Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
బెడ్రూము భారత్‌లో.. కిచెన్ మయన్మార్‌లో.. విచిత్రమైన ఆ ఇల్లు గురించి తెలుసా?
రెండు దేశాల మధ్య రోజూ ఎందుకు తిరుగుతున్నారన్న ప్రశ్న చాలా మందికి వచ్చే ఉంటుంది. ఎందుకంటే వారి ఇంటి కిచెన్ మయన్మార్‌లో ఉంటే, బెడ్రూము భారత్‌లో ఉంది. ఆ ఇంటి విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రెండు దేశాల మధ్య సరిహద్దులు దాటాలంటే ఎంత పెద్ద ప్రయాసో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని దేశాల మధ్య సరిహద్దుల వద్ద పెద్ద సెక్యూరిటీ ఉంటుంది. అటు నుండి ఇటు, ఇటు నుండి అటు వచ్చి వెళ్లడానికి అనుమతి కావాల్సిందే. పాస్‌పోర్టు, వీసాలు చూపించాల్సిందే. అయితే ఓ ఇంటి వారు మాత్రం దేశాల సరిహద్దు సులభంగా దాటేస్తున్నారు. రోజూ మయన్మార్‌లో భోజనం చేసి భారత్‌కు వచ్చి నిద్రిస్తున్నారు.

రెండు దేశాల మధ్య రోజూ ఎందుకు తిరుగుతున్నారన్న ప్రశ్న చాలా మందికి వచ్చే ఉంటుంది. ఎందుకంటే వారి ఇంటి కిచెన్ మయన్మార్‌లో ఉంటే, బెడ్రూము భారత్‌లో ఉంది. ఆ ఇంటి విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంటి మధ్య నుండి సరిహద్దు రేఖ:
నాగాలాండ్‌లోని మోన్ జిల్లా లుంగ్వా అనే గ్రామంలో ఉంది ఆ ఇల్లు. ఆంగ్ అనే వ్యక్తి ఇంటి మధ్య నుండి భారత్-మయన్మార్ సరిహద్దు రేఖ వెళ్తోంది. అలా ఆ ఇంటి కిచెన్ మయన్మార్ దేశ పరిధిలోకి, బెడ్రూము భారత దేశ పరిధిలోకి వస్తోంది. అలా ఆ ఇంటి సభ్యులు రోజూ మయన్మార్‌లో తింటూ, భారత్‌కు వచ్చి నిద్రపోతున్నారు.

ఈ వింత ఇంటి గురించి అలా తెలిసింది:
ఈ ఇంటి గురించి హిస్టరీ టీవీ ఓ డాక్యుమెంటరీ తీసింది. ఆ గ్రామం భారత్, మయన్మార్ సరిహద్దుల్లో ఉందని చెబుతూ అక్కడి ప్రజల జీవితాల గురించి వెల్లడించింది. వాళ్లు ఎలాంటి జీవితం గడుపుతున్నారో వివరించింది. రెండు దేశాల మధ్య ఎలాంటి సంబంధాలు ఉంటాయి, సరిహద్దు ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఎలాంటి సౌకర్యాలతో జీవితాలు గడుపుతున్నారో వివరించింది ఆ డాక్యుమెంటరీ.
ఆ వీడియోను నాగాలాండ్ విద్య, గిరిజన శాఖ మంత్రి తెమ్జెన్ ఇన్మా ట్విట్టర్‌లో షేర్ చేశారు. దానిని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర రీట్వీట్ చేశారు. సరిహద్దులు ఎంత విచిత్రంగా ఉంటాయనే దానికి ఇది నిదర్శనమని, కృత్రిమమైన వ్యత్యాసాలు అంటూ ఆ ట్వీట్‌కు కామెంట్ పెట్టారు.
ఆనంద్ మహీంద్ర ట్వీట్‌తో ఆ వింత ఇంటి గురించి నెటిజన్లకు తెలిసింది. అలా వారు ఆ ఇంటి గురించి వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇంక్రిడిబుల్ ఇండియా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఆ గ్రామం నాగా తెగ నివాసం:
లోంగ్వా గ్రామంలో కొణ్యాక్ నాగా తెగకు చెందిన వారు ఉంటారు. ఈ గ్రామంలో ఉండే వారికి అటు భారత్, ఇటు మయన్మార్ రెండు దేశాల పౌరసత్వం ఉంటుంది. ఈ గ్రామంలోని స్థానికులు కొందరు భారత్‌లో, మరికొందరు మయన్మార్‌లో వ్యాపారాలు, పనులు చేస్తుంటారు.
హెడ్ హంటర్స్:
ఈ తెగ వారిని భారత్‌లో హెడ్ హంటర్స్ అని పిలుస్తుంటారు. కొన్ని దశాబ్దాల క్రితం తమ శత్రువులుగా భావించిన వారి తలలను నరికి తీసుకొచ్చేవారు ఈ తెగ వారు. తర్వాత శరీరంపై పచ్చబొట్టు వేయించుకునేవారు. అది కొన్ని రోజుల పాటు సాంప్రదాయంగా కొనసాగింది. అలా ఈ తెగ వారికి హెడ్ హంటర్స్ అనే పేరు వచ్చింది. అయితే కాలక్రమంలో ఈ తెగకు చెందిన వారు తమ సాంప్రదాయాన్ని మార్చుకున్నారు. ప్రస్తుతం పనులు చేస్తూ, వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
ఆనంద్ మహీంద్ర పంచుకున్న హిస్టరీ టీవీకి చెందిన ఆ వీడియో ఇక్కడ ఉంది.



Click it and Unblock the Notifications