ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.!

గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఒకటే హాట్‌ టాపిక్‌.. పెళ్లయిన కొందరు మహిళలు ప్రియుడిని మరిచిపోలేక, భర్తను బలితీసుకుంటున్న ఘటనలు చూస్తున్నాం. మరికొందరు వివాహేతర సంబంధాల మోజులో పడి కట్టుకున్న వాడిని కాటికి పంపించేస్తున్నారు. మరోచోట ప్రియుడితో వ్యవహారం నడుపుతూనే మరో యువకుడితో నిశ్చితార్థం చేసుకుని అనంతరం కాబోయే మొగుడిని అడ్డు తొలగించుకుంటున్నారు. ఆస్తి కోసం కుట్రలు పన్నుతున్నారు. ఇలాంటి ఊహించని పరిణామాలతో పెళ్లంటేనే మగజాతి భయపడుతోంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఒక ఘటన ఒకవైపు భయాందోళన కలిగిస్తూనే మరోవైపు మగవారికి ఊరట కల్పిస్తోంది. అసలేం జరిగిందంటే..

Unable to bear being away from her lover woman left just 14 days after her wedding

ప్రియుడిపై మోజు, వివాహేతర సంబంధాల పట్ల ఆకర్షణ.. వీటి ఫలితం కట్టుకున్న భర్తను హనీమూన్‌ పేరుతో చంపేయడం, పిల్లల కంట పడకుండా చంపేసి డ్రమ్ముల్లో కుక్కేయడం, లేదా భర్త పిల్లలను వదిలి లవర్‌తో పారిపోవడం.. వయసు, విలువలతో సంబంధం లేకుండా విరహం పట్ల నిగ్రహం లేని మహిళలు, యువతులు చేస్తున్న పనులు దేశవ్యాప్తంగా పురుషులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకున్న ఘటన మరోసారి దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో కౌశాంబి ప్రాంతానికి చెందిన అభినవ్ ఖందేల్వాల్‌తో జులై 11న రాణి అనే యువతితో వివాహం జరిగింది. అంతా బాగానే ఉంది అనుకుని సంబరపడిన నూతన వరుడికి కొద్ది రోజుల్లోనే ఊహించని షాక్‌ తగిలింది. పెళ్లైన వారం రోజుల్లోనే.. రాణి ఫోన్‌లో మరో వ్యక్తితో మాట్లాడుతుండగా అభినవ్‌ చూశాడు. దీంతో ఎవరితో మాట్లాడుతున్నావని నిలదీస్తే.. తన ప్రియుడితోనే అని ఓపెన్‌గానే చెప్పేసింది. దీంతో ఖంగు తినడం భర్త వంతైంది.

అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి!అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి!

ఈ విషయాన్ని అభినవ్‌ ఇరు కుటుంబాల దృష్టికి తీసుకువచ్చాడు. దీంతో రెండు కుటుంబాల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే.. పెళ్లైన 14 రోజుల్లోనే రాణి తట్టాబుట్టా సర్దుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. కొన్ని రోజులకి కాంప్రమైజ్‌ అయిన అభినవ్‌.. తిరిగి ఇంటికి రమ్మంటే తాను ప్రియుడిని వదిలి ఉండలేనని తేల్చి చెప్పేసింది.

విమానాల్లో 'నో స్మోకింగ్‌’, కానీ బాత్‌రూమ్‌ల్లో యాష్‌ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.!విమానాల్లో 'నో స్మోకింగ్‌’, కానీ బాత్‌రూమ్‌ల్లో యాష్‌ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.!

ఈ క్రమంలో రాణి తనను బెదిరిస్తోందని అభినవ్‌ ఆరోపిస్తున్నాడు. తన ప్రేమ విషయంలో జోక్యం చేసుకుంటే.. గృహహింస కేసు పెడతానని భార్య బెదిరించిందని, తప్పుడు వరకట్న వేధింపుల కేసు కూడా పెడతామని ఆమె కుటుంబం భయపెడుతోందని ఆరోపించాడు. ఈ వ్యవహారం ముదరడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు దర్యాప్తులో ఉంది.

ఏదేమైనా ఈ ఘటనలో మగజాతి ఊరట చెందే ఒక విషయం ఉంది. ప్రియుడిపై మోజుతో భర్తను చంపేయకుండా వెళ్లిపోవడం ఆ కుటుంబానికి ఉపశమనం అనే చెప్పవచ్చని నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

Story first published: Thursday, September 24, 2026, 16:47 [IST]
Desktop Bottom Promotion