బంపరాఫర్..షూరిటీ లేకుండానే రూ.10 లక్షల లోన్..ఫుల్ డీటెయిల్స్ మీకోసం..

చదువుకోవాలనే తపన, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలనే కసి ఉన్నా.. పేదరికం, ఆర్థిక ఇబ్బందులు చాలా మంది యువత ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. ప్రతిభ ఉన్నప్పటికీ, లక్షల రూపాయల ఫీజులు కట్టలేక పైచదువులకు వెళ్లలేక ఎంతో మంది విద్యార్థులు తమ కలలను మధ్యలోనే వదిలేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిని తొలగించి పేద విద్యార్థుల లక్ష్యాలకు రెక్కలు తొడిగేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం విద్యాలక్ష్మీ పథకాన్ని తీసుకొచ్చింది.

Apply Online Get Loan in 15 Days Good News for Students Know PM Vidyalaxmi Schme Details Here

కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతున్న క్రమంలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే లక్షలాది మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఈ పథకం ఒక గొప్ప వరం. కేంద్ర ఆర్థిక శాఖ, ఉన్నత విద్యా - మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, అలాగే ఇండియన్‌ బ్యాంక్‌ అసోసియేషన్‌ (IBA) సంయుక్తంగా ఈ విద్యాలక్ష్మి పోర్టల్‌ ను ప్రతిష్టాత్మకంగా రూపొందించాయి. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఒకే వేదికపై దాదాపు 86 రకాల ఎడ్యుకేషనల్ లోన్స్ అందుబాటులో ఉంచుతూ వారి కలలను సాకారం చేస్తున్నాయి.

ప్రభుత్వమే గ్యారెంటీ!
సాధారణంగా బ్యాంకులో లోన్ అనగానే ఏవో డాక్యుమెంట్లు కుదవపెట్టాలి అన్న భయం ఉంటుంది. కానీ ఈ పథకం కింద విద్యార్థులు ఎలాంటి పూచీకత్తు లేదా షూరిటీ లేకుండానే రూ. 10 లక్షల వరకు ఎడ్యుకేషన్ లోన్ పొందవచ్చు. విద్యార్థులు తీసుకునే ఈ లోన్స్ కి కేంద్ర ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుంది. అందుకే బ్యాంకులు కూడా ఎలాంటి సంకోచం లేకుండా లోన్లు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. అంతేకాదు, కుటుంబ వార్షిక ఆదాయం రూ. 8 లక్షల లోపు ఉన్న విద్యార్థులకు రూ. 10 లక్షల వరకు తీసుకునే రుణాలపై 3 శాతం వడ్డీ సబ్సిడీ కూడా లభిస్తుంది. ఈ లోన్ అమౌంట్‌ ను కేవలం కాలేజీ ట్యూషన్ ఫీజులకే కాకుండా.. హాస్టల్ ఖర్చులు, ల్యాబ్ ఫీజులు, పుస్తకాలు, ఎగ్జామ్ ఫీజులు, ల్యాప్‌ టాప్ వంటి ఇతర విద్యా సామాగ్రి కొనుగోలుకు కూడా నిశ్చింతగా వాడుకోవచ్చు.

ఎవరు అర్హులు?
దేశవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ 800 ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు ఈ రుణం పొందేందుకు పూర్తి అర్హులు. ఇంజినీరింగ్, మెడిసిన్, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఆర్కిటెక్చర్, మేనేజ్‌మెంట్, లా వంటి ప్రొఫెషనల్ కోర్సులతో పాటు.. బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీహెచ్ డీ , సీఏ, సీఎస్, ఎంఏ వంటి ఇతర ఏ డిగ్రీలు చదివే వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా గరిష్ఠంగా రూ.7.5 లక్షల వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులకు ఇందులో అధిక ప్రాధాన్యం ఉంటుంది.

Apply Online Get Loan in 15 Days Good News for Students Know PM Vidyalaxmi Schme Details Here

అప్లై చేయడం ఎలా
లోన్ కోసం బ్యాంకుల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సిన పనిలేదు. పీఎం విద్యాలక్ష్మి పోర్టల్‌ లోకి వెళ్లి ఆన్‌ లైన్‌ లో నేరుగా అప్లై చేసుకోవచ్చు. ఈ పోర్టల్‌ లో వివిధ బ్యాంకులు అందించే లోన్ స్కీమ్స్ పరిశీలించి, మీకు నచ్చిన బ్యాంకు ను ఎంచుకోవచ్చు. ముందుగా పోర్టల్‌ లో అకౌంట్ క్రియేట్ చేసుకుని.. పేరు, మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీ, చిరునామా నమోదు చేయాలి. అనంతరం మార్కుల జాబితాలు, చదివిన కోర్సుల సర్టిఫికెట్లు, చదవబోయే కోర్సుకు సంబంధించిన అడ్మిషన్ లెటర్ యాడ్ చేసి ఫామ్ సబ్‌ మిట్ చేయాలి.

అప్లయ్ చేసిన 15 రోజుల్లోగా బ్యాంకు సిబ్బంది రుణ మంజూరుపై మీకు క్లారిటీ ఇస్తారు. అంతవరకు మీ అప్లికేషన్ స్టేటస్‌ ను ఎప్పటికప్పుడు ఆన్‌ లైన్‌ లో ట్రాక్ చేసుకోవచ్చు.

గడువు లేదు.. ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు
ఈ లోన్ కోసం అప్లయ్ చేసుకోవడానికి ఎలాంటి చివరి తేదీ లేదు. విద్యార్థులు తమ కోర్సు ఫీజును బట్టి రూ. 4 లక్షల లోపు, రూ. 4 లక్షల నుంచి రూ. 7.5 లక్షల వరకు, అలాగే రూ. 7.5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు.. ఇలా మూడు విభాగాల్లో లోన్ ఎంచుకోవచ్చు. అయితే ఒక విద్యార్థి ఒక్కసారి మాత్రమే అప్లయ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

Story first published: Wednesday, May 20, 2026, 17:07 [IST]
Desktop Bottom Promotion