Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
క్యాలెండర్ సేమ్, చరిత్ర కూడా సేమేనా? భయపెడుతున్న 1941-2025 పోలిక
హిస్టరీ రిపీట్ అవుతుందా?కాలచక్రం గిర్రున తిరిగి పాత రోజుల్నే మళ్లీ మన ముందు నిలుపుతుందా? ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక ప్రచారం చూస్తే ఇది నిజమేననిపిస్తుంది. 1941 నాటి ఒక పాత క్యాలెండర్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఆశ్చర్యకరంగా 2025 సంవత్సరం క్యాలెండర్ తో అది అచ్చుగుద్దినట్లు సరిపోలుతోంది. తేదీలు, రోజులు మాత్రమే కాదు ఆ సంవత్సరంలో జరిగిన భయానక సంఘటనలు కూడా ఈ ఏడాది రిపీట్ అవుతాయన్న వాదన ఇప్పుడు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది.
1941లో ఏం జరిగింది
1941వ సంవత్సరం ప్రపంచ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా నిలిచిపోయింది. ఎందుకంటే ఆ ఏడాదే రెండవ ప్రపంచ యుద్ధం ఉగ్రరూపం దాల్చి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. అదే ఏడాది జపాన్.. అమెరికాలోని పెర్ల్ హార్బర్ లోని నావికా స్థావరం పై సర్ ప్రైజ్ ఎటాక్ చేసి చేసి యుద్ధ తీవ్రతను పెంచింది. భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాల కారణంగా లక్షలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచం మొత్తం విషాదంలో మునిగిపోయింది.

2025లో కూడా అవే భయాలు,అవే సంకేతాలు
ఇప్పుడు 84 ఏళ్ల తర్వాత 2025లో కూడా అలాంటి పరిస్థితులే పునరావృతం అవుతాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దీనికి ఊతమిచ్చేలా కొన్ని సంఘటనలు, జోస్యాలు ప్రచారంలో ఉన్నాయి. మూడేళ్ల నుంచి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం,ఏడాదిపై నుంచి ఇజ్రాయెల్-గాజా మధ్య యుద్ధాలు కొనసాగుతుండగా మరోవైపు చైనా-తైవాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. వీటికి తోడు ఇప్పుడు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం తప్పదని అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతానికి యుద్ధం ముగిసినట్లేనని తాజాగా ఇజ్రాయెల్ ప్రకటించినప్పటికీ ఏ క్షణమైనా ఏదైనా జరగొచ్చు అనే వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రకృతి ప్రకోపం
2025లో మయన్మార్ లో భారీ భూకంపం విధ్వంసం సృష్టిస్తుందని, అనేక దేశాలు వరదలు, కరువులతో అల్లాడిపోతాయని ప్రచారం జరుగుతోంది. 1941లో బిస్మార్క్ అనే యుద్ధనౌక మునిగిపోయి వేలాది మంది చనిపోయినట్లే 2025లో కూడా అలాంటి విషాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు.
నిపుణులు ఏమంటున్నారు?
అయితే చాలా మంది నిపుణులు ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు. ప్రతి కొన్ని సంవత్సరాలకు క్యాలెండర్లు పునరావృతం కావడం సాధారణమేనని ఇది కేవలం గణితపరమైన యాదృచ్చికమని నిపుణులు చెబుతున్నారు. దీనిని ప్రపంచ వినాశనానికి సంకేతంగా చూడాల్సిన అవసరం లేదంటున్నారు. కానీ మరికొంతమంది జ్యోతిష్య నిపుణులు మాత్రం దీనిని గ్రహాల కదలికలతో, రాబోయే విపత్తులకు ముందస్తు హెచ్చరికగా భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ 1941- 2025 క్యాలెండర్ ల మధ్య ఉన్న ఈ రహస్య సారూప్యత మాత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో ఉత్కంఠను, చెప్పలేని భయాన్ని రేకెత్తిస్తూనే ఉంది.



Click it and Unblock the Notifications