Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఓటమి, పేదరికం, సమస్యలపై చాణక్యుడు ఏమి చెప్పాడంటే..?
ఎన్నేళ్లైనా సరే చాణక్య నీతులకు ఉన్న విలువ అస్సలు తగ్గదు. మరో వెయ్యేళ్ల వరకు కూడా చాణక్య నీతులకు అంతే ప్రాధాన్యం వుంటుంది. చంద్రగుప్త మౌర్య సామ్రాజ్యంలో మహారాజుకే సలహాదారుగా వ్యవహరించిన పండితుడి చాణక్యుడు తన జీవితంలో ఎన్నో విలువైన సూత్రాలను ప్రజలకు అందించాడు. ఈ సూత్రాలను గత వందల ఏళ్ల నుంచి ఎంతో మంది తమ నిత్యజీవితంలో ఆచరణలో పెడుతున్నారు. సమాజంలో ఎలా ఉండాలి, డబ్బు విషయంలో ఎలా వుండాలి. స్త్రీలు, వివాహం, వ్యాపారానికి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయాలను మనతో పంచుకున్నారు. చాణక్య నీతి శాస్త్రం జీవితంలో ఎదుగుదలకు చాలా సహకరిస్తుంది.
డబ్బు విషయంలో చాణక్యుడు చాలా జాగ్రత్తలు చెప్పాడు. పేదరికానికి సంబంధించి చాణక్యుడు ఎన్నో హెచ్చరికలను చేశాడు. పేదరికం, ఆర్థికసమస్యలు, కష్టాలపై చాణక్యుడు ఏమి చెప్పాడో ఓ సారి తెలుసుకుందాం. మీరు వీటిని మీ నిత్యజీవితంలో ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించండి.
బద్దకం వదలాలి
మనిషికి అతిపెద్ద శత్రవు బద్దకమేనని అంటాడు చాణక్యుడు. జీవితంలో ఏదైనా సాధించాలంటే బద్దకం వదలాలని చెబుతాడు. బద్దకం వదలని వ్యక్తిని ఎవ్వరూ మార్చలేరని అంటాడు. బద్దకంతో మంచి అవకాశాలను కోల్పోతారు. ఆర్థిక సమస్యలను కూడా ఎక్కువగా ఎదుర్కొంటారని చాణక్యుడు హెచ్చరిస్తున్నాడు.
శుభ్రత ముఖ్యం
శరీరాన్ని, బట్టలను శుభ్రంగా వుంచుకోని వారి వద్దకు లక్ష్మీదేవి రాదని చాణక్యుడు చెబుతాడు. రోజూ తప్పనిసరిగా స్నానం చేయాలని అంటాడు. మురికిగా వుండే వారి తాము రోగాలను తెచ్చుకోవడమే కాకుండా ఇతరులకు ఆరోగాలను అంటి స్తారని చాణక్యుడు చెబుతాడు. ఇలాంటి వారు ఎప్పటికీ పేదరికంలోనే మగ్గుతారని చాణక్య నీతి చెబుతుంది.
మితంగా భోజనం చేయాలి
ఆహారానికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే వారిని చాణక్యుడు హెచ్చరిస్తున్నాడు. అవసరానికి మించి ఆహారం తినవద్దని చెబుతున్నారు. కడుపులో ఎంత పడితే అంత మాత్రమే ఆహారం తీసుకోవాలంటాడు. సమయానికి మాత్రమే భోజనం చేయలని సూచిస్తున్నాడు. ఎవరి ధ్యానమైతే ఎప్పుడూ ఆహారంపైనే వుంటుందో అలాంటి వారి వద్ద డబ్బు వుండదని అంటున్నాడు.

ఇతరుల గురించి చెడాగా వద్దు
కొందరు ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతుంటారు. అలాంటి వారు ఎప్పటికీ పైకి రాలేరని చాణక్యుడు హెచ్చరస్తున్నాడు. ఎదుటి వారిపై తప్పుగా మాట్లాడేవారితో వుండవద్దని అంటున్నాడు. అలాంటి వారి వద్దకు లక్ష్మీదేవి రాదని, పేదరికంలో వుంటారని అంటున్నాడు. ఇలాంటి వారితో స్నేహం చేస్తే వ్యక్తిగతంగా కూడా ఎదగలేమని చాణక్యుడు చెబుతున్నాడు.
ఎక్కువగా నిద్రపోవద్దు
పగలు పడుకునే వారు దారిద్యంలోకి వెళ్తారని చాణక్యుడు చెబుతున్నాడు. ఎవరైతే ఉదయం సూర్యుడు ఉదయించినప్పటి నుంచి సూర్యాస్తమయం వరకు మేలుకొని పనులు చేసుకుంటారో అలాంటి వారికే లక్ష్మీదేవి కటాక్షం వుంటుందని చెబుతున్నాడు. ఉదయం నుంచి రాత్రి వరకు పడుకునే వారికి లక్ష్మీదేవి అనుగ్రహించదను చెబుతున్నాడు. ప్రతీ రోజూ క్రమం తప్పకుండా ఉదయాన్నే నిద్ర లేవాలని చాణక్య నీతి చెబుతోంది.
వ్యర్ధ ఖర్చులు
జీవితంలో డబ్బు చాలా ముఖ్యమైంది. డబ్బును ఆదా చేసుకోవాలని చాణక్యుడు చెబుతున్నాడు. ఆలోచించకుండా డబ్బు ఖర్చు చేస్తే భవిష్యత్తులో దారిద్య్రాన్ని ఎదుర్కొనాల్సి వస్తుందని అంటున్నాడు. డబ్బు లక్ష్మీ దేవి కాబట్టి దానిని పూజింజి గౌరవించి పద్ధతిగా ఖర్చు చేయాలని చాణక్యనీతి చెబుతోంది.



Click it and Unblock the Notifications