Latest Updates
-
చపాతీలో ఫేవరెట్ పనీర్ మెంతి కర్రీ.. రెస్టారెంట్ స్టైల్లో ఇలా అదరగొట్టేయండి.! -
ఒకసారి స్టెంట్ వేశాక మరోసారి గుండెపోటు వస్తుందా.. చేదు నిజాలివే.! -
నోరూరించే కాజు చికెన్ పకోడీ.. ఇలా చేస్తే ఎంత తిన్నా తృప్తి తీరదు! -
ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కోసం భార్యాభర్తలు ఎలా కలవాలి.? -
తల్లిపాల వారోత్సవాలు.. బిడ్డే కాదు బాలింత కోసం కుటుంబీకులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా.. ఈ వడను తిన్నారంటే మినప గారెలను మరిచిపోతారు.! -
బుధాదిత్య యోగం.. ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం ఇంటి ముంగిటే.! -
గంటల తరబడి ఫ్రిజ్‌లో పెట్టాల్సిన పనిలేదు.. అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టంట్ ఫిష్ ఫ్రై.! -
రెస్టారెంట్ స్టైల్ తవా చికెన్..వేళ్లు నాకుతూ తినడం గ్యారెంటీ..ఈజీగా చేసుకోండిలా.. -
35 ఏళ్లకే కోరికలు తగ్గిపోయాయా.. దాంపత్య సుఖం కోసం తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన టిప్స్.!
వధువుల కొరకు ఎక్స్ టార్డినరీ గోల్డెన్ కలర్ అవుట్ ఫిట్ !
వధువులకు గోల్డ్ కలర్ ఎల్లప్పుడు ఒక న్యూట్రెండ్ ను సెట్ చేస్తుంది. మన భారత దేశంలో చాలావరకూ ఇలాంటి గోల్డ్ కలర్ అవుట్ ఫిట్స్ ను ఎక్కుంగా పెళ్ళిళ్లకు వాడుతుంటారు. ఇది ఒక సాంప్రదాయమైన దుస్తులుగా భావిస్తుంటారు. సాధారణంగా మన భారత దేశంలో పెళ్ళిళ్ళకు పెళ్ళికుమార్తెలు, ఆరెంజ్, రెడ్, పింక్, గ్రీన్, వైట్ వంటి కలర్స్ తో కాంబినేషన్ గా గోల్డ్ కలర్ ను విరివిగా ఉపయోగిస్తుంటారు . పెళ్ళికుమార్తెల దుస్తుల్లో గోల్డ్ కాంబినేష్ ఉంటుంది, కానీ పూర్తిగా గోల్డ్ కలర్ దుస్తులు చాలా అరుదు. అయితే ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ షో లో ఒక వధువు పూర్తి గోల్డెన్ కలర్ దుస్తులు ధరిస్తే ఎలా ఉంటుందో, మనం మన మోడల్స్ ల ర్యాంప్ ప్రదర్శనలు చూస్తే అర్ధం అవుతుంది.
ఆమ్బే వ్యాలీ ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013 లో ఇటువంటి గోల్డ్ కలర్స్ దుస్తులు మనకు చాలా రకాలుగా సర్ ఫ్రైజ్ చేశాయి. ఇండియ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ డే 4లో ఇటుంటి కలర్ కాంబినేషన్ లో లెహంగా, శారీలను మనం చూడవచ్చు . మరి మీరు ఇటువంటి టేస్ట్ కలిగి ఉండి, ఈ గోల్డెన్ అవుట్ ఫిట్స్ ఎంపిక చేసుకోవాలంటే ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013, డే 4 కలెక్షన్స్ ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అవుతాయి. గోల్డె కలర్స్ వధువు దుస్తులు ట్రెండింగ్ గా ఉంటాయి.
రెండు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు రోహిత్ బాల్ మరియు అషిమా మరియు లీనా తమ కలెక్షన్స్ ను డే 4న ప్రదర్శనలో ఉంచారు. అషిమా మరియు లీనా కలెక్షన్స్ కు ‘ఆలాప్' అనే పేరుతో లెహంగాలు మరియు చీరలకు ఒక పరిపూర్ణ ఐశ్వర్యం జరిగింది. రోహిత్ బాల్ యొక్క కలెక్షన్స్ కూడా కొన్ని బంగారు కలర్ గోల్డెన్ శారీస్ ఉన్నాయి..
కాబట్టి న్యూట్రెండ్ కు తగ్గట్టు వధువులకు ఇష్టమయ్యే లేదా ఎంపిక చేసుకోగలిగేటువుంటి కొన్ని గోల్డెన్ కలర్ అవుట్ ఫుట్ డిజైన్ కలెక్షన్ ఇక్కడ మీకోసం కొన్ని...

గోల్డెన్ లెహంగా శారీ:
వధువుకు తలనుండి , కాలి వేళ్ళవరకూ ఒకే రంగులో డిజైన్ చేసిన గోల్డెన్ అవుట్ ఫిట. ఈ శారీమీద సిల్వర్ గోల్డ్ స్ట్రిప్ అక్కడక్కడా చాలా అద్భుతంగా నప్పింది. శారీకి తగ్గట్టుగానే స్లీవ్ లెస్ గోల్డెన్ బ్లౌజ్ బాగా నప్పింది.

గోల్డెన్ లెహంగా:
ఈ బంగారువర్ణపు లెహంగా చాలా ప్రకాశవంతంగా, చూడటానికి ఇంపుగా కొత్త ట్రెండ్ కు తగ్గట్టు ఉంది. ఈ లెహంగా మీదకు ఫుల్ స్లీవ్ చోలి పొడవుగా, దానిమీద షీర్ గోల్డెన్ ఫ్రిల్స్, అద్భుతంగా ఉంది.

బ్రోకేడ్ బార్డర్ తో గోల్డెన్ లెహంగా:
లెహంగా మరియు చోలీ రెండూ కూడా సాలిడ్ గోల్డ్ కలర్ లో అద్భుతంగా ఉంది. కాంట్రాస్ట్ కలర్ ఆరెంజ్ బ్రోకెడ్ బార్డర్ లెహంగా చాలా అద్భుతంగా ఉండి.

గోల్డెన్ అనార్కలి సూట్:
ఈ ఫ్లవర్ డిజైన్ కలిగిన అనార్కలీ మరియు చుడీదార్, ఫ్రీ వెడ్డింగ్ అకేషన్స్ కు ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఇటువంటి డ్రెస్సులను పెళ్ళికి ముందు సంగీత్ లేదా మెహిందీ కార్యక్రమాలను ధరించవచ్చు.

పౌడర్ గోల్డ్ శారీ:
నిజానికి ఈ శారీలో మూడు కలర్స్ ఉన్నాయి, గోల్డ్, మాస్ గ్రీన్ మరియు బ్రోజ్. అయితే ఎఫెక్ట్ మాత్రం పూర్తి శారీని చూస్తుంటే పౌడర్డ్ గోల్డ్ కలర్ లో సొగసుగా ఉంది.

గోల్డెన్ డ్రాప్:
పూర్తిగా గోల్డెన్ కలర్ కాకుండా గోల్డ్ కలర్ డ్రాప్ అవుట్ ఫిట్ చాలా అద్భుతంగా ఉంది. గోల్డెన్ కలర్ ఇష్టపడే వాళ్ళు ఇలా కూడా డిజైన్ చేసుకోవచ్చు.

గోల్డెన్ లెహంగా మీదకు షీర్ లేస్ బార్డర్:
మీరు మరింత గ్రాండ్ గా లెహంగాను అలంకరించాలనుకుంటున్నారా?పూర్తి షీర్ లేస్ బార్డర్ క్లాసీగా ఉంది.

ముస్లీం వధువులకు:
ట్రెడిషనల్ వాలీమా ఉన్నవారు. ఇటువంటి కాఫ్తాన్ స్టైల్ కుర్తా, దాని మీదకు వదులుగా ఉండే పైజామా ధరించవచ్చు . దానిమీదకు కాంట్రాస్ట్ కలర్ రెడ్ లేదా ఆరెంజ్ కలర్ దోవతీలను ఎంపిక చేసుకోవచ్చు.

గోల్డెన్ నవ్వారి:
మరాఠీ వధువుల కొరకు, మరాఠీ ముల్గీను కూడా గోల్డ్ కలర్ తో ప్రయత్నించవచ్చు. ఈ షీర్ గోల్డెన్ శారీ, మీదకు సాలిడ్ గోల్డ్ స్ట్రిప్స్, ఫుల్ స్లీవ్ బ్లౌజ్ ట్రెడిషినల్ గా ఉంది.

గోల్డెన్ శారీ విత్ అనార్కలీ బ్లౌజ్:
పెళ్ళి కళను ఎత్తికనబడేలా చేసే ప్రయత్నం, బ్లౌజ్ డిజైన్స్. ఇటువంటి అనార్కలీ స్టైల్ బ్లౌజ్ ను వధువులకు ప్రత్యేకంగా ప్రయత్నించవచ్చు.

గోల్డెన్ చనియా చోలీ:
ఇది ప్రోటో టైప్ చనియా చోలి. ఇది పొడవాటి షీర్ గోల్డెన్ వెడల్పాటి లెహంగా ఇది పూర్తి గోల్డ్ కలర్ లో ఉంది.

గోల్డెన్ అండ్ వైట్:
కొన్ని సందర్భాల్లో గోల్డ్ మరియు వైట్ చాలా అద్భుతమైన కాంబినేషన్ గా ఉంది . గోల్డెన్ ఎంబ్రాయిడరీ వైట్ మీదకు చాలా ఫర్ ఫెక్ట్ మ్యాచ్ అవుట్ ఫిట్ గా కనిపిస్తోంది . ఈ స్టైలిష్ లెహంగా చోలీ రోహిత్ బాల్ డిజైన్ చేసిన దుస్తులు.

గోల్డెన్ శారీ విత్ మల్టికలర్ ఎంబ్రాయిడరీ:
ఈ షీర్ గోల్డెన్ శారీ మీదకు, వివిధ రంగుల్లో ఎంబ్రాయిడరీ శారీ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్స్ కు ఫర్ ఫెక్ట్ మ్యాచ్.

టెక్చర్డ్ గోల్డెన్ శారీ:
పెళ్ళి తర్వాత ఎటువంటి దుస్తులు ఇష్టపడుతారు ? చాలా వరకూ ట్రెడిషనల్ వాటి ప్రాధాన్యత ఇస్తారు. అవి చాలా గ్రాండ్ గా ఉండాలి. కానీ సాదాగా ఉండకూడదు. ఇటువంటి గోల్డన్ వైట్ శారీ మీదకు బ్రౌన్ బార్డర్ అద్భుతంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications