Latest Updates
-
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.!
పిల్లాడి తుంటరి పనికి 4 కోట్ల ఫైన్, వెంగిలి వేలితో అలా చేయడంతో జపాన్ కంపెనీ దావా
పిల్లలు తుంటరి పనులు చేస్తుంటారు. అది చాలా సాధారణం. జపాన్ లోని ఓ కుర్రాడు కూడా అలాగే తుంటరి పని చేశాడు. ఇప్పుడు ఏకంగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాడు. జపాన్ లోని ఓ రెస్టారెంట్ కు వెళ్లిన కుర్రాడు అక్కడ అల్లరి పని చేశాడు. తనతో వచ్చిన మరో వ్యక్తి దానినంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. అదే సమయంలో సుషీర్ చైన్ అనే వ్యాపార సంస్థకు 16 బిలియన్ యెన్ ల నష్టాన్ని తెచ్చిపెట్టింది.

అసలేం జరిగిందంటే?
జపాన్ లోని ప్రధాన కన్వేయర్ బెల్ట్ సుషీ రెస్టారెంట్ చైన్, సుషిరో కు చెందిన అవుట్‌లెట్‌లలో ఒకదానికి ఓ పిల్లాడు వెళ్లాడు. తనతో పాటు మరో వ్యక్తి వచ్చాడు. అక్కడ ఆ పిల్లాడు అల్లరి పని చేశాడు. తనతో పాటు వచ్చిన మరో వ్యక్తి దానినంతా వీడియో తీశాడు.
ఆ వీడియోలో ఏముందంటే.. ఆ పిల్లాడు సోయా సాస్ ను నోట్లో వేసుకున్నాడు. తర్వాత పక్కనే ఉన్న ఓ కప్ ను తీసుకుని దానిని నాలుకతో మొత్తం నాకేసి దాని స్థానంలో పెట్టేశాడు. తర్వాత తన వేలికి లాలాజలం రాసుకుని పక్కనుండి కన్వేయర్ బెల్ట్ పై వెళ్తున్న సుషీ పాసింగ్ ప్లేట్ ను తాకాడు. ఇదంతా ఆ వీడియోలో కనిపించింది. ఈ తుంటరి పని వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది.
రెస్టారెంట్ లో ఆ బాలుడు చేసిన పనితో ఆ రెస్టారెంట్ పై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది. అక్కడి హైజీన్ పై ప్రశ్నలు తలెత్తాయి. అపరిశుభ్రత గురించి ఆందోళన వ్యక్తం అయింది. దీంతో జపాన్ వ్యాప్తంగా 'సుషీ టెర్రరిజం' అనే పదం కూడా ట్రెండ్ లోకి వచ్చింది. 'సుషీ టెర్రరిజం' అంటే రెస్టారెంట్లలో కావాలనే చేసే అపరిశుభ్రమైన ప్రవర్తనగా ప్రజలు అభివర్ణిస్తున్నారు.
దీంతో ఆ కంపెనీ నష్టాలు వచ్చాయి. ఆ బాలుడు చేసిన పనికి ఏకంగా సుషిరో కంపెనీ 16 బిలియన్ యెన్ లు నష్టపోయింది. దీంతో ఆ కుర్రాడిపై సుషిరో కంపెనీ దావా వేసింది. $480,000 USD (రూ. 3,95,86,995) నష్టపరిహారం కట్టాలంటూ కోర్టులో దావా వేసింది. కంపెనీ నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
కంపెనీ ఏం చెబుతోందంటే?
45 సెకన్ల నిడివి గల వీడియోతో తమ మార్కెట్ క్యాపిటలైజేషన్ కు 16 బిలియన్ యెన్ ల పడిపోయిందని కంపెనీ పేర్కొంది. ఈ సంఘటన తర్వాత కంపెనీ అనేక చర్యలు తీసుకుంది. దేశవ్యాప్తంగా 600 కంటే ఎక్కువ ఉన్న ఔట్‌లెట్‌లలో ప్లాస్టిక్ బారియర్స్ ఏర్పాటు చేసింది. ఇందుకోసం 90 మిలియన్ యెన్ లు ఖర్చు చేసింది ఆ సంస్థ.



Click it and Unblock the Notifications