Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Richest Cities : ఖరీదైన నగరాల జాబితాలో బెంగళూరు..! తరువాత ఢిల్లీ, ముంబై
భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమే అని స్వాతంత్య్రం నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. ప్రపంచ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం, అత్యంత ఎక్కువ జనాభా ఉండడం వల్ల అది సాధ్యం కావడం లేదు. కానీ చాలా రంగాల్లో భారతదేశం మొదటి స్థానాన్ని అందుకుంది. తాజాగా ప్రపంచంలో అత్యంత ఖరీదైన టాప్ 10 నగరాల్లో మన బెంగళూరు చోటు సంపాదించుకుంది. ఇక మొంబై, ఢిల్లీ టాప్ 50 స్థానాల్లో ఉన్నాయ్.
ఖరీదైన నగరాల జాబితా రిపోర్ట్
హెన్లే, పార్ట్‌నర్స్, న్యూ వరల్డ్ వెల్త్ వారు నిర్వహించిన సర్వే ప్రకారం 2024లో అత్యంత ఖరీదైనా నగరాల పై రిపోర్ట్ విడుదలైంది. గత దశాబ్దం నుంచి ముంబై, ఢిల్లీలో మిలియనేర్ల సంఖ్యా బాగా పెరగినట్లు రిపోర్ట్ వెలువడింది. ధనవంతులను మిలియనేర్లు, సెంటీ మిలియనేర్లు, బిలియనేర్లుగా విభజిస్తూ నివేదిక సమర్పించారు.
50 నగరాల్లో ముంబై, ఢిల్లీ
50 ఖరీదైన నగరాల్లో ముంబై 24వ స్థానాన్ని సంపాదించుకుంది. ఒక్క ముంబైలోనే 58,800 మిలియనేర్లు ఉండగా, 236 సెంటీ మిలియనేర్లున్నారు, ఇంకా 29 మంది బిలియనేర్లు ఉన్నారు. మొత్తం లిస్ట్‌లో ఢిల్లీ 37వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఢిల్లీలో 30,700 మిలియనేర్లు ఉండగా 123 మంది సెంటీ మిలియనేర్లు, 16 బిలియనేర్లున్నారు. అత్యంత ఖరీదైన చూడదగ్గ నగరాల్లో బెంగళూరు 9వ స్థానం సంపాదించుకుంది. బెంగళూరులో 13,200 మిలియనేర్లుండగా 42 మంది సెంటి మిలియనేర్లు, 8 మంది బిలియనేర్లున్నారు.

న్యూ యార్క్ టాప్
ప్రపంచంలోనే అమెరికా అభివృద్ధి చెందిన దేశాల్లో టాప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. టాప్ 50 ఖరీదైన నగరాల్లో లిస్టులో అమెరికాకు చెందిన 11 నగరాలు చోటు దక్కించుకున్నాయ్. అన్ని నగరాల్లో న్యూయార్క్ టాప్ స్థానంలో ఉంది. న్యూయార్క్‌లో 3,49,500 మంది మిలియనేర్లు, 744 మంది సెంటి మిలియనేర్లు, 60 మంది బిలియనేర్లున్నారు. న్యూయార్క్ తరువాత 2వ స్థానంలో సాన్ ఫ్రాన్‌సిస్కో సిలికాన్ వాలీ నగరాలున్నాయ్. జపాన్‌కు చెందిన టోక్యో మూడవ స్థానంలో ఉండగా సింగపూర్ నాల్గవ స్థానంలో చోటు దక్కించుకుంది. ఈ నగరాలతో పాటు టాప్ 10లో లండన్, లాస్ ఏంజిల్స్, పారిస్, సిడ్నీ, హాంగ్ కాంగ్, బీజింగ్ కూడా స్థానం సంపాదించుకున్నాయ్.
ప్రపంచంలో చాలా చిన్న దేశాలు అభివృద్ధిలో ముందున్నాయ్. కొందరు భారత దేశాన్ని జపాన్‌తో పోల్చి, జపాన్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది మనమెందుకు అభివృద్ది కాలేకపోతున్నామని ప్రశ్నిస్తారు. భారత దేశ జనాభా 140 కోట్లకు పైగా ఉంటే, జపాన్ జనాభా 12 కోట్లకు పైగా ఉంది. అంటే భారతదేశ జనాభాలో 10 శాతం జనాభా కూడా జపాన్‌లో లేదు. జనాభా తక్కువ ఉంటే అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సమస్యలు, నష్టాలు, ఖర్చు, నిర్మాణాలు, వ్యాపార సంస్థలు అన్నీ తక్కువ సంఖ్యలోనే ఉంటాయ్. భారత దేశం అత్యంత పెద్ద ప్రజాస్వామ్య, అత్యంత జనాభా కలిగిన దేశమే కాకుండా. ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వముంది. ప్రపంచలో ఉన్న అన్ని మతాలు, సంస్కృతిలో భారత్‌లో ఉన్నాయ్. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని భారత్ అభివృద్ధి చెందుతున్న దేశంగా ముందుకు సాగుతోంది. బెంగళూరు టాప్ 10లో చోటు సంపాదించడం గొప్ప హర్షించదగింది. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండడం వల్ల కూడా అవినీతికి ఎక్కువ ఆస్కారం ఉంటోంది. కాబట్టి భారత్ మరో పదేళ్లు అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్నా కూడా ఎన్నో రంగాల్లో, మరెన్నో అంశాల్లో ముందుకు సాగుతుంది.



Click it and Unblock the Notifications