Latest Updates
-
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి!
మన జీవితాన్ని మార్చే మన జీవన శైలి
మన దైనందిన జీవితంలో, ఒక అందమైన యువకుడు లూజు ప్యాంటు, లూజు షర్టు ధరించి నలుగురి దృష్టిని ఆకర్షించలేడు, ఇంప్రెస్ చేయలేడు. కానీ టైట్ జీన్స్, టి షర్ట్ ధరించి కొంచెం రఫ్ గా ఉండే ఒక వ్యక్తి నలుగురి దృష్టిని ఆకర్షించగలడు. ఇది ఒక స్కూల్ లేదా కాలేజ్ కాంపస్ కు సంబంధించిన విషయం మాత్రమే కాదు, నిజ జీవితంలో మనం నిత్యం ఇది గమనిస్తూంటాం. ఇలా మనల్ని మనం ప్రదర్శించుకునే తీరు కూడా మన జీవితం ఫై ప్రభావం చూపుతుంది.
1. సరైన దుస్తులు: మన డ్రెస్సింగ్ కూడా మన వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తుంది. మనం ఎంత ఖరీదైన దుస్తులు ధరించామన్నది కాదు ముఖ్యం. మన శరీరాకృతికి తగిన, సరైన కొలతలు ఉన్న దుస్తులు ధరించే మన విధానం కూడా మనపట్ల ఇతరులు ప్రతిస్పందించే తీరును ప్రభావితం చేస్తుంది.
2. శరీర శుభ్రత, ఆకర్షణీయత: మన డ్రెస్సింగ్ మాత్రమే కాక శరీర శుభ్రత కూడా మన వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తుంది. శరీర శుభ్రత అంటే స్నానం చేసి శుభ్రంగా ఉండడమే కాదు, హెయిర్ డ్రెస్సింగ్, నైలింగ్ (గోళ్ళు తియ్యడం) వంటి చిన్న విషయాలలో కూడా జాగ్రత్త వహించాలి. ఈ విధమైన శుభ్రత ఆకర్షణీయతకు కారణమై, ఇతరులు మనపట్ల అటెన్షన్ గా ఉండడానికి దోహదపడుతుంది.

3. బాడీ ఫిట్ నెస్: ఇపుడు స్టైల్ అనేది ఫేషన్ పరిధిని దాటి ఫిట్ నెస్ జోన్ లోకి కూడా ఎంటర్ అయింది. మన శరీరం ఫిట్ గా ఉండడం కోసం ప్రతిరోజూ ఒక అరగంట వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. ఈ అరగంట వ్యాయామం బాడీ ను ఫిట్ గా ఉంచడమే గాక మన మనసును ఫీల్ గుడ్ భావన లో ఉంచి, మన అంతర్గత సంతోషానికి కారణమై, ఇతరులతో మన ప్రవర్తన మంచిగా ఉండేట్టుగా ప్రభావితం చేస్తుంది.
4. వాడే వస్తువులు (Accessories): మన అభిరుచిని తెలియపరిచే పెన్, Spects లేదా సన్ గ్లాసెస్, వాచ్ ధారణ కూడా మన వ్యక్తిత్వానికి అదనపు ఆభరణమౌతుంది. ఇలా మనల్ని మనం ప్రదర్శించుకునే తీరు, వ్యక్తీకరించుకునే విధానం మన ఉన్నత స్థితికి కారణమౌతుంది.



Click it and Unblock the Notifications
