Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
2023లో పేలిపోనున్న అణు ప్లాంట్, ఏలియన్ దాడులు, ల్యాబ్‌లో బేబీలు.. బాబా వంగా ఇంకా ఏమేం చెప్పారంటే
బాబా వంగా 2023లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయని అంచనా వేశారు.. 2022లో ఏయే అంచనాలు నిజమయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం.
2022 సంవత్సరం దాదాపు ముగిసిపోయింది. మరో రెండు వారాల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. చాలా మంది ఇప్పటికే కొత్త సంవత్సరంలో ఏమేం చేయాలో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఆలోచనలు చేసుకుంటున్నారు. కొత్త ఏడాదిలోనైనా తమ జాతకం మారుతుందా.. ఆర్థిక సమస్యలు తీరతాయా.. ఉద్యోగం వస్తుందా.. పెళ్లి అవుతుందా.. ఇలాంటి చాలా ఆలోచనలు మదిలో మెదులుతూనే ఉంటాయి. అయితే 2023 గురించి ప్రముఖ్య ఆధ్యాత్మికవేత్త, ప్రవక్త బాబా వంగా షాకింగ్ అంచనాలు చేప్పారు. 2022లో బాబా వంగా చెప్పిన కొన్ని విషయాలు నిజం అయ్యాయి కూడా.

బాబా వంగా 2023లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయని అంచనా వేశారు.. 2022లో ఏయే అంచనాలు నిజమయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం.

అసలు ఎవరీ బాబా వంగా?
బాబా వంగా బల్గేరియాకు చెందిన ఒక ఆధ్యాత్మికవేత్త. ఆమె తన 12 ఏళ్ల వయస్సులోనే ఒక భారీ తుపాను కారణంగా కంటి చూపును కోల్పోయారు. ఆ తర్వాత భవిష్యత్తుకు సంబంధించి అంచనాలు చెప్పడం ప్రారంభించింది. 1911వ సంవత్సరంలో పుట్టారు బాబా వంగా. ఆమె 85 ఏళ్ల వయస్సులో 1996 ఆగస్టు 11వ తేదీన మరణించారు. కానీ ఆమె 5079 సంవత్సరం వరకు అంచనా వేసింది.
2022 సంవత్సరంలో వైరస్ దాడిని, ఏలియన్ల దాడి, మిడతల దాడి, ఆకలి చావుల గురించి అంచనా వేశారు. 2019 డిసెంబర్‌లో మొదలైన కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను ఎంతలా అతలాకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అదే సమయంలో గ్రహాంతర వాసులు భూమిపై దాడికి సిద్ధం అవుతున్నట్లు కూడా పలు పరిశోధనల్లో వెల్లడైంది. పలు రాష్ట్రాల్లో మిడతల దాడి జరగడం తెలిసిందే. మిడతల దాడితో పలు దేశాల ఆహార కరవును ఎదుర్కొన్నారు.

2023 సంవత్సరం గురించి బాబా వంగా అంచనాలు:
- 2023లో ల్యాబుల్లో శిశువులను అభివృద్ధి చేస్తారని బాబా వంగా అంచనా వేశారు. పిల్లల రంగును, రూపును, ఆడ లేదా మగలను నిర్ణయించుకోవచ్చని చెప్పారు.
- అభివృద్ధి చెందిన ఒక దేశం ఇతర దేశాలపై బయో ఆయుధాలను పరీక్షిస్తుందని షాకింగ్ విషయాన్ని అంచనా వేశారు. ఈ దాడిలో వేలాది మంది చనిపోతారని చెప్పారు.
- 2023 సంవత్సరంలోని ఆసియా ఖండంలోని ఓ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో పేలుడు సంభవిస్తుందని అంచనా వేశారు. ఈ పేలుడు ప్రభావం భారత్‌పైనా ఉంటుందన్నారు.
- 2022 ఏడాదిలో కొన్ని దేశాల్లో నీటి ఎద్దడి ఏర్పడుతుందని బాబా వంగా అంచనా వేశారు. పోర్చుగల్, ఇటలీ వంటి దేశాల్లోని ప్రజలు తక్కువ నీటిని వాడుకోవడం అలవాటు చేసుకోవాలని సూచించారు.
- ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశం ఉందని వేసిన అంచనా నిజం అయింది. ఆస్ట్రేలియా తూర్పు తీరంలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి.
- అమెరికా ట్విన్ టవర్స్ కూల్చివేత గురించి బాబా వంగా ముందే అంచనా వేశారు.
- EU నుండి బ్రిటన్ బయటకు(బ్రెగ్జిట్) వస్తుందని బాబా వంగా ముందే జోస్యం చెప్పారు.
- 9/11 దాడుల గురించి ముందే చెప్పారు.
- ప్రిన్సెస్ డయానా మరణం.
- సోవియట్ యూనియన్ రద్దు
- చెర్నోబిల్ విపత్తు
- 2018 నాటికి చైనా సూపర్ పవర్ అవుతుందని చెప్పారు.
- 2004 సంవత్సరంలో సునామీ వస్తుందని వేసిన బాబా వంగా అంచనా నిజం అయింది.

2022లో ఏయే అంచనాలు నిజమయ్యాయి?




Click it and Unblock the Notifications
