Latest Updates
-
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్
ఆయుధ పూజ 2025..అక్టోబర్ 1 లేదా 2?..సరైన తేదీ, శుభ సమయం, పూజ విధానం
శరన్నవరాత్రులు కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో ఆరాధించి, పదవ రోజున విజయదశమిని జరుపుకోవడం మన సంప్రదాయం. ఈ నవరాత్రులలో చివరి రోజైన మహర్నవమికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ పవిత్రమైన రోజున దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఆయుధ పూజ నిర్వహిస్తారు. ఇది కేవలం ఒక పూజ కాదు.. మన జీవన ప్రయాణంలో మనకు తోడుగా నిలిచే ప్రతి వస్తువుకు కృతజ్ఞతలు తెలిపే ఒక గొప్ప ఉత్సవం.
మన వృత్తి, వ్యాపారాలలో ఉపయోగించే సాధనాలు, మనల్ని గమ్యస్థానాలకు చేర్చే వాహనాలు, మన జ్ఞానానికి మూలమైన పుస్తకాలు.. ఇవన్నీ మన విజయానికి ఆయుధాలే. వాటిని దేవతా స్వరూపంగా భావించి పూజించడం వల్ల ఇంట్లోకి సకల శుభాలు, సిరిసంపదలు చేకూరుతాయని అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉంటాయని ప్రగాఢ విశ్వాసం. అయితే 2025లో నవరాత్రులు 10 రోజుల పాటు ఉండటంతో, ఆయుధ పూజ ఎప్పుడు జరుపుకోవాలనే దానిపై కొందరిలో సందిగ్ధత నెలకొంది. జ్యోతిష్య పండితుల ప్రకారం సరైన తేదీ, శుభ ముహూర్తాల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2025లో ఆయుధ పూజ తేదీ, శుభ ముహూర్తం
ఆయుధ పూజను సంప్రదాయబద్ధంగా శారదీయ నవరాత్రులలో వచ్చే మహర్నవమి తిథి నాడు జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం 2025లో మహర్నవమి తిథి సెప్టెంబర్ 30, మంగళవారం సాయంత్రం 6:06 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది అక్టోబర్ 1 బుధవారం సాయంత్రం 7:01 గంటల వరకు ఉంటుంది. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం సూర్యోదయం నాడు ఏ తిథి ఉంటుందో ఆ రోజంతా అదే తిథిని పరిగణలోకి తీసుకుంటారు. ఈ నియమం ప్రకారం నవమి తిథి సూర్యోదయం అక్టోబర్ 1వ తేదీన వస్తున్నందున ఆయుధ పూజను అక్టోబర్ 1, 2025, బుధవారం నాడు జరుపుకోవడం శాస్త్ర సమ్మతం.
పూజకు అనువైన శుభ సమయాలు
ఉదయం 07:50 నుండి 09:19 వరకు
ఉదయం 10:47 నుండి మధ్యాహ్నం 12:16 వరకు
మధ్యాహ్నం 03:13 నుండి 04:42 వరకు
సాయంత్రం 04:42 నుండి 06:10 వరకు
ఆయుధ పూజ ఎలా చేయాలి?
అక్టోబర్ 1, బుధవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి, తలస్నానం చేసి, పరిశుభ్రమైన వస్త్రాలు ధరించాలి. మీరు పూజించాలనుకుంటున్న వాహనాలను, పనిముట్లను, యంత్రాలను, కంప్యూటర్లను, విద్యార్థులైతే పుస్తకాలను నీటితో శుభ్రంగా కడగాలి లేదా తుడవాలి. శుభ్రపరిచిన వస్తువులకు పసుపు, కుంకుమలతో బొట్లు పెట్టాలి. వాహనాలకు, యంత్రాలకు పూల మాలలు వేసి అలంకరించాలి. వాటి ముందు దీపం వెలిగించి, అక్షతలు, పువ్వులు సమర్పించాలి. ఆ తర్వాత వాటికి రక్షా బంధనం లేదా పూజా దారం కట్టాలి. మీ శక్తి కొలది స్వీట్లు, పండ్లు లేదా కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించాలి. చివరగా కర్పూరంతో హారతి ఇచ్చి, భక్తితో నమస్కరించుకోవాలి. ఈ పూజ చేయడం ద్వారా ఆయా వస్తువుల వల్ల మనకు ఎలాంటి ఆపద కలగకుండా, అవి మన అభివృద్ధికి దోహదపడాలని అమ్మవారిని ప్రార్థించాలి.

ఆయుధ పూజ వెనుక ఉన్న పౌరాణిక గాథ
ఆయుధ పూజ వెనుక ఒక శక్తివంతమైన పురాణ కథ ఉంది. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు తన అపారమైన బలంతో ముల్లోకాలను గడగడలాడించాడు. దేవతలను సైతం స్వర్గం నుండి తరిమికొట్టాడు. అతని ఆగడాలను భరించలేని దేవతలందరూ త్రిమూర్తుల వద్దకు వెళ్లి మొరపెట్టుకోగా వారి దివ్యశక్తుల కలయికతో దుర్గాదేవి ఆవిర్భవించింది. అప్పుడు దేవతలందరూ తమ శక్తివంతమైన ఆయుధాలను అమ్మవారికి సమర్పించారు. ఆ దివ్యాయుధాలను ధరించిన ఆదిపరాశక్తి, మహిషాసురుడితో తొమ్మిది రాత్రులు, పది రోజులు ఘోర యుద్ధం చేసి చివరికి అతడిని సంహరించింది. ఆ యుద్ధంలో దేవతల ఆయుధాలు కీలక పాత్ర పోషించాయి. అమ్మవారి విజయానికి చిహ్నంగా ఆ ఆయుధాల ప్రాముఖ్యతను గుర్తిస్తూ వాటికి కృతజ్ఞతగా పూజ చేసే సంప్రదాయం మొదలైంది. అదే నేటికీ ఆయుధ పూజగా కొనసాగుతోంది.



Click it and Unblock the Notifications