Latest Updates
-
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.!
అసలైన దసరా వేడుక చూడాలంటే.. అక్కడికి వెళ్లాల్సిందే!
మన భారతదేశంలో దసరా పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. చెడుపై మంచి విజయం సాధించింది అనే దానికి ప్రతీకగా ఈ పండుగను చేసుకుంటారు. పది తలలు గల రావణాసురిడిని రాముడు అంతం చేశాడనే కారణంగా దీనికి దసరా అనే పేరొచ్చింది. దసరాతో పాటు దేవి శరన్నవరాత్రులను కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు. అయితే మన దేశంలోని ఏ ఏ నగరాల్లో దసరాను ఎలా నిర్వహించుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణలో బతుకమ్మ:
తెలంగాణలో దసరాకు, బతుకమ్మకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. తొమ్మిది రోజుల పాటు మహిళలందరూ పూలతో బతుకమ్మను పేర్చి, పూజిస్తారు. రోజుకో పేరుతో తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను కొలుస్తారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒక విధంగా దసరా ఉత్సవాలు జరిగితే.. తెలంగాణలో మాత్రం బతుకమ్మ రూపంలో భిన్నంగా ఘనంగా, చూడముచ్చటగా జరుగుతాయి.

కోల్కతాలో దేవి నవరాత్రులు:
దేవి నవరాత్రుల పేరు వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చే రాష్ట్రం పశ్చిమ బెంగాల్. ఈ రాష్ట్రంలో దేవి శరన్నవరాత్రులు ఎంతో భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ప్రతీ వీధి దేవి నామస్మరణతో మార్మోగిపోతోంది. దసరా ఉత్సవాల సందర్భంగా కోల్కతా మొత్తం ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది. ఇక్కడ స్థానిక సాంప్రదాయ నృత్య కేరింతలు ఆకట్టుకుంటాయి.
ఢిల్లీలో రామ్ లీలా ఉత్సవాలు:
దేశ రాజధాని ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో నిర్వహించే దసరా ఉత్సవాలు అన్నిటికంటే అత్యంత వైభవంగా జరుగుతాయి. తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి.. పదోరోజు రామ్ లీలా మైదానంలో రావణాసురుడిని దహనం చేస్తారు. దసరా ఉత్సవాల సందర్భంగా రంగస్థల నటులు రామాయణం నాటాకాన్ని ప్రదర్శిస్తారు. ఈ అత్యంత ఘనమైన వేడుకలను చూసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు, పర్యాటకులు ఢిల్లీకి వెళ్తుంటారు.

మైసూర్ దసరా ఉత్సవాలు:
కర్ణాటకలోని మైసూరు ప్యాలెస్ లో నిర్వహించే దసరా ఉత్సవాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. దసరా పండగ రోజున ప్యాలెస్ ను ముస్తాబు చేసి, అంగరంగ వైభవంగా మైసూరు రాజ వంశస్థులు నిర్వహిస్తారు. దసరా ఉత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల ప్రదర్శనలు, వివిధ పోటీలు నిర్వహించి ఘనంగా జరుపుతారు. ఈ ఉత్సవాలను చూసేందుకు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకతో పాటు దేశం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు.

కులు రఘునాథ శోభ యాత్ర:
అత్యంత వైభవంగా జరిగే దసరా ఉత్సవాల్లో హిమాచల్ ప్రదేశ్ లోని కులులో నిర్వహించే రఘునాథుడి శోభాయాత్ర ఒకటి. ఈ శోభాయాత్రను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. కులు అందాల నడుమ రఘునాథుడి శోభాయాత్ర చూడడానికి ఎంతో అందంగా, అద్భుతంగా ఉంటుంది. ఈ శోభాయాత్ర సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ రకాల పోటీలు పర్యాటకులను, వీక్షకులను ఆకట్టుకుంటాయి.



Click it and Unblock the Notifications