నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్‌ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.!

ప్రియుడి మోజులో పడి భర్తను కడతేరుస్తున్న భార్య ఘటనలు కొంతకాలంగా దేశవ్యాప్తంగా భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఒకరితో ప్రేమాయణం సాగిస్తూనే మరొకరితో పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. వివాహం తర్వాత ప్రియుడిని మరిచిపోలేక కట్టుకున్నవాడిని కాటికి పంపిస్తున్నారు. ఇలాంటి ఘటనలతో నేటి కాలం యువకులు పెళ్లంటేనే వెనకడుగు వేస్తున్నారు. ఈ క్రమంలో ఓ యువతి.. అటు భర్తతో కాపురం చేస్తూనే ప్రేమికుడితో ప్రెగ్నెన్సీ తెచ్చుకున్న సంఘటన వైరల్‌ అవుతోంది.

A married woman affair with boy friend and got pregnancy whats app chat reveals

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న సమాచారం ప్రకారం.. ఓ యువతికి నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే అప్పటికే ఆమె మరొకరితో ప్రేమాయణం సాగిస్తోంది. ఈ క్రమంలో పెళ్లయినా కూడా ప్రియుడితో ఎఫైర్‌ కొనసాగిస్తూనే ఉంది. అయితే ఈ విషయాన్ని ఇంట్లో భర్తతో సహా ఎవరూ గుర్తించలేదు.

ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్‌ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్‌ వైరల్‌.!

ఈ క్రమంలో యువతి గర్భం దాల్చింది. దీంతో భర్త, ఇరు కుటుంబీకులు సంబరంలో మునిగితేలారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్‌.. కారణం ఆమె గర్భానికి కారణం భర్త కాదు.. ప్రియుడు. అప్పటివరకూ తాను తండ్రిని కాబోతున్నాననే సంబరంలో ఉన్న భర్త ఒకరోజు భార్య ఫోన్‌ చూసి షాక్‌కి గురయ్యాడు.

ఒకరోజు భార్య విశ్రాంతిలో ఉండగా.. ఆమె ఫోన్‌కి నోటిఫికేషన్‌లు రావడంతో భర్త దానిని తెరిచిచూశాడు. అందులో ఆమె, ప్రియుడికి మధ్య ఉన్న వాట్సప్‌ చాటింగ్‌ చూసి ఖంగు తిన్నాడు. అబార్షన్‌ చేయించుకోవాల్సిందిగా ప్రియుడు తన భార్యను కోరడం, దానికి ఆమె ఒప్పుకోకపోవడం.. ఇవన్నీ చాటింగ్‌లో చూసి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు.

ఈ చాటింగ్‌పై ఆమెను నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇరు కుటుంబాల మధ్య వివాదం మొదలైంది. చివరికి ఈ బంధంలో తాను కొనసాగలేనని విడాకులు ఇవ్వాలని భర్త కోరాడు. దీంతో వివాహిత కుటుంబీకులు ఆందోళనకు గురయ్యారు. తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని.. వారి భవిష్యత్తు, కుటుంబ పరువు పాడుచేయవద్దని అల్లుడిని విజ్ఞప్తి చేస్తున్నారు. విడాకులు కోరవద్దని వేడుకుంటున్నారు. దీంతో ఆ భర్త నిర్ణయమేంటనేది సందిగ్ధంలో మారిపోయింది.

ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.!

నేటి కాలంలో పెళ్లి, బంధం, సంబంధాలు అనేవి చాలావరకు హాస్యాస్పదంగా మారిపోయాయి. మూడు ముళ్ల బంధానికి కట్టుబడి ఉండలేక అడ్డదారులు తొక్కుతున్నారు. భర్త వాట్సప్‌ చాటింగ్‌ చూడటంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. చాటింగ్‌ చూడకపోతే ఈ ఎఫైర్‌ ఇంకా ఎంతకాలం కొనసాగి ఉండవచ్చనేది నెటిజన్లు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందనే స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు. ఇన్‌స్టాలో ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది.

Desktop Bottom Promotion