Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ధనత్రయోదశి రోజున ధన్వంతరిని ఎందుకు పూజిస్తారో తెలుసా?
ధన్వంతరిని దేవతల వైద్యుడిగా పరిగణిస్తారు. ఆయన క్షీరసాగర మధనం నుండి ఉద్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. విష్ణు అంశ ద్వార పుట్టినవాడని, ఆయుర్వేద జ్ఞానం కలవాడు, మహనీయుడని దేవతలు గ్రహించి ఆయనకు ధన్వంతరి అనే పేరు పెడతారు.
దీపావళికి ముందు వచ్చే ధంతేరాస్ ను ధనత్రయోదశి అని ధన్వంతరి త్రయోదశి అని అంటారు. మొత్తం నాలుగు రోజుల పాటు జరిగే దీపావళి పండగ ధంతేరాస్ తో మొదలవుతాయి. ఆయుర్వేద గురువు మరియు ఆయుర్వేద పితామహుడు ధన్వంతరి భగవంతుని జయంతిగా ఈ రోజు జరుపుకుంటారు. ధన్వంతరి భగవంతుని ఆరాధననే ధంతేరాస్ అంటారు. హిందూ పురాణాల ప్రకారం, ధన్వంతరి భగవంతుడు క్షీరసాగర మథనం సమయంలో ఉద్భవించాడు. ఒక చేతిలో అమృతం (మకరందం) యొక్క కలశం, మరొక చేతిలో ఆయుర్వేదం గురించిన పవిత్ర గ్రంథాన్ని పట్టుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి.

ధన్వంతరిని దేవతల వైద్యుడిగా పరిగణిస్తారు. సాగర మథనం అనేది భాగవత పురాణంలో, మహాభారతంలో మరియు విష్ణు పురాణంలో వివరించబడింది. ఈ క్షీరసాగర మథనం నుండే అమృతం పుట్టిందని.. దానిని సేవించాకే దేవుళ్లు అమరులు అయ్యారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే, ఈ రోజున ప్రజలు ధన్వంతరిని పూజిస్తారు. మంచి ఆరోగ్యం మరియు శరీర సౌష్టవం కోసం ప్రార్థిస్తారు.
ధనత్రయోదశి సందర్భంలో సంపద మరియు శ్రేయస్సుకు సంబంధించినది. లక్ష్మీ-కుబేర్ పూజకు ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున ప్రజలు భౌతిక సంపద మరియు శ్రేయస్సు కోసం కుబేరుడుతో పాటు లక్ష్మీ దేవిని పూజిస్తారు. ప్రపంచంలోని సంపదలకు కోశాధికారిగా పరిగణించబడే కుబేరుడు, సంపదకు దేవత అయిన శ్రీ లక్ష్మితో పాటు పూజించబడతాడు.

భాగవత గాధ
భాగవతంలోని అష్టమ స్కంధంలో క్షీరసాగర మధనం గురించి చెప్పబడింది. క్షీరసాగర సమయంలో మొదట హాలాహలం ఉద్భవిస్తుంది. దానిని మహా శివుడు సేవించి కంఠంలో దాస్తాడు. అందుకే పరమేశ్వరుడిని నీలకంఠేశ్వరుడిగా పిలుస్తారు. తర్వాత క్షీరసాగర మధనం లో కామధేనువు, ఉఛ్చైశ్రవం, ఐరావతం, పారిజాతం, అప్సరసలు అవతరిస్తారు. అనంతరం రమాదేవి అవతరించి విష్ణువు వక్షస్థలాన్ని అలంకరిస్తుంది.
సాగర గర్భం నుండి ఒక పురుషుడు పీనాయుత బాహు దండాలను, కంబుకంఠాన్ని, పద్మారుణ లోచనాలను, విశాల వక్ష స్థలాన్ని, సుస్నిగ్ద కేషజాలాన్ని, నీల గాత్ర తేజాన్ని, పీతాంబరం కట్టి, మణికుండలాలు ధరించి, పుష్పమాలా సమలంకృతుడై, హస్తతలాన అమృత కలశంతో ఆవిర్భవిస్తాడు. ఆయన విష్ణు అంశ ద్వార పుట్టినవాడని, యజ్ఞభాగ భోజనుడు, ఆయుర్వేద జ్ఞానం కలవాడు, మహనీయుడని దేవతలు గ్రహించి ఆయనకు ధన్వంతరి అనే పేరు పెడతారు.

ఆయుర్వేద శాస్త్రం ఎన్ని భాగాలంటే..
1. కాయ చికిత్స
2. బాల చికిత్స
3. భూత వైద్యం
4. శలాక్యతంత్ర
5. శల్యతంత్ర
6. విషతంత్ర
7. రసాయన తంత్ర
8. వశీకరణ తంత్ర

కేరళ అష్టవైద్యం
కేరళలో సిద్ధ, ఆయుర్వేద వైద్య విధానంలో అష్టవైద్యం అనే విధానం చాలా ప్రసిద్ధి చెందింది. శతాబ్దాలు గడుస్తున్నా.. పెద్దగా మార్పులు లేకుండా పాత పురాతన పద్ధతిలోనే వైద్యం చేస్తున్నారు. ఇలాంటి వైద్యం చేసే కుటుంబాలు ధన్వంతరిని పూజిస్తాయి. కేరళలోని అలయిత్తూర్, కుట్టంచేరి, తైక్కాడ్, వయస్కార, వెల్లోడ్, చిరత్తమన్ లలో అష్టవైద్య విధానాన్ని అనుసరించే కుటుంబాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

ధన్వంతరి మంత్రం
ఓ నమో భగవతే వాసుదేవాయి
ధన్వంతరయే అమృతకలశ హస్తాయ
వజ్రజలౌక హస్తాయ సర్వామయవినాశనాయ
త్రైలోక్య నాథాయ శ్రీ మహా విష్ణవే నమః



Click it and Unblock the Notifications