Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
Chanakya Niti: చాణక్యుడు చెప్పినట్లు ఈ చేస్తే ధనవంతులు అయిపోతారు
ఎవరైనా ధనవంతులు కావాలంటే కొన్ని పనులు చేయాలని, అవి ఎవరినైనా ధనవంతులను చేస్తాయని చెప్పాడు చాణక్యుడు. ఆచార్యుడు చెప్పిన ఆ సీక్రెట్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ధనవంతులు కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఆ కలను నెరవేర్చుకోవడానికి చాలా మంది పగలు, రాత్రి కూడా కష్టపడుతుంటారు. అయితే అందులో కొంతమంది మాత్రమే తమ కష్టానికి ఫలితాలు అందుకుంటారు. అందులో కొంత మంది నిరాశ చెందుతుంటారు.
లక్ష్యం కోసం కష్టపడటం ఎంత ముఖ్యమో.. వ్యూహరచన కూడా అంతే ముఖ్యం. సరైన వ్యూహం లేకుండా లక్ష్యాన్ని చేరుకోలేమని చెబుతాడు ఆచార్య చాణక్యుడు.

ఎవరైనా ధనవంతులు కావాలంటే కొన్ని పనులు చేయాలని, అవి ఎవరినైనా ధనవంతులను చేస్తాయని చెప్పాడు చాణక్యుడు. ఆచార్యుడు చెప్పిన ఆ సీక్రెట్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కృషి ముఖ్యం:
ధనవంతులు కావాలన్న ఆలోచనతో మాత్రమే ధనవంతులు కాలేమని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. కష్టపడి పనిచేయడం, శ్రమించడం వల్లే ధనవంతులు అవుతారని చెప్పాడు ఆచార్యుడు. అలాగే కష్టపడి పని చేసి ధనవంతులు అయితే సంతృప్తి ఎక్కువగా ఉంటుందన్నాడు.
అందుకే కష్టపడి పని చేయడానికి ఎప్పుడూ భయపడొద్దని చాణక్యుడు సూచించాడు. కష్టపడి పని చేసే వ్యక్తులు ఎప్పుడూ నిరాశ నిస్పృహలకు లోనుకారు. ఒకరోజు కాకపోయినా ఒకరోజు వారు తప్పకుండా విజయం సాధిస్తారని చాణక్యుడు చె్పాడు.
క్రమశిక్షణ పాటించాలి:
ధనవంతుడు కావడానికి కష్ట పడి పనిచేయడంతో పాటు క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యమని చెప్పాడు చాణక్యుడు. క్రమశిక్షణతో కూడిన జీవనశైలి మిమ్మల్ని విజయపథంలోకి నడిపిస్తుందన్నాడు.
అందుకే ప్రతి పనిని సమయానికి పూర్తి చేయాలని, ఏ పనిని రేపటికి వాయిదా వేయవద్దని సూచించాడు. క్రమశిక్షణతో కష్టపడే వ్యక్తి విజయతీరాలకు చేరకుండా ఏ శక్తీ ఆపలేదని ఆచార్య చాణక్యుడు చెప్పుకొచ్చాడు.
సవాళ్లకు భయపడొద్దు:
ఏ వ్యక్తి కూడా రిస్క్ తీసుకోవడానికి భయపడకూడదని చాణక్యుడు చెప్పాడు. రిస్క్ లు, సవాళ్లు స్వీకరించడానికి ఏమాత్రం వెనకడుగు వేయకూడదన్నాడు. సవాళ్లను స్వీకరించలేని వారు నత్తవలె నెమ్మదిగా అభివృద్ధి చెందుతారని, సవాళ్లు, రిస్క్ లు స్వీకరించినప్పుడే విజయం త్వరగా అందుతుందని చెప్పాడు.
అందుకే విజయం సాధించడానికి, ధనవంతులు కావడానికి జీవితంలో రిస్క్ లు తీసుకోవలసి ఉంటుందని, వాటిని కచ్చితంగా ఎదుర్కోవాలని చెప్పాడు చాణక్యుడు.
సమాజం గురించి ఆలోచన:
మనతో పాటు మన చుట్టు ఉన్న వాళ్లు కూడా అభివృద్ధి చెందాలని అనుకున్న వారే జీవితంలో త్వరగా పైకి వస్తారని, వారే గొప్ప ధనవంతులు అవుతారని చాణక్యుడు చెప్పాడు.
లక్ష్మీ దేవి స్వార్థపరుల వద్ద ఎక్కువ కాలం ఉండదని చెప్పాడు ఆచార్య చాణక్యుడు. అందుకే ప్రతి ఒక్కరు ఎదుటి వారి గురించి, సమాజం గురించి ఆలోచిస్తూ ఉండాలని చెప్పాడు ఆచార్యుడు.



Click it and Unblock the Notifications