Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
బాబా వంగా భయంకరమైన జోస్యం.. జూన్ 7 తర్వాత ప్రపంచానికి ముప్పు?
బాబా వంగా..ఈమె గురించి తెలియని వారు చాలా తక్కువమందే ఉంటారు. బల్గేరియాకు చెందిన బాబా వంగా చిన్న వయస్సులోనే కంటిచూపు కోల్పోయింది. అయితే ఆ తర్వాతే ఆమె భవిష్యత్తులో జరగబోయే సంఘటనలో తన దివ్య దృష్టితో చూసే శక్తి ఆమెకు లభించిందని నమ్ముతారు. 20వ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధ కాలజ్ణానిగా పరిగణించబడే బాబా వంగా 1996లో మరణించారు. అయితే బాబా వంగా చెప్పిన ఎన్నో అంచనాలు నిజమయ్యాయి. ఆమె ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఎన్నో సంఘటనలను ముఖ్యంగా 9/11 న్యూయార్క్ ట్విన్ టవర్స్ ఉగ్రదాడిని ఖచ్చితంగా జోస్యం చెప్పి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. అయితే ఆమె అంచనాలు ఇప్పుడు మరోసారి మరోసారి చర్చనీయాంశమయ్యాయి.
బాబా వంగా 2025 కోసం భయంకరమైన అంచనాలను వెల్లడించారు. జూన్ 7 తర్వాత ప్రపంచవ్యాప్తంగా కొన్ని షాకింగ్ పరిణామాలు చోటు చేసుకుంటాయని బాబా వంగా అంచనా వేశారు. ఆశక్తికరంగా కుజుడు తన రాశిచక్రాన్ని మార్చుకున్న రోజు జూన్ 7నే కావటం విశేషం. జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, కుజుడు యుద్ధం, దూకుడు, ప్రమాదాలు, గందరగోళానికి ప్రతీక. కుజుడు తన స్థానాన్ని మార్చుకోవడం చాలా అశుభకరంగా పరిగణించబడుతుంది.

జ్యోతిష్యుల దృష్టిలో కుజుడి ప్రభావం
కుజుడు తన స్థానాన్ని మార్చుకుంటున్నందున జ్యోతిష్యులు దీనిని రాబోయే కాలానికి ఒక అశుభ సంకేతంగా భావిస్తున్నారు. కుజుడిని యుద్ధం, దురాక్రమణ, ప్రమాదాలు, దహనాల గ్రహంగా పరిగణిస్తారు. అటువంటి గ్రహం తన స్థానాన్ని మార్చుకోవడం భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బాబా వంగా 2025 అంచనాలు
బాబా వంగా అంచనా ప్రకారం ఈ సంవత్సరం తర్వాత ప్రపంచం రెండు విభిన్న మనస్తత్వాలు గల నాగరికతలుగా విడిపోతుంది. ఒక నాగరికత టెక్నాజీ పూర్తిగా మునిగిపోతే మరొకటి ఆధ్యాత్మికతను ఆశ్రయిస్తుందని ఆమె అంచనా వేసింది. అంతేకాకుండా క్రింద నుండి లేచే పొగ అందరినీ భయపెడుతుంది అని చెప్పారు. దీనిని దశాబ్దాలుగా శాస్త్రవేత్తలను కలవరపరుస్తున్న దక్షిణ అట్లాంటిక్ అయస్కాంత క్రమరాహిత్యంగా చాలామంది నమ్ముతున్నారు. ఇది భూమి యొక్క అయస్కాంత క్షేత్రంలో ఒక బలహీనమైన ప్రాంతం..ఇది టెక్నాలజీ డివైజ్ లపై ప్రభావం చూపగలదు.
ఈ విషంతో పెద్ద ప్రమాదం
బాబా వంగా నీటిలో కరిగిపోయే విషం గురించి కూడా హెచ్చరించారు.. ఇది కొత్త వ్యాధులకు దారితీస్తుందని చెప్పారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం జూన్ 2025 తర్వాత నీటి ద్వారా వ్యాపించే వైరస్ లు, శిలీంధ్రాలు కొత్త అంటువ్యాధులకు కారణం కావచ్చు. ఈ అంచనాలు ప్రస్తుత ప్రపంచ ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

జ్యోతిష్య, బాబా వంగా అంచనాల మధ్య సంబంధం
కుజుడు సింహరాశిలోకి ప్రవేశించబోతున్న సమయానికి బాబా వంగా అంచనాలు ముడిపడి ఉండటం కేవలం యాదృచ్ఛికమేనా? నాయకత్వం, శక్తి, అహాన్ని సూచించే సింహరాశిలోకి కుజుడి ప్రవేశం భౌగోళిక రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని జ్యోతిష్యులు విశ్వసిస్తున్నారు. ఈ మార్పులు మంచికి దారితీస్తాయో లేక చెడుకు దారితీస్తాయో ప్రస్తుతానికి అస్పష్టంగా ఉంది.
ప్రపంచం ఇప్పటికే రెండు ప్రధాన యుద్ధాలు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో సతమతమవుతోంది. భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఇటీవలి సైనిక సంఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో నిపుణులు అంగారక గ్రహ సంచారం ఈ ఘర్షణలకు మరింత ఆజ్యం పోసి చివరికి మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని భయపడుతున్నారు.



Click it and Unblock the Notifications
