Latest Updates
-
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే!
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.!
ఈ రోజుల్లో పెళ్లిళ్లు అంటే ఉండే హడావుడి అంతా ఇంతా కాదు. సంబంధం కుదిరినప్పటి నుంచి మొదలుకొని పెళ్లి తంతు ముగిసేవరకు సంప్రదాయం కంటే ఎక్కువగా ఆర్భాటాలే కనిపిస్తున్నాయి. దీంతో పెళ్లి ఖర్చు బడ్జెట్ అంచనాలను మించి దాటిపోతున్నాయి. ఈ భారీ బడ్జెట్ రాజమౌళి సెట్టింగులు మధ్యతరగతి కుటుంబాలను అప్పుల ఊబిలోకి నెట్టివేస్తున్నాయి. సోషల్ మీడియా ప్రభావం కూడా దీనిపై చాలా ఉంది. ఈ క్రమంలో ఈ తరం కాబోయే వరుడు పెట్టిన కండిషన్స్ నెట్టింట చర్చనీయాంశమవుతోంది. తనకు రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లి సవ్యంగా జరగాలంటే తాను పెట్టిన రూల్స్ తప్పనిసరిగా అమలు కావాల్సిందే అని షరతు విధించాడు. ఆ కండిషన్స్ ఏంటి.. వరుడెందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. ఇక్కడ తెలుసుకుందాం..

పెళ్లిలో పంతులు కంటే ఫొటోగ్రాఫర్ల హడావుడే ఎక్కువగా ఉంటుంది. అయ్యగారి నుంచి మొదలుకొని వధూవరులు, కుటుంబీకులు అందరూ వారు చెప్పిన మాట వినాల్సిందే. ఫొటోషూట్‌కే లక్షలు ఖర్చు చేస్తున్న నేపథ్యంలో వారు చేపినట్టు చేయడం తప్పనిసరి. కాగా, గత కొంతకాలంగా ప్రీ వెడ్డింగ్ షూట్, హల్దీ ఫంక్షన్లు మన సౌంత్ ఇండియన్ వెడ్డింగ్స్‌లో తిష్ట వేశాయి. ఇక, ప్రీ వెడ్డింగ్ షూట్‌లో వధూవరులు ఇచ్చే పోజులు హనీమూన్‌నే తలపిస్తాయి. ఎంగేజ్‌మెంట్, పెళ్లిలోనూ ఇలాంటివి కనిపిస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో ఓ పెళ్లి కొడుకు తన వివాహం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు.

వేద పండితుల ఆశీర్వాదం, మంత్రోచ్ఛారణల నడుమ సంప్రదాయబద్ధంగా తన పరిణయ వేడుక జరగాలని భావించిన యువకుడు.. యువతి కుటుంబానికి కీలక కండిషన్లు పెట్టాడు. తనకు అత్తింటి నుంచి ఒక్క రూపాయి కట్నం వద్దని.. కానీ తాను పెట్టిన రూల్స్ అతిక్రమించకూడదని షరతు విధించాడు. దానికి సంబంధించిన లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ లిస్ట్ ఏంటంటే..

ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ వద్దు
పెళ్లికి ముందు నిర్వహించే ప్రీ వెడ్డింగ్ షూట్‌కి అనుమతి లేదు. వివాహ సమయంలో వధువు చీర మాత్రమే ధరించాలి. లెహంగాలు కాదు. పెళ్లిలో సాంప్రదాయ, శాస్త్రీయ సంగీతానికే ప్రాధాన్యత ఇవ్వాలి. గట్టిగా, ఇబ్బంది పెట్టే మ్యూజిక్ ఉన్న పాటలను ప్లే చేయడానికి వీల్లేదు.
వరమాల రూల్స్
వధూవరులు వరమాల వేసుకునే సందర్భంలో అక్కడ ఎవరూ ఉండకూడదు. ఎవరూ కూడా వారిద్దరనీ పైకి ఎత్తుకోవడానికి ప్రయత్నించకూడదు. అలాంటి వారు పెళ్లి వేడుక నుంచి బయటకు వెళ్లిపోవచ్చు.

పంతులుని ఇబ్బంది పెట్టొద్దు
పెళ్లి తంతు మొదలైన తర్వాత ఫొటోగ్రాఫర్లు కానీ బంధువులు కానీ వేదపండితులను మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు. ఫొటోలు తీయడం కోసం మధ్యలో వివాహ కార్యక్రమాన్ని పాజ్ చేయకూడదు. పంతులు వివాహం జరిపిస్తుండగా ఆ సందర్భాలను ఫొటో తీయాలి కానీ.. ఫొటోగ్రాఫర్ చెప్పినట్లుగా అయ్యగారు వినాల్సిన అవసరం లేదు. పవిత్రమైన బంధానికి ఇది వేడుక కానీ.. ఇదొక సినిమా షూట్ కాదు.
రాత్రిళ్లు వద్దు
వివాహ వేడుక పగటి సమయంలో మాత్రమే నిర్వహించాలి. లేట్ నైట్స్ నిర్వహించడం ద్వారా బంధువులు ఇబ్బందులకు గురవుతారు. ఆలస్యంగా భోజనం చేయడం, నిద్ర లేకపోవడం వంటి కారణాల వల్ల అతిథుల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. వధూవరులు ముద్దుపెట్టుకోవాలని ఎవరైనా బలవంతం చేస్తే వారు అక్కడి నుంచి వెళ్లిపోవచ్చు.
ఇవీ నూతన వరుడు పెట్టిన నయా కండిషన్స్. భారతీయ సంప్రదాయంలో శాస్త్రోక్తంగా పరిణయ వేడుక జరగాలని.. పవిత్ర బంధం చాలా పవిత్రంగా ముడిపడాలని, ఎలాంటి వెస్ట్రన్ పోకడలకు తావుండకూడదని ఈ యువకుడి ఆరాటం సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది.



Click it and Unblock the Notifications
