Latest Updates
-
తెల్ల జుట్టుకి చెక్ పెట్టి, యవ్వన శక్తిని పెంచే ఆమ్లా మురబ్బా.. ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ.! -
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా!
Atla Tadde 2023: అట్ల తద్ది ఎప్పుడు, ఎలా జరుపుకోవాలి, శుభ ముహూర్తం ఎప్పుడంటే.
Atla Tadde 2023: అట్ల తద్ది అనేది హిందువులు జరుపుకునే పండుగ. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ పండగను పెద్ద ఎత్తున జరుపుకుంటారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో అట్ల తద్ది చేసుకుంటారు. భర్తల ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం మహిళలు చేసే పండగ అట్ల తద్ది.

అశ్వియుజ మాసంలోని శుక్ల పక్షం యొక్క మూడో రోజున అట్ల తద్ది జరుపుకుంటారు. నార్త్ ఇండియాలో కర్వా చౌత్ పేరుతో ఈ పండగ చేసుకుంటారు. దసరా తర్వాత దీపావళి ముందు వచ్చే ముఖ్యమైన పండగ అట్ల తద్ది. పెళ్లైన మహిళలు, పెళ్లి కాని వారు చేసుకునే పండగ ఇది. ఈ రోజున కొందరు అట్లు తయారు చేసి గౌరీదేవికి నైవేద్యంగా సమర్పిస్తారు. బంధువులకు, పొరుగు వారికి వాయనంగా పంచి పెడతారు. అట్లతద్దికి ముందురోజును భోగి అంటారు. ఈరోజంతా మహిళలంతా తమ చేతులకు మరియు పాదాలకు గోరింటాకు పెట్టుకుంటారు. ఎవరి గోరింటాకు అయితే బాగా పండుతుందో వారికి ఎక్కువ లక్కీ కలసి వస్తుందని నమ్ముతారు.

అట్ల తద్ది తేదీ, సమయం:
అట్ల తద్ది ఈ సంవత్సరం అక్టోబర్ 12వ తేదీ బుధవారం రోజున వస్తోంది.
అట్ల తద్ది సమయం:
తదియ తిథి ప్రారంభం: అక్టోబర్ 31వ తేదీ రాత్రి 9.30 గంటలకు ప్రారంభమై
తదియ తిథి ముగింపు: నవంబర్ 1వ తేదీ రాత్రి 9.19 గంటలకు ముగుస్తుంది
అట్ల తద్ది ఎలా చేసుకుంటారు?
అట్ల తద్ది పండుగ సందర్భంగా మహిళలందరూ ఉదయాన్నే నిద్ర లేచి.. సూర్యోదయానికి ముందే తలస్నానం చేస్తారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం పాటిస్తారు. ఈ పండుగ సమయంలో ఆడపిల్లలందరూ చల్లని నీడనిచ్చే చెట్ల కింద చేరతారు. అక్కడ ఊయల కట్టి అందులో ఆనందంగా ఊగుతారు. అలాగే ‘అట్ల తద్ది ఆరట్లు.. ముద్దపప్పు మూడట్లు'' అంటూ పాటలు పాడుకుంటూ ఇరుగు పొరుగు వారికి వాయినాలు ఇస్తారు. చాలా మంది అమ్మాయిలలో పెళ్లి వయసు వచ్చిన వారంతా తనకు కాబోయే భర్త మంచివాడు.. గుణవంతుడు, సౌమ్యుడిగా ఉండాలని కలలు కనడం అత్యంత సహజం. తమ కలలు నిజం కావాలని ఎన్నో వ్రతాలు, నోములు చేస్తుంటారు. అందులో ప్రతి సంవత్సరం జరుపుకునే అట్లతద్దికి చాలా ప్రాముఖ్యత ఉంది.

అట్ల తద్ది ఇలా జరుపుకోవాలి:
పెళ్లి కాని ఆడపిల్లలంతా తమకు మంచి భర్త రావాలని పూజలు చేస్తే.. పెళ్లి అయిన వారు మాత్రం తమకు మంచి భర్త దొరికినందుకు.. తను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. త్రిలోక సంచారి నారదుడి ప్రోద్బలంతో పరమేశ్వరున్ని పతిగా పొందడానికి పార్వతీ దేవి తొలిసారి చేసిన విశిష్టమైన వ్రతం ఈ అట్ల తద్ది.
పురాణాల ప్రకారం నవ గ్రహాలలో ఉండే కుజ గ్రహానికి అట్లంటే మహాప్రీతి. అందుకే తనకు అట్లను నైవేద్యంగా పెడితే కుజదోషం తొలగిపోతుందని.. తమ దాంపత్య జీవితంలో ఎలాంటి కలహాలు రాకుండా ఉంటాయని చాలా మంది నమ్ముతారు. రజోదయానికి కూడా కుజుడు కారకుడు. కాబట్టి రుతు చక్రం సక్రమంగా ఉంచి, దానికి సంబంధించిన సమస్యల నుండి కాపాడాతాడని, దీని వల్ల గర్భధారణలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని శాస్త్రాలు చెబుతున్నాయి.

అట్ల తద్ది పూజా విధానం:
అట్ల తద్ది నాడు ఇంట్లో తూర్పు దిక్కున మండపాన్ని ఏర్పాటు చేసి గౌరీ దేవిని ప్రతిష్ఠించాలి. ధూప, దీప, నైవేద్యాలు సమర్పించాలి. గణేశుడి పూజ తర్వాత, గౌరీ స్తోత్రం పఠించాలి. సాయంత్రం చంద్రుడిని దర్శించుకొని, తిరిగి గౌరీ పూజను చేసి 10 అట్లను నైవేద్యంగా సమర్పించాలి. పూజ చేసిన అనంతరం అట్లను, పండ్లను ఇరుగు పొరుగు వారికి వాయినంగా ఇవ్వాలి.
ఈ పవిత్రమైన అట్ల తద్ది రోజున పది రకాల పండ్లను తినాలి. పది రకాల తాంబూలాలు వేసుకోవాలి. పది సార్లు ఊయలను ఊగాలి. అందుకే ఈ పండుగను ఊయల పండుగ అని కూడా అంటారు. ఈ పండుగ సమయంలో గౌరీ దేవి అనుగ్రహం లభించి పెళ్లి కాని స్త్రీలకు మంచి భర్త, పెళ్లి అయిన వారికి సంతానం కలుగుతుందని చాలా మంది నమ్ముతారు. ఈ పండుగను తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటకలో ఎక్కువగా జరుపుకుంటారు.

అట్ల తద్ది పురాణం:
పెళ్లికాని అమ్మాయిలు మంచి భర్తలను పొందేందుకు అట్ల తద్ది ఆచారాన్ని పాటించాలని గౌరీ దేవి సూచించిందని ప్రతీతి. పురాణాల ప్రకారం, ఒక యువరాణి మంచి జీవిత భాగస్వామిని పొందడానికి అట్ల తద్ది ఉపవాసం పాటించింది. కానీ ఆమె అస్వస్థతకు గురైంది. ఆకలి దప్పికలతో మూర్ఛపోయింది. ఆమె సోదరులు ఆమెకు నిండు చంద్రుడిలా కనిపించే ప్రతిబింబం ఉన్న అద్దాన్ని చూపించారు. సోదరులు యువరాణికి మంచి వరుడిని కనుగొనలేకపోయారు. దాంతో ఓ వృద్ధుడితో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. నిరుత్సాహానికి గురైన యువరాణి అడవికి పారిపోయి ఒక మర్రి చెట్టు కింద బాధపడుతూ కూర్చుంది. ఆమె ఆవేదనతో చలించి పోయిన పార్వతీ దేవి ఆ యువరాణి ముందు ప్రత్యక్ష అవుతుంది. అట్ల తద్ది వ్రతం పాటించాలని యువరాణికి సూచిస్తుంది. తిరిగి రాజ భవనానికి వెళ్లి పార్వతీ దేవి చెప్పినట్లుగా అట్లతద్ది వ్రతాన్ని ఆచరిస్తుంది. ఆ తర్వాత తను కలలు కన్న వ్యక్తితో వివాహం జరుగుతుంది.



Click it and Unblock the Notifications
