Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Chanakya Niti: ఈ ప్రాంతాలకు లక్ష్మీదేవి తనకు తానే వస్తుంది, సంపదను సౌభాగ్యాన్ని ఇస్తుంది
చాణక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడు, గొప్ప వ్యూహకర్త. ఆయన మనిషి జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. తన బోధనల సమాహారమే చాణక్య నీతి. ఆయన చెప్పిన ఎన్నో సూచనలు, సలహాలు పాటించి జీవితంలో విజయం సాధించవచ్చు. అవి ఇప్పటికీ ఎప్పటికీ ఆచరణీయమే. చాణక్య నీతిలో అనేక విషయాల గురించి చెప్పాడు ఆచార్యుడు.

ఆచార్య చాణక్యుడు మతం, దౌత్యం, రాజకీయాలు, విద్యలో గొప్ప పండితుడు. ఆయన తన నీతి శాస్త్రం గ్రంథంలో మానవ జీవితం గురించి అనేక విషయాలు చెప్పాడు. వాటిని అనుసరించడం ద్వారా మంచి జీవితాన్ని సాగించవచ్చు. జీవితంలో విజయం గురించి ప్రస్తావిస్తూ చాణక్యుడు పలు సూచనలు అందించాడు.
జీవితం సాఫీగా, ఆనందంగా, సౌకర్యంగా సాగడానికి డబ్బు చాలా ముఖ్యం. డబ్బు సంపాదించుకోవాలన్నా, సంపద సృష్టించుకోవాలన్నా లక్ష్మీ దేవి కటాక్షం ఉండాల్సిందే. ఈ ప్రాంతాలకు లక్ష్మీదేవి తనకు తానే వచ్చి సంపదను, సౌభాగ్యాన్ని అందిస్తుందని ఆచార్య చాణక్యుడు చెప్పాడు.
కష్టపడి పని చేసే వారి దగ్గరికి:
కష్టపడి పని చేసే వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉంటుందని ఆచార్య చాణక్యుడు చెప్పుకొచ్చాడు. కష్టపడి పని చేసే వారికి డబ్బు విలువ తెలుస్తుందని అలాంటి వారి వద్ద డబ్బు ఎక్కువ కాలం నిలువ ఉంటుందని చెప్పాడు ఆచార్యుడు.
శ్రమించే వారిపై లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నట్లు వివరించాడు చాణక్యుడు. కష్టే ఫలి అనే నానుడి దాని నుండే వచ్చిందని అన్నాడు ఆచార్యుడు.
గొడవలు:
భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. కానీ ఆ గొడవలు నిరంతరం ఉంటే ఆ ఇంట్లో ప్రశాంతత ఉండదు. నిత్యం కలహాలు జరిగే ఇంట్లో ఉండాలని ఎవరైనా కోరుకుంటారా? అలాగే లక్ష్మీ దేవి కూడా అలాంటి ఇంట్లో ఉండటానికి ఇష్టపడదు.
ఎంత కష్టపడుతున్నాం, ఎంత శ్రమిస్తున్నాం అనే దాంతో సంబంధం లేకుండా ఇంట్లో ప్రశాంతత లేకపోతే, ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టదు. బదులుగా మంచి వాతావరణం, మానసిక ప్రశాంతత, కుటుంబసభ్యుల మధ్య సాన్నిహిత్యం, సత్సంబంధాలు ఉంటే అక్కడికి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుందని చాణక్యుడు చెప్పాడు.
మోసం:
మూర్ఖులు, మోసపూరిత వ్యక్తులతో సంబంధం ఎక్కువ కాలం కొనసాగదు. వారు పూర్తిగా స్వార్థపూరితులు అయి ఉంటారు. ఎప్పుడు ఎవరి తరఫున నిలుస్తారో, ఎవరికి వ్యతిరేకంగా పోరాడతారో, ఎప్పుడు ఎవరితో శత్రుత్వం ఉంటుందో వారికి కూడా సరైన అవగాహన ఉండదు. అలాంటి వారి ఇంటికి లక్ష్మీ దేవి రాదు.
బదులుగా సత్సంబంధాలు, మంచి నడవడిక, వ్యక్తిత్వం ఉన్న ఇంట్లోకి లక్ష్మీ దేవి వస్తుంది. అలాంటి ఇంటిపై లక్ష్మీ దేవి కటాక్షం ఉంటుంది.
Disclaimer: ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications