Latest Updates
-
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్‌గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా..
Karnataka Polls 2023: బ్రహ్మానందం ప్రచారం చేసిన బీజేపీ అభ్యర్థి గెలిచాడా? ఓడిపోయాడా?
కమెడియన్ బ్రహ్మానందం అనగానే పేరుమోసిన నటుడు గుర్తొస్తాడు. తన హావభావాలతోనే హాస్యాన్ని పుట్టించగల నైపుణ్యమున్న నటుడు ఆయన. వివాదాలకు, రాజకీయాలకు ఎప్పుడూ దూరంగానే ఉంటూ వస్తున్నారు. అయితే బ్రహ్మానందం ఎప్పుడైన ఎన్నికల ప్రచారం చేయడం చూశారా. కర్ణాటక ఎన్నికల వేళ బీజేపీ అభ్యర్థి, కర్ణాటక వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ కె. సుధాకర్ తరఫున బ్రహ్మానందం ప్రచారం చేశారు. కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్ నియోజకవర్గం నుండి కె. సుధాకర్ పోటీ చేస్తున్నారు.

ఇవాళ కర్ణాటక ఎన్నికల ఓట్ల లెక్కింపు. మరి బ్రహ్మానందం ప్రచారం చేసిన ఆ అభ్యర్థి గెలిచాడా లేదా ఓడిపోయాడా.. అక్కడి స్థానిక ఓటర్లను బ్రహ్నానందం ఎంత వరకు ప్రభావితం చేశారా.. ఆయన ప్రచారం ఎన్ని ఓట్లు రాబట్టింది. గత ఎన్నికల్లో పని చేసిన మ్యాజిక్ ఇప్పుడు చేసిందా లేదా తెలుసుకోవడం తెలుగు వారికి కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది.
చిక్‌బళ్లాపూర్ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు:
చిక్‌బళ్లాపూర్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి, బ్రహ్మానందం ప్రచారం చేసిన అభ్యర్థి, వైద్యారోగ్యశాఖ మంత్రి కె. సుధాకర్ ఈసారి ఓడిపోయారు. బ్రహ్మానందాన్ని తీసుకువచ్చి ప్రచారం చేయగా ఆ వ్యూహం ఈసారి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ ఈశ్వర్ అయ్యర్ గెలుపొందారు. మొదటి నుండి ఆధిక్యంలోనే కొనసాగిన కాంగ్రెస్ అభ్యర్థి చివరికి విజయం అందుకున్నారు.
బ్రహ్మానందంతో ప్రచారం ఎందుకంటే?
చిక్‌బళ్లాపూర్ ఆంధ్రా సరిహద్దు ప్రాంతం. ఇక్కడ నివసించే తెలుగు ఓటర్లు అభ్యర్థి భవితవ్యాన్ని నిర్ణయిస్తారు. హిందూపురానికి, చిక్‌బళ్లాపూర్ కు మధ్య దూరం కేవలం 80 కిలోమీటర్లు మాత్రమే. సరిహద్దు ప్రాంతం కావడంతో చిక్‌బళ్లాపూర్ ప్రాంతానికి వెళ్లి చాలా మంది తెలుగు వాళ్లు స్థిరపడ్డారు. అక్కడి తెలుగు వాళ్లను ఆకర్షించడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని బీజేపీ అభ్యర్థి సుధాకర్ వదులుకోదల్చుకోలేదు.
డాక్టర్ కె.సుధాకర్ కు తెలుగు సినీ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నందమూరి కుటుంబంతో ఆయన చాలా సన్నిహితంగా ఉంటారు. తారక రత్న బెంగళూరులోని ఆస్పత్రిలో ఉన్నప్పుడు కూడా వైద్యారోగ్యశాఖ మంత్రి కె.సుధాకర్ అక్కడే ఉండి అన్నీ చూసుకున్నారు. నందమూరి కుటుంబసభ్యులను ఆహ్వానించడంతో పాటు వాళ్లు ఉన్నంత వరకు అక్కడే ఉన్నారు.



Click it and Unblock the Notifications
