Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
Chanakya Niti : అతిగా ఆలోచించడం పై చాణక్యుడు ఏం చెప్పాడంటే..?
అతి ఆలోచనపైన చాలా మందికి సరైన అభిప్రాయం వుండదు. అతి ఆలోచనను ఎక్కువగా వుండడం వల్ల మనం ఏమీ చేయలేని స్థితిలోకి వెళ్తాము. మన బుర్ర మొత్తం ఎక్కువ ప్రశ్నలు, సమాధానాలతో నిండిపోయి వుంటుంది. ఏ నిర్ణయాన్నీ తీసుకోలేక గందరగోళంగా వుంటుంది. ప్రస్తుతం ఈ అతి ఆలోచనను తగ్గించుకోమని మానసిక నిపుణులు మనకు సలహా ఇస్తున్నారు. కానీ వందల ఏళ్ల క్రితమే చాణక్యుడు మనకు ఈ విషయాన్ని చెప్పాడు. అతి ఆలోచనపై చాణక్యుడు ఏమి చెప్పాడో తెలుసుకుందాం.

అందరూ జీవితంలో ఎన్నో సాధించాలని అనుకుంటారు. కానీ వారిలో కొందరు మాత్రమే దీని కోసం ప్రయత్నిస్తారు. జీవితం ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. ఎవరికైనా సమయం వచ్చిందంటే నేర్చుకోవాల్సిందే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎన్నో విషయాల్లో అందరితో మనం పోల్చుకుంటాం. ఈ పోల్చుకోవడం వల్ల మనలో అశాంతి పెరిగిపోతుంది. రాత్రీ పగలు లేకుండా ఆలోచిస్తాం. ఎంత డబ్బు ఉన్నా మనసుకు తృప్తి అనేది లభించకుండా వుంటుంది. మనం చేసే ప్రతీ పని మనఆలోచన కారణంగానే వుంటుంది. పుట్టుక చావు ప్రతీ ఒక్కరి జీవితంలో ఒంటరిగానే వస్తుంది అని చాణక్యుడు చెబుతాడు. స్వర్గానికైనా ఒంటరిగానే వెళ్తాం, నరకానికైనా ఒంటరిగానే వెళ్తాం. ఈ ప్రపంచంలో మనం ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా వెళ్తాం. మన జీవితంలో వచ్చిన వారంతా మన లైఫ్‌లో ఒక భాగం మాత్రమే. మీరో రోజులో ఎంత కష్టపడినప్పటికీ ఈ ప్రపంచాన్ని మీరు ఇంప్రెస్ చేయలేరనే సత్యాన్ని గుర్తించాలి. మిమ్మల్ని మీరు ఇష్టపడండి. మీకు మీరే మొదటి బెస్ట్ ఫ్రెండ్. ఏదైనా ఓటమి ఎదుర్కొంటే మీకు మీరు ధైర్యం చెప్పుకోండి. మీకు మీరు సంతోషంగా వుండడానికి మార్గాలు వెతుక్కుంటే చాలు.
మనం ఏం చేస్తున్నా సమయం గడిచిపోతూనే వుంటుంది. మనిషి అధిగమించలేనిది సమయం మాత్రమేనని మనం గర్తించాలి. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే ఒక సాధారణ మనిషి కూడా అసాధారణంగా ఎదగగలడు. అతిగా ఆలోచించడానికి కారణం మనం చేసిన చిన్న తప్పుల గురించి ఆలోచన మొదలుపెట్టడమే. గతంలో చేసిన తప్పులను పట్టుకొని నేను ఇంక ఏమీ చేయలేను అనే భావనలోంచి బయటకు రావాలి. ఆలోచనలకు అంతు వుండదు. మన కథ ముగిసే వరకు మనం ఆలోచిస్తూనే వుంటాం. కాలమే ప్రతీ దానికీ సమాధానం చెబుతుంది. మనం చేసే పనులను బట్టే కాలం మనకు సమాధానాలను చెబుతుంది. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. ఇది అర్ధం చేసుకున్న వారి జీవితం చాలా ప్రశాంతంగా వుంటుంది. ఎలాంటి సమస్య వచ్చినా నేను ఎదరిస్తాను అని మీమీద మీకు నమ్మకం వున్నప్పుడు ఎవ్వరూ ఏమీ చేయలేరు. మీరు కష్టపగానే ఫలితం రాదు. విత్తనం వేయగానే మొలకెత్తదు, దానికి ఓపిక కావాలి. అతిగా ఆలోచించడం వల్ల ఎటువంటి ప్రయోజనం వుండదు. చిన్న సమస్యను బూతద్దంలో పెట్టి పెద్ద సమస్యగా మార్చుకోవద్దు.
చాలా మంది గతంలో వున్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. భవిష్యత్తులో జరగని వాటి గురించి ముందుగానే అతిగా ఊహించుకుంటారు. ఇలాంటి వారికి గరించి చాణక్యుడు.. గతం గురించి ఆలోచించి బాధపడొద్దు, కేవలం వర్తమానం గరించి మాత్రమే ఆలోచించాలి, గతం గత: అని అంటాడు. జరిగిపోయిన గతాన్ని అనువంతైనా మనం మార్చలేము. గతంలో చేసిన తప్పులను మళ్లీ రిపీట్ కాకుండా చూసుకోవాలి. గతం గురించి ఆలోచించడం వల్ల మీకు ఒక శాతం కూడా ఉపయోగం వుండదు. మీరు అనుకున్నది సాధిస్తారు. మీ లైఫ్ లో ఏమి అనుకుంటున్నారో దాన్ని గట్టిగా కోరుకోండి.
ప్రతీ రోజూ మనకు ఎన్నో ఆలోచనలు వుంటాయ్. ఒక పనిచేస్తున్నప్పుడు వేరే దాని గురించి ఆలోచించవద్దు. దీని వల్ల మీ సమయమే వృధా అవుతుంది. మీకు అనుకున్న పనుల్ని కూడా పూర్తిచేయలేరు. ఈ డిష్ట్రాక్షన్‌లకు ప్రధాన కారణం మీ మొబైల్ ఫోన్ కావచ్చు. కాబట్టి దాన్ని కంట్రోల్‌లో పెట్టాలి.



Click it and Unblock the Notifications