Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చనిపోయిన తాతలా ప్రవర్తిస్తున్న మనవడు.. అమ్మమ్మను భార్యగా, తల్లిని కుమార్తెగా పిలుస్తున్న బాలుడు
చనిపోయిన వ్యక్తులు మళ్లీ పుడుతుంటారని చాలా మంది నమ్ముతుంటారు. పునర్జన్మ నిజమేనని.. మోక్షం పొందే వరకు మళ్లీ మళ్లీ జన్మిస్తూనే ఉంటామని బలంగా విశ్వసిస్తారు. శరీరం శాశ్వతం కాదని, ఆత్మ మాత్రమే శాశ్వతమని చెబుతుంటారు. పాత చొక్కా విడిచేసి కొత్త చొక్కా వేసుకున్నట్లు.. పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరంలోకి ఆత్మ ప్రవేశిస్తుందని అంటారు. ఆత్మ అలా మరో శరీరంలోకి ప్రవేశించినప్పుడు అన్నీ మర్చిపోతుంటామని, గత జన్మల గురించి ఏదీ గుర్తుండదని కూడా అంటారు.

చిన్న వాళ్లు పెద్ద వారిగా ప్రవర్తించడం, పుట్టగానే మాట్లాడటం, పుడుతూనే ఎడవకుండా గత జన్మల గురించి చెప్పడం, చిన్న పిల్లలు పూర్వజన్మల గురించి బోధించడం లాంటి వాటి గురించి చాలా మంది చాలా సార్లు వినే ఉంటారు. అవి ఎంతవరకు నిజాలు అనే దానికి సరైన ఆధారాలు లేవు కానీ.. కొందరు మాత్రం వాటిని బలంగా విశ్వసిస్తారు.
అమ్మమ్మే నా భార్య, అమ్మ నా కూతురు..
తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాలో జరిగింది. ఓ ఎనిమిదేళ్ల బాలుడు పూర్వజన్మ గురించి చెబుతుండటం ఇప్పుడు వార్తల్లో చర్చనీయాంశంగా మారింది. అమ్మమ్మ తన భార్య అని, తల్లి తన కుమార్తె అని, మేన మామలు తన కుమారులంటూ ఆ పిల్లాడు చెబుతుండటం కుటుంబ సభ్యులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
తాత చనిపోయిన 20 రోజులకు జన్మించిన బాలుడు:
2015 జనవరి 9వ తేదీన మనోజ్ మిశ్ర అనే వ్యక్తి చనిపోయాడు. ఉత్తర్ ప్రదేశ్‌లోని రతన్ పుర్‌లో పొలానికి నీరు పారించేందుకు వెళ్లి పాము కాటుకు గురవ్వడంతో మనోజ్ మిశ్ర చనిపోయాడు. మనోజ్ కు భార్య, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. మనోజ్ మిశ్ర చనిపోయే నాటికే వారికి పెళ్లిళ్లు అయిపోయాయి. మనోజ్ మిశ్ర చనిపోయే సమయంలో అతని కుమార్తె రంజన నిండు గర్భంతో ఉంది. మనోజ్ చనిపోయిన 20 రోజులకు ఆమెకు కుమారుడు పుట్టాడు. అతడికి ఆర్యన్ అని పేరు పెట్టుకున్నారు.
అమ్మమ్మ ఇంటికెళ్లి.. తన పేరును మనోజ్‌గా చెప్పిన బాలుడు:
ప్రస్తుతం ఆర్యన వయస్సు 8 సంవత్సరాలు. జూన్ 15వ తేదీన అమ్మమ్మ ఇంటికి వెళ్లిన ఆర్యన్ అప్పటి నుంచి విచిత్రంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. తన తాత పేరు మనోజ్ మిశ్ర కాగా.. అదే తన పేరు అని చెబుతున్నాడు. అమ్మమ్మే తన భార్య అని, తన తల్లిని కుమార్తె అని, మేనమామలను కుమారులను సంభోదించాడు. తన పేరిట బ్యాంకులో డబ్బులు కూడా ఉన్నాయని కూడా చెప్పాడు.
ఈ వార్త విన్న గ్రామస్థులు అంతా ఆ ఇంటి వద్దకు పెద్ద ఎత్తున చేరుకుని ఆ బాలుడి వింత ప్రవర్తన చూసి ఆశ్చర్యపోతున్నారు. కొందరు నిజంగానే పునర్జన్మ ఉందని నమ్ముతున్నారు. తిరిగి తన ఇంటికి రావడంతోనే గత జన్మ మొత్తం గుర్తుకు వచ్చి ఉంటుందని స్థానికులు అనుకుంటున్నారు.



Click it and Unblock the Notifications