Latest Updates
-
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటిస్తే..విజయం వద్దన్నా వస్తుంది..
మనం లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తరువాత ఎన్ని సమస్యలు వచ్చినా ఆ లక్ష్యం నుంచి తప్పించుకోకుండా కృషి చేయాలి. అప్పుడు మాత్రమే లక్ష్యం వైపు విజయంతో వెళ్తాము, ఆ సమయంలో అదృష్టం కూడా వెంట కలిసి వస్తుందని చాణక్య నీతి చెబుతుంది.

1. ప్రతీ ఒక్కరితో వాదించవద్దు. మూర్ఖులతో ముఖ్యంగా అస్సలు వాదించవద్దు. మూర్ఖుడుకి ఎన్ని చెప్పినా తన విధానాలను మార్చుకోడు. మూర్ఖుడిని ఒప్పించే ప్రయత్నంగానీ వాదించడం గానీ చేయవద్దంటాడు చాణక్యుడు. అలా చేస్తే సమయం వృధా తప్ప ఏమి లాభం ఉండదు.
2. సమస్యలు చాలా ఉంటాయ్. కానీ మూడు సమస్యలైనా అప్పు, శత్రువు, వ్యాధిని ఎప్పుడూ పట్టించుకోకుండా ఉండవద్దని చాణక్యుడంటాడు. వీలైనంత త్వరగా అప్పు, శత్రువు, వ్యాధులను తగ్గించుకోవాలి. లేదంటే వాటివల్ల సమస్యలను మరింత పెదదయ్యే ప్రమాదం ఉంది.
3. జీవితం ఎన్నో విషయాలను నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. చాల మంది తమ జీవితంలో దెబ్బతిన్న తరువాతే నేర్చుకోవడం ప్రారంభిస్తారు. అలా కాకుండా ఇతరుల వైఫల్యాల నుంచి నేర్చుకోవడం ప్రారంభించాలి.
4. పుట్టగానే ఎవ్వరూ గొప్పవారు కారు. భూమిపైకి రాగానే అన్ని తెలిసినవారైపోరు. ఎన్నో విషయాలను నేర్చుకోవలసి వస్తుంది. అలా పుట్టగానే గొప్పవాళ్లు అయిన వారు ఎవ్వరూ లేరు మనషి తానంతట తానే నేర్చుకోవలసి ఉంటుంది. తాను చేసిన కృషి వల్లే గొప్పవాడౌతాడు కానీ పుట్టుక కారణంగా కాదు.
5. అవమానం జరిగిన చోట ఉండవద్దు. గౌరవం దక్కిన చోటే ఉండాలి. అవమానం ఎదురైతే వెంటనే అక్కడి నుంచి నిష్క్రమించాలని చాణక్య నీతి చెబుతుంది.
6. దేవుడు బయట ఎక్కడా ఉండడు. శరీరంలోనే దేవుడు నివసిస్తాడు. దేహమే దేవాలయం, దేహంలోనే ఆత్మ రూపంలో దేవుడు ఉంటాడు.
7. కేవలం చేసే గొప్పపనుల వల్ల గొప్పవాడౌతారు గానీ గొప్ప స్థానంలో ఉండగానే ఎవ్వరూ గొప్పవాళ్లు కారని చాణ్యకుడు చెబుతాడు.
8. ముందు ఓ మాట వెనక ఓ మాట వాట్లాడేవారి మాటలు అస్సులు నమ్మవద్దని ఛాణక్య నీతి చెబుతోంది. అలాంటి వారితో స్నేహాం చేయకుండా దూరంగా ఉండడమే మంచిది. మీ వెనక మీ గురంిచ చెడుగా చెప్పే స్నేహితులను వదులుకోవడమే మంచిది. లేదంటే మీకు సమస్యలు ఎదురౌతాయని చాణక్య నీతి చెబుతుంది.
9. జీవితంలో యవ్వన దశ చాలా కీలకమైంది. ఆ దశలో మంచి అలవాట్లు అలవర్చుకుంటే జీవితంలో ఎన్నో విజయాలు సాధించవచ్చు. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి, వ్యసనాలకు దూరంగా ఉండాలని చాణ్యకుడు చెబుతాడు.



Click it and Unblock the Notifications
