Latest Updates
-
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.?
భారతీయ సినిమా శతవసంతాల వేడుకలో మన స్టార్స్
దక్షిణ భారతీయ భాషా సినీ పరిశ్రమలకు పురుటిగడ్డ అయిన చెన్నై నగరంలో నూరు వసంతాల భారతీయ సినిమా ఉత్సవాలు శనివారం నాడు సాయంత్రం అట్టహాసంగా మొదలయ్యాయి. దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి (ఎస్.ఐ.ఎఫ్.సి.సి), తమిళనాడు ప్రభుత్వం కలసి నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియమ్‌లో తమిళనాడు ముఖ్యమంత్రి - మాజీ సినీ నటి జయలలిత లాంఛనంగా ప్రారంభించారు.
భారతీయ సినిమా శత వసంతాల వేడుక శనివారం ప్రారంభమై మొదటి రోజు నుండి తమిళ, కన్నడ, తెలుగు సినీరంగాలకు సంబంధించిన వేడుకలు ఇప్పటికే పూర్తిఅయ్యాయి. అయితే ఈ కార్యక్రమానికి స్టార్ సెలబ్రెటీలు ఎవ్వరూ హాజరు కాలేదు. మరియు తెలుగు సినీ దిగ్గజాలైన కొందరు అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణ రావు, కృష్ణ సైతం హాజరు కాలేదు.
అయితే డాడి మామానాయుడు, కోటాశీనివాసరావు, బాలకృష్ణ, వెంకటేష్, రాజేంద్రప్రసాద్, రాజశేఖర్, అల్లు అరవింద్, బ్రహ్మానందం, మంచు లక్ష్మీ, త్రిష, జయసుధ, జయప్రద, రాధ, తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రామానికి హాజరైన మన సినీ ప్రముఖులకు సన్మానం చేశారు. మరి ఈ కార్యక్రమానికి హాజరైన మన సెలబ్రెటీల మీద ఓ లుక్కేయండి....

త్రిష:
భారతీయ సినిమా శత వసంతాల వేడుక హాజరైనారు. బ్లూకలర్ నెట్టెడ్ హాఫ్ శారీ, బ్రౌన్ కలర్ మోడ్రన్ బ్లౌజ్ లో చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపించారు.

కార్తిక:
రాధ కుమార్తె కార్తిక ఇటు తెలుగు, తమిళ సినిమాల్లో నటిగా చేసింది. ఈమె భారతీయ సినిమా శత వసంతాల వేడుక హాజరైంది. కార్తీక ఓ కాటన్ ఎబ్రాయిడరీ వర్క్ శారీ ధరించి రెడ్ కలర్ నెయిల్ పాలిష్ ఆకర్షణీయమై యాస్ససెరీస్ అద్భుతంగా నప్పాయి.

మంచు లక్ష్మీ:
మంచు లక్ష్మీ స్టైల్ కి పెట్టింది పేరు, ఏకార్యక్రమానికి హాజరైన ఏదో ఒక కొత్త స్టైల్ కనపించడం ఆమె ప్రత్యేకత. భారతీయ సినిమా శత వసంతాల వేడుక హాజరై మంచు లక్ష్మి, సిల్వర్ కలర్ విత్ గ్రే మిక్స్ శారీలో చాలా క్యూట్ గా కనిపించారు.

రోజా:
భారతీయ సినిమా శత వసంతాల వేడుకలో సాయి కుమార్ తో పాటు రోజా యాంకరింగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకొన్నది. రోజా ఎప్పటిలాగే ఫుల్ మేప్ తో క్రీమ్ అండ్ లైట్ గ్రీన్ లైట్ స్కైబ్లూ కలర్ శారీలో మెరిసింది.

మీన:
మీన ఒకప్పటి స్టార్ హీరోయిన్, మన ధక్షిణాది స్టార్ హీరోలతో నటించిన నటి భారతీయ సినిమా శత వసంతాల వేడుక హాజరై, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చేతుల మీదుగా అవార్డును అందుకొన్నారు. క్రీమ్ కలర్ గోల్డన్ కలర్ శారీ అద్భుతంగా ఉంది.

సుహాసిని:
అలనాటి అందాల తార సుహాసిని, ఎప్పటిలో ముఖంలో చిరునవ్వుతో కనిపించాలరు. సింపుల్ గా కేరళ స్టైల్లో కేరళ శారీ వైట్ అండ్ గోల్డ్ బార్డర్ శారీలో వచ్చారు. శారీకి అద్భుతంగా నప్పే యాక్ససెరీస్ మెడలో ముత్యాల దండ మోడ్రన్ గా కనిపించిది.

రాధ-సిమ్రాన్:
అలనాటి స్టార్ హీరోయిన్ రాధ, సిమ్రాన్ లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జయసుధ:
అలనాటి స్టార్ హీరోయిన్ జయసుధ భారతీయ సినిమా శత వసంతాల వేడుక హాజరైనారు.

జయప్రద:
అలనాటి స్టార్ హీరోయిన్ జయసుధ భారతీయ సినిమా శత వసంతాల వేడుక హాజరైనారు.

అర్చన:
నటి అర్చన ఈ కార్యక్రమంలో డాన్స్ తో అలరించారు. వైట్ కలర్ ఆఫ్ శారీ పింక్ బార్డర్ తో చాలా అందంగా కనిపించారు.

బాలకృష్ణ:
బాలకృష్ణ ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా కనిపించారు. అవార్డ్ అందుకొని అభిమానులకు అభివాదం చేశారు. బాలకృష్ణ బ్లాక్ కలర్ సూట్ లో సింపుల్ గా ఉన్నారు.

వెంకటేష్:
వెంకటేష్ బ్లూ కలర్ జీన్స్ మీదకు, పింక్ కలర్ షర్ట్, మోడ్రన్ ఐ గ్లాస్, చేతిలో వాచీతో స్టేజ్ మీద ఆకర్షణీయంగా కనబడ్డారు.

రాజేంద్రప్రసాద్:
భారతీయ సినిమా శత వసంతాల వేడుక హాజరైన ఒకప్పటి స్టార్ హీరో రాజేంద్రప్రసాద్.

రాజశేఖర్:
భారతీయ సినిమా శత వసంతాల వేడుక హాజరై అవార్డును అందుకొన్నారు.

అల్లు అరవింద్:
అల్లు అరవింద్ భారతీయ సినిమా శత వసంతాల వేడుక హాజరై, సి కళ్యాణ్ చేతుల మీదుగా అవార్డును అందుకొన్నారు.

బ్రహ్మానందం:
బ్రహ్మానందం ఎప్పటిలాగే భారతీయ సినిమా శత వసంతాల వేడుకలో చాలా ఉత్సాహంగా కనిపించారు.



Click it and Unblock the Notifications
