Latest Updates
-
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు!
Chandrayaan 3: ప్రధాని, అంబాని అయినా సరే శ్రీవారి ఆశీస్సులు కావాలి, చంద్రాయన్ 3 కోసం తిరుమలలో ఇస్రో టీం..
Chandrayaan 3 : తిరుమలలో ఇస్రో శాస్త్రవేత్తలు-చంద్రయాన్ 3 ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలు అయ్యింది. ఎంతటి వాళ్లు అయినా కలియుగదైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే అంతా శుభం జరుగుతుందని అనుకుంటారు. ప్రధాని అయినా, అంబాని అయినా, ఆదాని అయినా, ముఖ్యమంత్రులు అయినా, ఇస్రో చీఫ్ అయినా సరే తిరుమలలోని శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే అంతా శుభం జరగుతుందని నమ్ముతారు.

చంద్రయాన్ 3 ప్రయోగానికి ఒక్కరోజు ముందు కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు నితిన్ గడ్కరి సతీసమేతంగా తిరుమల చేరుకుని శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఎంతటి వాళ్లు అయినా సరే ఏదైనా శుభకార్యం చెయ్యాలని అనుకున్న సమయంలో తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తమకు మంచి జరగాలని వేడుకుంటున్నారు.
చంద్రయాన్ 3 మిషన్ ప్రయోగించడానికి సిద్దం అయిన ఇస్రో శాస్త్రవేత్తలు తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథన్ తో పాటు ఇతర శాస్త్రవేత్తలు సతీసమేతంగా తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శిచుకున్నారు. చంద్రయాన్ 3 విజయవంతం కావాలని శ్రీవారిని వేడుకుని చంద్రయాన్ రాకెట్ నమూనాలు శ్రీవారి పాదల చెంత పెట్టి మా ప్రయోగం విజయవంతం కావాలని వేడుకున్నారు.
భారతదేశం కీర్తిప్రతిష్టలు పెంచుతున్న ఇస్రో శాస్త్రవేత్తలకు ఓ నమ్మకం ఉంది. ప్రతి ప్రయోగానికి ముందు తిరుమల చేరుకుంటున్న ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీవారిని దర్శించుకుని వాళ్లు చేస్తున్న ప్రయోగాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నారు. ఛాలా సంవత్సరాల నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు ప్రతి ప్రయోగానికి ముందు తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకుని తరువాత ప్రయోగాలు చేస్తున్నారు.
ఎప్పటిలాగే చంద్రయాన్ 3 ప్రయోగం మొదలు పెట్టకముందు తిరుమలలో ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీవారిని దర్శించుకున్నారు. చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం అయితే ప్రపంచంలోని అగ్రదేశాల జాబితో మన భారతదేశం పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది, చంద్రయాన్ 3 ప్రయోగం ఎప్పుడు మొదలు అవుతుందా, చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం అవ్వాలని భారతదేశంలోని కోట్లాది మంది ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.



Click it and Unblock the Notifications