Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
షాకింగ్..అయోధ్య రామాలయం ప్రధాన పూజారి కన్నుమూత
అయోధ్య రామాలయం ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ కన్నుమూశారు. ఫిబ్రవరి3వ తేదీన బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మహంత్ సత్యేంద్ర దాస్ ని లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యేయేట్ మెడికల్ సైన్సెస్(SGPGI)హాస్పిటల్ లో చేర్పించారు. అప్పటినుంచి హాస్పిల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించి ఇవాళ(ఫిబ్రవరి 12)ఉదయం తుదిశ్వాస విడిచారు.
గత 20 ఏళ్ల నుంచి అయోధ్యలో తాత్కాలిక రామాలయానికి కూడా ప్రధాన పూజారి దాస్ కొనసాగారు. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో కూడా ఆయన తాత్కాలిక రామాలయ ప్రధాన పూజారిగా ఉన్నారు. గతేడాది అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సమయంలో కూడా దాస్ కీలక పాత్ర పోషించారు. అయోధ్య మందిర నిర్మాణం తర్వాత అక్కడ రామాలయ ప్రధాన పూజారిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం దాస్ వయస్సు 85 సంవత్సరాలు.

మహంత్ సత్యేంద్ర దాస్ కన్నుమూతపై పలువురు నేతలు, ప్రముఖులు, ఆధ్యాత్మిక గురువులు సంతాపం తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఆయనతో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.



Click it and Unblock the Notifications
