, నియమాలు తప్పక తెలుసుకోండి!
కోపంగా ఉన్నపెంపుడు కుక్కను శాంతపరచడం ఎలా?
కుక్క మనిషికి మంచి స్నేహితుడు, కానీ ఎల్లప్పుడూ కాదు. కొన్నిసార్లు మనిషి మంచి స్నేహితుడు శత్రువుగా మారొచ్చు. కోపంతో ఉన్న కుక్క కొన్నిసార్లు చుట్టూ దుమకడం, వెనక ముందు పరిగెట్టడం వంటి లక్షణాల వైఖరిని ప్రదర్శిస్తుంది. కోపంతో ఉన్న కుక్క తననుతాను నియంత్రించుకోలేదు, దాన్ని చల్లబరచడానికి దానికి మీ సహాయం అవసరం. మీరు కోపంతో ఉన్న కుక్కతో వ్యవహరించడం అనేది ఖచ్చితంగా దురదృష్టకరమైన విషయమే, అయితే, అదేసమయంలో కుక్కలతో సంభాషించడం అనేది కూడా మంచి విషయమే.
కోపంతో ఉన్న కుక్కని శాంత పరచడం కొన్నిసార్లు కష్టమే, కానీ తగినంత శ్రద్ధ తీసుకుంటే ఇది ఖచ్చితంగా సాధ్యమే. కోపంతో ఉన్న కుక్కను శాంతపరచదానికి "సంభాషించడం" అనేది ఒక చిన్న చిట్కా. కోపంతో ఉన్న కుక్కను ఓదార్పుతో, ప్రశాంతతతో సంభాషించాలి. మీ కోపంతో ఉన్న కుక్కను శాంతపరచడానికి ఇక్కడ ఇచ్చిన కొన్ని విషయాలను తెలుసుకోవడం అవసరం.

1. కళ్ళతో మాట్లాడడం
మన నిజమైన భావనలను తెలియచేయడానికి కళ్ళు ప్రధాన అవయవాలలో ఒకటి. కోపంతో ఉన్న కుక్కను శాంతపరచడానికి మీకు అవసరమైన మొట్టమొదటి, ముందటి విషయం. దాని కళ్ళలోకి నేరుగా చూడకండి. మీరు కోపంతో ఉన్న కుక్క ముఖాన్ని చూడలేరు కాబట్టి మీ ముఖాన్ని కొంచెం పక్కకు తిప్పుకోండి. ఎటువంటి దారుణమైన పరిస్థితులలోనైనా, మీరు వెనుకకు తిరిగి పరిగెట్టకండి. చాలా సాధారణంగా, నిదానంగా ముందుకు వెళ్ళడం ఎల్లప్పుడూ మంచిది.
2. తగినంత దూరంలో ఉండండి
కోపంతో ఉన్న కుక్కను చూసినపుడు, దూరంగా ఉండండి. మీరు నడిచేటపుడు లేదా జాగింగ్ చేసేటపుడు రోడ్డుకు మరో పక్క నడవడం మంచిది. యజమానుల అనుమతితో మీరు కుక్కను పెంచుకోవచ్చు కూడా, దానితో స్నేహపూర్వకంగా ప్రవర్తించాలి.
3. మీ బాడీ లాంగ్వేజ్ పై దృష్టిపెట్టండి
మీరు కోపంతో ఉన్న కుక్కతో వ్యవహరించేటపుడు మీ బాడీ లాంగ్వేజ్ తో అద్భుతాలను చేయవచ్చు. సరైన బాడీ లాంగ్వేజ్ తో మీరు కోపంతో ఉన్న కుక్కను కూడా శాంతపరచవచ్చు. మీ శరీరాన్ని ఒక పక్కగా ఉంచి, నిదానంగా దూరంగా వెళ్ళాలి. అంతేకాక, మీ చేతులను మీ పాకెట్ లోపల పెట్టుకోవాలి.
4. కొంత సంయమనం ప్రదర్శించ౦డి
కోపంతో ఉన్న కుక్కను శాంతపరచడానికి సంయమనంతో ఉండడం కూడా ఉత్తమమైన మార్గాలలో ఒకటి. అరవడం వల్ల ఉపయోగం ఉండదు, అది మిమ్మల్ని కష్టాలపాలు చేస్తుందని గుర్తుంచుకోండి. అందువల్ల, దానినుండి దూరంగా జరిగి, ప్రేమతో మృదువుగా మాట్లాడండి.
5. వాటిపట్ల అవసరమైన శ్రద్ధ తీసుకోండి
మీ కుక్క మీ నుండి కొంత శ్రద్ధను కోరుకుంటుంది. దానికి అవసరమైన శ్రద్ధ ఇవ్వడంలో విఫలం కాకండి ప్రత్యేకంగా అది బ్యాడ్ మూడ్ లో ఉన్నపుడు. కోపంతో ఉన్న కుక్కను శాంత పరచడానికి మీ పూర్తి శ్రద్ధను చూపించాలి, మీ ప్రవర్తనను బలపరచాలి.
6. దానికి ఇష్టమైన వంటకంతో లాలించాలి
కోపంతో ఉన్న కుక్కను శాంత పరచడానికి మరో మార్గం దానికి ఇష్టమైన స్నాక్ తో లాలించడం. దానికి ఇష్టమైన స్నాక్ ని మీ వేళ్ళ మధ్యలో ఉంచండి, అది మీ వద్దకు పరుగెత్తుకు రావడం మీరు చూడవచ్చు. మీరు దానికి ఏమీ చెప్పఖరలేదు, ఆ స్నాక్ ని నిదానంగా దాని ముందు ఉంచండి, అది పూర్తి నియంత్రణలోకి రావడం మీరు చూడవచ్చు.
ఒకసారి మీరు దానిని జాగ్రత్తగా చూసినపుడు, దాని ప్రవర్తనను క్షుణ్ణంగా తెలుసుకుంటే కోపంతో ఉన్న కుక్కను శాంత పరచడం చాలా తేలిక. దాని బాడీ లాంగ్వేజ్ ని గమనించి దానిని బాగా తెలుసుకోండి. ఒక మంచి, గట్టి సంభాషణ మీకు మీ కుక్కకు మధ్య సంబంధాన్ని పెంచుతుంది. అది ఖచ్చితమైన నియంత్రణ పొందినపుడు, అది తిరిగి మీకు మంచి స్నేహితుడౌతుంది.



Click it and Unblock the Notifications