5 నిమిషాల్లో అద్భుతమైన బ్రేక్‌ ఫాస్ట్.. మీ పిల్లలు లొట్టలేసుకుంటూ తినే చీజ్ గార్లిక్ శాండ్‌ విచ్

Posted By:

తక్కువ సమయంలో రుచికరమైన, ఆరోగ్యకరమైన బ్రేక్‌ ఫాస్ట్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు మనకు వెంటనే గుర్తొచ్చే బెస్ట్ ఆప్షన్ శాండ్‌ విచ్. సాధారణంగా మన ఇళ్లలో వెజ్ శాండ్‌ విచ్, ఆలు టోస్ట్ లేదా నార్మల్ చీజ్ శాండ్‌ విచ్ చేస్తూ ఉంటాం. కానీ ఒకసారి చీజ్ గార్లిక్ ఆనియన్ శాండ్‌ విచ్ ట్రై చేసి చూడండి.

వేడి వేడి బ్రెడ్ మీద కరుగుతున్న చీజ్, దానికి తోడుగా వెల్లుల్లి, ఉల్లిపాయల ఘుమఘుమలు.. ఇవన్నీ కలిస్తే వచ్చే రుచిని మాటల్లో చెప్పలేం. చీజ్ గార్లిక్ ఆనియన్ శాండ్‌ విచ్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Busy Mornings Make This Quick Cheesy Garlic Onion Sandwich in Just 5 Mins Recipe in Telugu

కావలసిన పదార్థాలు

బ్రెడ్ స్లైసెస్- తగినన్ని
తురిమిన చీజ్ లేదా చీజ్ స్లైసెస్ - 1 కప్పు
బట్టర్ (వెన్న) - 3 టేబుల్ స్పూన్లు
సన్నగా తరిగిన వెల్లుల్లి - 2 టీస్పూన్లు
మిరియాల పొడి - అర టీస్పూన్
చిల్లీ ఫ్లేక్స్ - 1 టీస్పూన్
ఉల్లిపాయ - 1
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - కొద్దిగా
ఉల్లికాడలు (స్ప్రింగ్ ఆనియన్స్) - కొద్దిగా

బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌ గా.. ఇంట్లో ఉన్న వాటితోనే క్రిస్పీ పొటాటో రింగ్స్..ఎలా చేసుకోవాలంటే..

తయారీ విధానం

-ముందుగా వెల్లుల్లి రెబ్బల పొట్టు తీసి వాటిని చాలా సన్నగా తరగాలి లేదా మెత్తగా దంచుకోవాలి. ఉల్లిపాయను వీలైనంత పల్చగా, గుండ్రని రింగ్స్‌ లా కట్ చేసుకోవాలి. కొత్తిమీర, ఉల్లికాడలను కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

-ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో వెన్న (బట్టర్) వేయాలి. ఆ వెన్నలో మనం ముందుగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, సరిపడా ఉప్పు, కొత్తిమీర తురుము వేసి స్పూన్‌ తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు ఎంతో రుచికరమైన గార్లిక్ బట్టర్ సిద్ధమైనట్లే. ఈ మిశ్రమాన్ని బ్రెడ్ ముక్కలకు ఒకవైపు సమానంగా రాసుకోవాలి.

-ఇప్పుడు గార్లిక్ బట్టర్ రాసిన బ్రెడ్ స్లైస్ మీద గుండ్రంగా కోసిన ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడలు ఉంచాలి. ఆ పైన మీకు ఇష్టమైనంత తురిమిన చీజ్ లేదా చీజ్ స్లైస్‌ ను పెట్టుకోవాలి. ఇప్పుడు మరో బ్రెడ్ స్లైస్ తీసుకుని దీనిపై ఉంచి గట్టిగా నొక్కాలి.

-స్టవ్ ఆన్ చేసి పెనం లేదా శాండ్‌ విచ్ మేకర్‌ ను వేడి చేయండి. తయారు చేసి పెట్టుకున్న శాండ్‌ విచ్ పైన, అడుగు భాగంలో కొద్దిగా గార్లిక్ బట్టర్ పూయండి. మంటను తక్కువగా ఉంచి శాండ్‌ విచ్‌ ను రెండు వైపులా కరకరలాడేలా కాల్చాలి. మంట తక్కువగా ఉంటేనే లోపల ఉన్న చీజ్ చక్కగా కరుగుతుంది.

-బ్రెడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌ లోకి మారి, లోపల చీజ్ కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఈ వేడి వేడి శాండ్‌ విచ్‌ ను మధ్యలోకి కట్ చేసి, పైన కొద్దిగా మసాలా లేదా ఆరిగానో చల్లుకుని తింటే ఆ రుచే వేరు.

-అంతే బేకరీలో దొరికే గార్లిక్ బ్రెడ్ కంటే వంద రెట్లు అద్భుతమైన రుచితో ఉండే చీజ్ గార్లిక్ ఆనియన్ శాండ్‌ విచ్ రెడీ.

[ of 5 - Users]
Story first published: Wednesday, September 16, 2026, 8:52 [IST]
Desktop Bottom Promotion