Latest Updates
-
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
మధ్యాహ్నం 12 లేదా 2 గంటలకే చెక్ ఇన్..హోటల్స్ ఫాలో అయ్యే రూల్ వెనుక అసలు కథ!
సాధారణంగా మనం ఎక్కడికైనా ట్రిప్ కో లేదా పని మీద మరో ఊరు వెళ్లినప్పుడు అక్కడ ఉండాల్సి వస్తే హోటల్ లో రూమ్ తీసుకొని ఉంటాం. అయితే చాలాసార్లు మీరు హోటల్ రూమ్ కోసం వెళ్లినప్పుడు చెక్ ఇన్ టైం ఇంకా కాలేదు, 12 గంటలకు లేదా 2 గంటలకి చెక్ ఇన్ టైం అని హోటల్ సిబ్బంది చెప్పడం చాలామంది ఎదుర్కొన్న అనుభవమే.

అలసిపోయి హోటల్ కు చేరుకోగానే..సారీ సార్,కాసేపు లాబీలో వెయిట్ చేయండి అనే మాట వినడం ఎవరికైనా అసహనం తెప్పిస్తుంది. చాలా హోటళ్లలో చెక్ ఇన్ సమయం మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు మాత్రమే ఎందుకు ఉంటుంది? దీని వెనుక ఉన్న అసలు లాజిక్ ఏంటో ఇక్కడ చూడండి.
పరిశుభ్రతకే తొలి ప్రాధాన్యం
మధ్యాహ్నం చెక్ ఇన్ వెనుక ఉన్న అతిపెద్ద కారణం గదుల నిర్వహణ. సాధారణంగా ఏ హోటల్ లోనైనా చెక్ అవుట్ సమయం ఉదయం 10 నుండి 12 గంటల మధ్య ఉంటుంది. పాత అతిథులు ఖాళీ చేసిన తర్వాత ఆ గదిని కొత్త వారికోసం సిద్ధం చేయడానికి సిబ్బందికి కనీసం రెండు గంటల సమయం పడుతుంది. హౌస్ కీపింగ్ సిబ్బంది బెడ్ షీట్లు మార్చడం, బాత్రూమ్ లను క్లీన్ చేయడం, వాక్యూమ్ చేయడం, టవల్స్, సోప్ లు, వాటర్ బాటిల్స్ వంటివి తిరిగి అమర్చడం లాంటి పనులు చేస్తారు. మీరు చెక్ ఇన్ అయ్యేసరికి గదిని నూటికి నూరు శాతం పరిశుభ్రంగా ఉంచడానికే ఈ సమయం తీసుకుంటారు.
గందరగోళం లేని సేవలు
ఒకవేళ అతిథులు ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ పోతూ ఉంటే హోటల్ సిబ్బందికి ఏ గది ఖాళీగా ఉందో, ఏది రెడీ అవుతోందో తెలుసుకోవడం కష్టమవుతుంది. నిర్దిష్ట సమయాల వల్ల ఫ్రంట్ డెస్క్, హౌస్ కీపింగ్ బృందాలు తమ పనిని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోగలుగుతారు. అంతేకాకుండా మధ్యాహ్నానికి ఏయే గదులు ఖాళీ అయ్యాయో సిస్టమ్ లో స్పష్టమైన అప్ డేట్ వస్తుంది. దీనివల్ల ఒకే గదిని పొరపాటున ఇద్దరికి కేటాయించడం లాంటి తప్పులను సులభంగా నివారించవచ్చు.
ఇది ప్రపంచవ్యాప్త నియమం
మధ్యాహ్నం 12-2 గంటల చెక్ ఇన్ విధానం కేవలం మన దేశానికే పరిమితం కాదు. అమెరికా, యూరప్.. ఇలా మీరు ఎక్కడికి వెళ్లినా ఇదే గ్లోబల్ స్టాండర్డ్ కనిపిస్తుంది. ఈ ప్రామాణికత వల్ల అంతర్జాతీయ ప్రయాణికులు సైతం తమ ప్రయాణాలను ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సులభంగా ప్లాన్ చేసుకోగలుగుతారు.
ఎర్లీ చెక్ ఇన్ పొందడం ఎలా?
మరి మీరు అనుకున్న సమయం కంటే ముందే హోటల్ కు చేరుకుంటే..రూమ్స్ ఖాళీగా ఉంటే ముందుగానే చెక్ ఇన్ అయ్యే అవకాశం కచ్చితంగా ఉంటుంది. కొన్ని హోటళ్లు ఈ సదుపాయాన్ని ఉచితంగానే అందిస్తే, మరికొన్ని అదనపు ఛార్జీలు వసూలు చేస్తాయి. కాబట్టి గంటల తరబడి ఎదురుచూడకుండా ఉండాలంటే.. హోటల్ బుక్ చేసుకునే సమయంలోనే ఎర్లీ చెక్ ఇన్ కోసం రిక్వెస్ట్ పెట్టుకోవడం బెటర్.



Click it and Unblock the Notifications