Latest Updates
-
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.!
Viral Video : రెండు తలలు 4 కాళ్లు 4 చేతులతో శిశువు జననం..!!
ఉత్తరప్రదేశ్‌లోని ఒక ఆసుపత్రిలో, ఒక మహిళకు రెండు ముఖాలు, నాలుగు చేతులు, నాలుగు కాళ్ళతో ఒక బిడ్డ జన్మించింది. అరుదుగా రెండు తలలతో ఈ పాప పుట్టడంతో ఈ పాపను చూడ్డానికి చుట్టు పక్కల చాలా ప్రాంతాల నుంచి జనాలు ఎక్కువగా తరలివస్తున్నారు. అయితే చికిత్స పొందుతూనే పాప మరిణించడం చాలా బాధాకరమైన విషయం. పుట్టిన కొన్ని గంటలకే ఆ పాప మరణించింది.

కిరాతాపూర్ గ్రామంలో నివాసముంటున్న రమాదేవి అనే మహిళకు ఆదివారం అర్థరాత్రి అక్కడ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో పాపకు జన్మనిచ్చింది. ఆమె గ్రామం నుండి చాలా మంది శిశువును చూడటానికి వచ్చారు, కానీ పాపం పాప పుట్టిన వెంటనే మరణించడంలో ఆ గ్రామంలో విషాధ ఛాయలు అలముకున్నాయి.
పుట్టిన బిడ్డకు మరొక బిడ్డ జాయింట్ అయి ఉండడం వల్లే పాపకు రెండు ముఖాలు, నాలుగు కాళ్లు, నాలుగు చేతులు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. అయితే భర్త రాంఫాల్ మాట్లాడుతూ.. తన భార్య ఒక ప్రత్యేకమైన బిడ్డను కన్నదని చెబుతున్నాడు. పాప పుట్టిన తరువాత ఆరోగ్యంగా లేకపోవడందో ఆసుపత్రిలోని వైద్యులు, నర్సులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే బిడ్డను బయటకు తీసుకెళ్లారు.
పుట్టిన బిడ్డకు సంబంధించిన వ్యక్తులు ఆసుపత్రిలో గొడవకు దిగారు. తరువాత పాప పుట్టిన 5 గంటలకు చనిపోయింది. పాప పుట్టిన తరువాత పాపకు సంబంధించిన వీడియోను రికార్డ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. బిడ్డను పోగొట్టుకోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు.
ఈ పాపకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండు తలలతో, రెండు శరీరాలతో పిల్లలు గతంలో కూడా పుట్టారు. ఇలా పిల్లలు జన్మించడానికి చాలా కారణాలు ఉన్నాయ్. అయితే ప్రస్తుతం జరిగిన సంఘటనలో రెండు శరీరాలు అతుక్కుపోవడం వల్లే ఇలా జరిగిందని వైద్యులు చెబుతున్నారు. అంటే కడుపులో కవలలు పుట్టాల్సిన పరిస్థితిలో రెండు శరీరాలు కడుపులో ఉండగానే అతుక్కోవడం వల్ల ఇలాంటి సంఘటన జరిగింది.
క్రోమోజోముల్లో అసమానతల వల్ల, జన్యు సమస్యల వల్ల కూడా ఇలా పుడతారని పరిశోధకులు చెబుతున్నారు. ఇదంతా గర్భంలో ఉన్నప్పుడే జరగుతుందని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో పర్యావరణ పరిస్థితులు కూడా ఇందుకు కారణమవుతాయ్. కడుపులో ఒక అండం పూర్తిగా విడిపోకుండా ఉన్నప్పుడు కూడా ఇలా జంటగా పిల్లలు పుట్టడానికి అవకాశాలు ఉంటాయ్. వీరినే సియామీస్ కవలలు అని అంటారు.
గర్భం దాల్చే సమయంలో రసాయనాలు, మందుల ప్రభావం, క్రోమోజోముల్లో సమస్యలు, పౌష్టికాహార లోపం, అండం పూర్తిగా విడిపోకుండా సగం విడిపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి గర్భధారణ సమయంలో అన్ని రకాల స్కానింగ్‌లను చేసుకుంటూ వైద్యుల సూచనలను ఫాలో అవ్వాలని సలహా ఇస్తున్నారు.



Click it and Unblock the Notifications