వృద్ధాప్యంలోనూ యవ్వనంగా కనిపించాలనే ఆరాటం.. బ్యూటీపార్లర్‌ నిర్వాకానికి టోటల్‌ ఫ్యామిలీ షాక్‌.!

వయసు పెరుగుతున్నా ఇంకా తాము అందంగా ఉండాలని, యంగ్‌గా కనిపించాలని మహిళలకి అనిపించడం చాలా సహజం. అందుకే ప్రపంచవ్యాప్తంగా బ్యూటీపార్లర్స్‌కి క్రేజ్‌ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. అయితే దేనికైనా కొన్ని పరిమితులు అనేవి ఉంటాయి. వాటిని దాటితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అందుకు ఉదాహరణే చైనాకి చెందిన ఈ వృద్ధురాలి అత్యాశ. 75 ఏళ్ల వయసులో యవ్వనంగా కనిపించాలనే ఆమె కోరిక.. మొత్తం కుటుంబాన్నే ఇరకాటంలో పడేసింది. ఏజ్‌కి మంచి యవ్వనాన్ని, అందాన్ని కాపాడుకోవాలనే వ్యామోహం తాలుకా ఫలితాలు ఎంత తీవ్రంగా ఉంటాయి ఈ ఘటన అద్దం పడుతుంది. అసలేం జరిగిందంటే..

75-year-old woman spends Rs 4 crore at a beauty salon viral in china

సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ వెల్లడించిన కథనం ప్రకారం చైనాకి చెందిన 75ఏళ్ల 'యు’ అనే మహిళ వయసు పెరుగుతున్నా అందంగా, యంగ్‌గా కనిపించేందుకు వింత సాహసం చేశారు. అందాన్ని కాపాడుకునేందుకు విపరీతంగా బ్యూటీ పార్లర్స్‌, ప్రొడక్ట్స్‌ను ఆశ్రయించారు. అది ఎంతలా అంటే ఫ్యామిలీ కోసం కూడబెట్టుకున్న రూ. 4 కోట్ల సొత్తును యవ్వనం కోసం ఖర్చు చేసేంతలా. ఆ వృద్ధురాలి బలహీనతని, అత్యాశని ఆసరా చేసుకుని బ్యూటీ పార్లర్‌ నిర్వాహకులు ఆమె నుంచి అందినకాడికి దోచుకున్నారు. మరి ఇంతా జరుగుతుంటే కుటుంబీకులు ఏం చేశారనే సందేహం రావచ్చు. ఆ మహిళ ఇంట్లో వాళ్లకి తెలియకుండా చేసిన ఈ పని ఫలితం అంతా పోగొట్టుకున్న తర్వాత కానీ వారి దృష్టికి చేరలేదు. చివరికి బిల్లులు చూసి ఖంగు తినడం కుటుంబీకుల వంతైంది. ఈ ఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కొవ్వు తక్కువ, పోషకాలు ఎక్కువ..థైరాయిడ్ పేషెంట్లకు మఖానా ఎందుకు బెస్ట్?

వృద్ధాప్యంలో మహిళ తన వ్యక్తిగత బాహ్య సౌందర్యం పట్ల ఎంతలా దృష్టి సారించారంటే.. పదవీ విరమణ మొత్తాన్ని బ్యూటీపార్లర్‌ నిర్వాహకులకు దోచిపెట్టారు. స్కిన్‌ టైట్‌నింగ్‌, థ్రెడ్‌ లిఫ్టింగ్‌, మసాజ్‌ ఇంకా ఎన్నో కాస్మెటిక్‌ ప్రక్రియల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేశారు. ఇలా దాదాపు పదేళ్లుగా అందం కోసం ఖర్చు పెడుతూనే ఉన్నారు. 'యు’ కుమార్తె ఇంట్లో బిల్లులు చూసేవరకు ఈ కుంభకోణం వెలుగులోకి రాలేదు.

75-year-old woman spends Rs 4 crore at a beauty salon viral in china

వృద్ధురాలి అత్యాశను, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న బ్యూటీ సెలూన్ నిర్వాహకులు.. బ్యూటీ ప్రొడక్ట్స్‌ సాధారణ మార్కెట్‌ ధరల కంటే దాదాపు 20 రెట్లు ఎక్కువగా వసూలు చేసినట్లు బిల్లింగ్‌ రికార్డుల ప్రకారం తేలినట్లు బాధితురాలి కుమార్తె తెలిపింది. కేవలం లిప్‌ టాటూ సెషన్‌కే మన ఇండియన్‌ కరెన్సీలో దాదాపు రూ. 6 లక్షలు వసూలు చేశారు. ఐ బ్రో టాటూయింగ్‌ లాంటి చిన్నపాటి చికిత్సల కోసం కూడా రూ. లక్షల్లో ఆమె నుంచి వసూలు చేశారు.

Viral Video: ఇన్ స్టాగ్రామ్ లో పరిచయంతో పెళ్లి..శోభనం రోజు చూస్తే అబ్బాయి!Viral Video: ఇన్ స్టాగ్రామ్ లో పరిచయంతో పెళ్లి..శోభనం రోజు చూస్తే అబ్బాయి!

బ్యూటీ సెలూన్‌ దగా పట్ల 'యు’ కుమార్తె షాంఘై ఒక టీవీ షో సహాయం కోరడంతో ఇది నెట్టింట్లో త్వరగా వ్యాపించింది. నిర్వాహకుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇలాంటి వారి నుంచి వయసు పైబడిన వారిని కాపాడుకునేందుకు చట్టాలు ఉండకూడదా అని ప్రశ్నించారు. మహిళల ఒంటరితనం వారిని ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఈ సంఘటన ఉదాహరణ అంటూ మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Story first published: Wednesday, September 16, 2026, 10:55 [IST]
Desktop Bottom Promotion