Latest Updates
-
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.!
Chanakya Neeti : వీటిని మార్చడం ఎవ్వరి వల్లా సాధ్యం కాదు..?
వందల ఏళ్ల నుంచి చాణక్య నీతులకు చాలా ప్రాముఖ్యం వుంది. మౌర్య రాజ్య స్థాపణలో చాణక్యుడు కీలకపాత్ర పోషించాడు. మౌర్యుల మొదటి రాజు చంద్రగుప్త మౌర్యుడికి సలహాదారుగా వ్యవహరించాడు. ప్రపంచ వ్యాప్తంగా చాణక్య నీతులకు కోట్ల మంది అనుసరిస్తాడు. మీకోసం కొన్ని చాణక్య నీతులను అందిస్తున్నాం.
చాణక్య నీతులు
పండితులు గ్నానులను చాణక్యుడు రాజులతో పోల్చాడు. వారికి అమితమైన గౌరవాన్ని తాను ఎప్పటికీ ఇస్తానని పేర్కొన్నాడు. పండితులు అన్ని చోట్లా గౌరవించబడతారని అంటాడు.

సత్యానికి చాలా శక్తి ఉందని అంటాడు చాణక్యుడు. ఈ లోకంలో దాదాపు అన్ని విషయాలు సత్యంపైనే ఆధారపడి ఉన్నాయన్నాడు. సత్యం లేకపోతే ప్రపంచం కూడా ముందుకు వెళ్లదని చెబుతాడు. ప్రకృతి మొత్తం సత్యానికి స్పందిస్తుందని అంటాడు.
తొందరపాటులో ఏ నిర్ణయాలు తీసుకోవద్దని చాణక్యుడు బోధిస్తాడు. ఏ విషయాన్నైనా విమర్శనాత్మకంగా చూడాలని చెబుతాడు. శాశ్వకానివాటి వెంట పరుగెత్తవద్దని అంటాడు. విలువైని చాలా అరుదుగా వస్తాయ్. వాటిని గుర్తించి జీవితం సార్ధకం చేసుకోవాలని చెబుతాడు.
శారీరక బలం కంటే మానసిక బలం ప్రాముఖ్యతను చాణక్యుడు వివరిస్తాడు. సింహం కన్నా నక్క తెలివైందని దానికి ఉదాహరణగా చెబుతాడు. జీవితంలో అన్ని పరిస్థితిలో తెలివిగా మసులుకోవాలని అంటాడు.
ఒకే విషయాన్ని ఎవరికి వారు తమ సామర్ధ్యంతో అర్ధం చేసుకుంటారని చాణక్యుడు చెబుతాడు. బ్రాహ్మణుడికి దేవుడు అగ్నిలో కనిపిస్తాడు, మహారుషికి అతని గుండెలో కనిపిస్తాడు, బుద్దిహీనులకు దేవుడు విగ్రహంలో కనిపిస్తాడు, అదే నీతిమంతులకు ప్రతీ చోట దేవుడున్నాడని అంటాడు.
ఆస్ట్రాలజీపై చాణక్యుడిికి అపారనమ్మకం వుంది. పుట్టకముందే వ్యక్తి జీవితం మొత్తం రాసి ఉంటుందని, దాని ప్రకారమే తల్లికడుపులోనుండి బయటకు వచ్చి బ్రతికి మరణిస్తాడని చాణక్యుడు చెబుతాడు.
ప్రళయం వచ్చినప్పుడు సముద్రాలు కూడా వాటి స్థితిని మార్చుకొంటాయ్ అలాగే నీతివంతులైన వారు ఎన్ని కష్టాలు వచ్చినా తమ వ్యక్తిత్వాన్ని మార్చుకోరని చాణక్యుడు చెబుతాడు.
విశ్వంలో చాలా విషయాలను మార్చలేమని చాణక్యుడు అంటాడు. దీనికి ఉదాహరణలు ఇస్తాడు. ఎంత పండితుడైనా రాజుకు దీర్ఘాయుష్షును ఇవ్వలేడని అంటారు.
ఓర్పు జీవితంలో అడ్డంకులను ఎదుర్కోవడానికి సహాయపడుతుందని అంటాడు. విజయం సాధించడానికి సమయం, శ్రద్ధ కూడా చాలా ముఖ్యమని చాణక్యుడు చెబుతాడు.
ఏదైనా సరైందని అనిపిస్తే దానికోసం బలంగా నిలబడ్డానికి వెనకాడవద్దని చాణక్యుడు అంటాడు. ఎన్ని ప్రతిఘటనలు వచ్చినా తీరు మార్చుకోకుండా అలాగే ఉండాలని అంటాడు.
కొన్ని విషయాల్లో క్షమించడానికి వెనకాడవద్దంటాడు. క్షమించడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుందంటాడు.
వ్యక్తిగతంగా ఎదగడానికి, సమాజం అభివృద్ధి చెందడానికి చదువు, గ్నానం చాలా ముఖ్యమైందని చెబుతాడు.
వ్యూహాత్మకంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని చాణక్యుడు చెబుతాడు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాలంటాడు చాణక్యుడు.
కోరికలు, వ్యామోహాన్ని తగ్గించుకోవాలని చాణక్య నీతి చెబుతుంది. పంచేంద్రియాలను అదుపులో పెట్టుకొని వ్యవహరించాలని చెబుతాడు.
సమాజంలో మన పాత్ర ఏంటనే విషయంపై స్పష్టత తెచ్చుకొని దాన్ని నెరవేర్చాలని చాణక్యుడు చెబుతాడు.
విశ్వసనీయత పారదర్శకత పెంచుకోవడం చాలా అవసరమంటాడు చాణక్యుడు. సమాజంలో నిజాయితీగా ఉంటే వారి పట్ల విశ్వసనీయత పెరుగుతుందని, దాంతో గౌరవం దక్కుతుందని చాణక్యుడు చెబుతాడు.
జీవితంలో వేరేవాళ్లు చేసిన తప్పుల నుంచే నేర్చుకోవాలని అంటాడు. అలా కాకుండా ప్రతీదీ అనుభవం నుంచి నేర్చుకోవాలంటే మనిషికి ఒక జీవిత కాలం సరిపోదని చాణక్యుడు చెబుతాడు.
ఏదైనా పనిని మొదలుపెడితే మధ్యలో ఆపకూడదని చాణక్యుడు అంటాడు. మొదలుపెడితే అది పూర్తయ్యేంతవరకు పనిచేయాలను చాణక్యుడు చెబుతాడు.



Click it and Unblock the Notifications
