Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
వర్కింగ్ కపుల్స్ ప్రత్యేకంగా పెంచుకొనే క్యూట్ పెట్స్
చాలా వరకూ పట్టణాల్లో ఉద్యోగాల్లో పనిచేసే వారు, ముఖ్యంగా వర్కింగ్ కపుల్స్(జంటలు)ఎక్కువగా ఉంటారు. రోజంతా బిజీగా ఉండే అటువంటి జంటలు ఇంట్లో కనీసం పది గంటల సమయం అయినా గడపలేరు. అలా బిజీగా ఉండే వర్కింగ్ కపుల్స్ (ఉద్యోగం చేసే జంటలు)కూడా ప్రస్తుత రోజుల్లో ఇంట్లో పెట్స్ (పెంపుడు జంతువులను)పెంచుకుంటున్నారు. ఇక రెండవది. పెంపుడు కుక్కలను పెంచుకోవడం వల్ల అది ఇంటికి ఒక గార్డ్(కాపలాదారుగా)ఉంటుందనుకోవడం మరో ఎత్తు. ముక్యంగా మీరు పెంచుకొనే పెంపుడు జంతువుల ప్రేరణ కలిగి చాలా చలాకిగా, అందంగా కనిపించేవి అయితే మహిళలకు మరింత ఇష్టం. మరియు అటువంటివి ఎక్కువగా ఆకర్షించబడుతాయి.
అందుకే వర్కింగ్ కపుల్స్ కు ఇటువంటి పెంపుడు జంతువులను పెంచుకోవడానికి ఆదర్శంగా తీసుకుంటారు. మరీ ముఖ్యంగా, పనిచేసేవారికి పెట్స్ ను పెంచుకోవడం మంచిదే. పెట్స్ లో కొన్ని ఎక్కువ అల్లరిచేసేవి, కుక్కల్లా ఎక్కువగా అరిచేవి ఉన్నట్లైతే, ఇంట్లో వారికి ప్రశాంతత కరువవుతుంది . అందువల్ల, అక్వేరియం ఫిస్ల్ చాలా బెస్ట్. వర్కింగ్ కపుల్స్ కు చాలా ప్రశాంత వాతారణం కల్పించడంలో అక్వేరియం ఫిష్ ఎటువంటి శబ్దం కానీ లేదా వాటితో ఎక్కువ సమయం గడపాల్సిన పని కానీ ఉండదు.
వర్కింగ్ కపుల్స్ కు సూట్ అయ్యే పెట్ మరొకటి పిల్లులు. కుక్కలతో పోల్చితే పిల్లులు సెల్ఫ్ సఫిషియంట్స్. వాటంతంట అవే తినేస్తాయి. వాటి మీద ప్రత్యేకంగా, స్థిరమైన దృష్టి అవసరం లేదు. కొన్ని జాతుల కుక్కలను కూడా బెస్ట్ పెట్స్ గా వర్కింగ్ కపుల్స్ లిస్ట్ లో చేర్చుకోవచ్చు. ఉదా: గ్రే హండ్స్ చాలా నిశ్శబ్దంగా ఉంటాయి. మరియు వాటికి ప్రత్యే శ్రద్ద అంత అవసరం ఉండదు.

అక్వేరియం ఫిష్:
చేపల కంటే చాలా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండే పెట్స్ ను కనుక్కోవడం చాలా కష్టం. ఇవి ఎటువంటి శబ్ధంను కలిగించవు. మరియు వీటికి రోజులో రెండు సార్లు ఫీడింగ్ వేస్తే సరిపోతుంది. వీటి మీద స్థిరమైన దృష్టి అవసరం లేదు.

లవ్ బర్డ్స్:
యంగ్ కపుల్స్ కు, లవ్ బర్డ్ చాలా ఫాషనబుల్ పెట్స్. ఇవి వారికి ఖచ్చితంగా నచ్చడమే కాదు, వీటి వల్ల ఎటువంటి ఇబ్బంది, శబ్ధం ఉండదు. ఇవి ఒక స్లిట్ లో కూడా కూర్చొని ఉండగలవు, వీటికి ప్రత్యేకించి బోన్ అవసరం ఉండదు.

పర్సియన్ క్యాట్స్:
పెర్షియన్ పిల్లులు ప్రాదేశికంగా ఉండే జంతువులు. ఈ పెంపుడు జంతువులు, వాటికి కేటాయించిన వాటి స్థలంలోనే ఉండటానికి ఎక్కువ ఇష్టపడుతాయి. ఇతరులకు ఇబ్బంది కలిగించవు. మరియు సాధారణంగా ఉంటాయి.

గ్రే హౌండ్ డాగ్:
గ్రే హౌండ్ డాగ్ ఇది ఒక అరుదైన పెంపుడు జాతి కుక్క . వర్కింగ్ కపుల్స్ దీన్ని పెంచుకోవచ్చు. చాలా మంది ఇటువంటి పెంపుడు జంతువులను పెంచుకోవడానికి, వాటి చుట్టు తిరగడానికి ఇష్టపడుతారు. అంతే కాదు అవి గొప్ప పర్యవేక్షకులుగా ఉంటాయి.

కుందేళ్ళు:
కుందేళ్ళు ఎటువంటి శబ్దం కలిగి ఉండవు. ఎటువంటి అంతరాయం కలిగించవు. అవంతట అవే తినగలవు. మరియు వాటి వల్ల మీకు ఎటువంటి నష్టం కూడా ఉండదు. ఇంట్లో ఒక్క కుందేలు ఉంటే చాలా చాలా ప్రశాతంత ఉంటుంది.

చిలక:
చిలకులు అన్నీ మాట్లాడుతాయనుకోవడం ఒక భ్రమే కావచ్చు. అయితే వాటికి మనం ట్రైనింగ్ ఇవ్వొచ్చు. వాటికి సరైన ఆహారాలు అందిస్తే వాటంతట అవి తినగలవు. మరియు రోజంతా వీటిని కనిపెట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు.

కవల పిల్లులు:
కవల పిల్లులు ఒక నిష్ణాత పెంపుడు జంతువులు. మీరు సింగల్ గా ఉండే వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే, మీరు మాత్రమే జీవిస్తున్నట్లైతే మీకు తప్పకుండా కవల పిల్లులు పెంచుకోవడం, వల్ల మీకు కొంత ప్రశాంత మరియు టైమ్ పాస్ కలుగుతుంది. ఇవి చూడటానికి చాలా అందంగా ఉంటాయి.

గిన్నీ పిగ్స్:
రోజంతా బిజీగా ఉండే వ్యక్తుల కోసం కొంత వినోద భరితంగా అనిపిచేవి ఈ గిన్నీ పిగ్స్. వాటిని ఒక బోనులో ఉంచేతే చాలు.

ఇంగ్లీష్ బుల్ డాగ్:
ఇంగ్లీష్ బుల్ డాగ్ మరొక అందమైన జాతి కుక్క. ఇవి చాలా పెద్దగా రాక్షిసిమూతి కలిగి ఉంటాయి.



Click it and Unblock the Notifications
