Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చాణక్యుడి ప్రకారం డబ్బు ఎవరి వద్ద నిలుస్తుందంటే..!
వందల ఏళ్లు గడిచినా చాణక్య నీతులు ఇప్పటికీ అలాగే పాపులారిటీని నిలబెట్టుకున్నాయ్. పూర్వం రాజు చంద్రగుప్తుడి రాజ్యంలో రాజులకు, మంత్రులకు సలహాదారుడిగా ఉన్న చాణక్యుడు చరిత్రలో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు. చాణక్య నీతులు మనిషిని ఉన్నతంగా, లక్ష్యం వైపు విజయం వైపు తీసుకువెళ్తాయని ఎందరో విజేతలు ఇప్పటికీ చెబుతుంటారు.

జీవితంలో డబ్బు చాలా ముఖ్యమైంది. పురాణాల్లో రాజరిక కాలంలో డబ్బును భాగ్యలక్ష్మితో, లక్ష్మీ దేవితో పోలుస్తారు. ఎవ్వరివద్దైనా డబ్బు ఉంది అంటే వారి ఇంట్లో భాగ్యలక్ష్మి ఉన్నట్లు భావించేవారు. చాణక్య నీతిలో భాగ్యలక్ష్మి ఎవరి వద్ద నిలుస్తుంది. ఎవ్వరికి ఆమె ఆశిస్సులుంటాయో చాణక్యుడు స్పష్టంగా చెప్పాడు. డబ్బు విషయంలో చాణక్యుడు ఏమి చెప్పాడో తెలుసుకుందాం.
చాణక్య నీతి ప్రకారం మనిషి ఎప్పుడంటే అప్పుడు నిద్రకు ఉపక్రమించకూడదు. ఒక సరైన పద్ధతిలోనే నిద్రపోవాలి. సూర్యోదయం తరువాత లేదా సూర్యాస్తమయం సమయంలో నిద్రించవద్దని చాణక్యుడు చెబుతాడు. అలా ఉదయం నిద్రిస్తే వారి వద్ద జీవితాంతం డబ్బు ఉండదని వారికి ఇతరులు సహాయం కూడా చేయవద్దంటాడు.
చాణక్యుడి ప్రకారం దంతాలు శుభ్రంగా ఉంచుకోని వ్యక్తి వద్దకు కూడా భాగ్యలక్షి రాదని అంటాడు. వారు ఎల్లప్పుడు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారంటాడు. కాబట్టి శరీరాన్ని ఎప్పటికీ శుభ్రంగా ఉంచుకోవాలంటాడు.
కొంతమంది అవసరమైనదానికంటే కూడా ఎక్కువగా తింటుంటారు. అలాంటి వారివద్ద కూడా డబ్బు ఉండదంటాడు. ఎక్కువగా తినడానికి అనవసరంగా ఎక్కువ ఖర్చు చేసి డబ్బును వృధా చేస్తారంటాడు. చాణక్యుడి ప్రకారం ఎంత ఆకలి ఉందో అంతే తినాలి, ఎంత అవసరం ఉందో అంత మాత్రమే ఖర్చు చేయాలి.
కోపం, గంభీరం, కఠినంగా ఉండే వ్యక్తి వద్ద డబ్బు ఉండదని చాణక్యుడు చెబుతాడు. వారికి డబ్బు ఆదా చేయడం కూడా తెలియదంటాడు. మధురమైన భాషలో మాట్లాడేవారి వద్దకు భాగ్యలక్ష్మి వెళ్తుందని వారింట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయంటాడు.
ఎవ్వరైతే తమ ఇంట్లో అతిథులను అగౌరవపరుస్తారో వారి ఇంట్లో కూడా భాగ్యలక్షి నిలవదని అంటాడు చాణక్యుడు. వారికి జీవితాంతం డబ్బు, గౌరవమర్యాదలు లేకుండాపోతాయంటాడు.
చెడు మార్గాల ద్వారా డబ్బు సంపాదించినా లేదా అక్రమాలకు పాల్పడినా అలాంటి వారి వద్ద డబ్బు పదేళ్లవరకే ఉంటుంది. తరువాత పదకొండవ ఏట నుంచి ఆ డబ్బు దూరమవడం ప్రారంభమవుతుందని చాణక్య నీతి చెబుతుంది.
డబ్బు పై వ్యామోహం పెంచుకోవద్దని చాణక్యుడు అంటాడు. ఎందుకంటే డబ్బు మరింత సంపాదించాలనే వ్యామోహంతో గర్వం పెరుగుతుంది. దాంతో పాటు అహంకారం కూడా పెరుగుతుందంటాడు. సంపదపై అహంకారం ఉండే వ్యక్తుల వద్ద డబ్బు ఎక్కువ కాలం ఉండదని చాణక్య నీతి చెబుతుంది.



Click it and Unblock the Notifications